మోర్తాడ్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో బుధవారం ఉదయం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన ధర్మమిత్ర (45) గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేసేవాడు. గత కొంతకాలంగా తిమ్మాపూరంలో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం అతని శవం చెట్టుకు వేలాడుతుండగా స్థానికులు గమనించారు. మృతుని శరీరంపై గాయాలు ఉండడంతో దుండగులు కొట్టి చంపి తర్వాత చెట్టుకు వేలాడదీశారని అనుమానిస్తున్నారు. మోర్తాడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.