జోడీ... మూడోసారి!?
మీకు తెలుసా? ఆల్మోస్ట్ ఐదేళ్లు... రవితేజ, కాజల్ అగర్వాల్ జంటగా నటించి! ఇప్పటివరకూ వీళ్లిద్దరూ రెండు సినిమాలు చేశారు. రవితేజ ‘వీర’లో కాజల్‌ది చిన్న పాత్రే. ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. కానీ, ‘సారొచ్చారు’లో మాత్రం ఇద్దరూ ఫుల్లుగా సందడి చేశారు. రవితేజ–కాజల్ కెమిస్ట్రీకి, ‘సారొచ్చారు’లో ఇద్దరూ చేసిన కామెడీ సీన్లకు మంచి పేరొచ్చింది. కానీ, ఆ తర్వాత వీళ్లిద్దర్నీ ఎవరూ జంటగా చూపించలేదు.
ఇప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల ఆ ప్రయత్నం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్! రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడామె చేతిలో ఉన్నది ఒక్కటంటే ఒక్కటే తెలుగు సినిమా. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎమ్మెల్యే’లో నటిస్తున్నారు. తమిళంలో విజయ్‌కు జోడీగా నటించిన ‘మెర్సల్’ విడుదల వచ్చే నెలలోనే! సో, రవితేజ–శ్రీనువైట్ల సినిమాలో కాజల్ నటించే ఛాన్స్ ఎక్కువే!!
రన్నింగ్ ట్రైన్లో రాజా ఫైట్
రవితేజ అంధుడిగా నటిస్తున్న సినిమా ‘రాజా... ది గ్రేట్’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో జరుగుతోంది. రన్నింగ్ ట్రైన్లో రవితేజపై హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి ప్లాన్ చేసినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. షూటింగ్ సంగతి పక్కన పెడితే... సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సిన్మా టైటిల్ ట్రాక్‌ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.