Thompson
-
యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో హత్య
న్యూయార్క్: అమెరికాలో ఆరోగ్యరంగ దిగ్గజం యునైటెడ్‌హెల్త్ గ్రూప్ సంస్థలో ఇన్సురెన్స్ విభాగమైన యునైటెడ్‌హెల్త్‌కేర్ సంస్థకు సీఈఓగా సేవలందిస్తున్న బ్రియాన్ థాంప్సన్ హత్యకు గురయ్యారు. బుధవారం ఉదయం అమెరికాలోని మిడ్‌టౌన్ మన్హాట్టన్లో గుర్తుతెలియని ఆగంతకుడు కాల్పులు జరిపాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన థాంప్సన్పైకి గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్టు దర్యాప్తు అధికారి చెప్పారు. -
సెకనులో 5000వ వంతు తేడాతో...
గన్ పేలింది... పురుషుల 100 మీటర్ల పరుగు ప్రారంభమైంది... ఎనిమిది మంది అసాధారణ అథ్లెట్లు దూసుకుపోయారు. 30 మీటర్లు ముగిసేసరికి థాంప్సన్ తొలి స్థానంలో, కెర్లీ రెండో స్థానంలో ఉండగా... అందరికంటే నెమ్మదిగా 0.178 సెకన్ల రియాక్షన్ టైమ్‌తో ఆలస్యంగా మొదలుపెట్టిన లైల్స్ చివరగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 60 మీటర్లు ముగిసేసరికి థాంప్సన్, కెర్లీ తొలి రెండు స్థానాల్లోనే కొనసాగగా... లైల్స్ మూడో స్థానానికి దూసుకుపోయాడు. కానీ తర్వాతి 40 సెకన్లలో కథ పూర్తిగా మారింది. లైల్స్ ఒక్కసారిగా అద్భుతాన్ని చూపించాడు. మెరుపు వేగంతో చిరుతలా చెలరేగిపోయి లక్ష్యం చేరాడు. 90 మీటర్ల వరకు కూడా ఏ దశలోనూ అగ్రస్థానంలో లేని లైల్స్ అసలైన ఆఖరి 10 మీటర్లలో అందరినీ వెనక్కి నెట్టేశాడు. ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగులో కొత్త చాంపియన్‌గా అవతరించాడు. 100 మీటర్ల స్ప్రింట్‌లో కొత్త విజేతస్వర్ణం గెలుచుకున్న అమెరికన్ నోవా లైల్స్జమైకా అథ్లెట్ థాంప్సన్‌కు రెండో స్థానంఇద్దరూ 9.79 సెకన్లలో రేసు పూర్తిఫోటో ఫినిష్‌తో తేలిన ఫలితం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన అథ్లెట్‌ను నిర్ణయించడం అంత సులువుగా జరగలేదు. నోవా లైల్స్ (అమెరికా), కిషాన్ థాంప్సన్ (జమైకా) ఇద్దరూ 9.79 సెకన్లలోనే రేసు పూర్తి చేశారు. దాంతో ‘ఫోటో ఫినిష్’ను ఆశ్రయించాల్సి వచి్చంది. చాలాసేపు ఉత్కంఠ నెలకొంది. తామిద్దరిలో ఎవరూ గెలిచామో కూడా తెలీని లైల్స్, థాంప్సన్ ఒకరి భుజంపై మరొకరు చేయి వేసి ఏం జరిగిందో ఎదురు చూస్తూ వచ్చారు. చివరకు ఇద్దరి మధ్య తేడా సెకనులో 5000వ వంతు మాత్రమే అని తేలింది. లైల్స్ టైమింగ్ 9.79 (.784) సెకన్లు కాగా, థాంప్సన్ టైమింగ్ 9.79 (.789)గా వచి్చంది. దాంతో 20 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగు గెలిచిన అమెరికా అథ్లెట్‌గా లైల్స్ ఘనత సాధించగా... 98 మీటర్ల పాటు ఆధిక్యంలో ఉండి కూడా థాంప్సన్ రజతానికే పరిమితమయ్యాడు. ఫ్రెడ్ కెర్లీ (అమెరికా; 9.81 సెకన్లు) కాంస్య పతకం గెలుచుకున్నాడు.పారిస్: అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్ పురుషుల 100 మీటర్ల పరుగు ఊహించినంత ఉత్కంఠను రేపి అదే స్థాయిలో ఆసక్తికర ఫలితాన్ని అందించింది. గత కొంత కాలంగా స్ప్రింట్స్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కూడా అయిన నోవా లైల్స్పై అంచనాలు పెరిగాయి. దానికి తగినట్లుగా అతను సిద్ధమయ్యాడు. తాజా రేసులో కూడా లైల్స్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. పరుగు పూర్తి చేసేందుకు లైల్స్‌కు 44 అంగలు పట్టగా, థాంప్సన్ 45 అంగలు తీసుకున్నాడు. చివరకు ఇదే తేడాను చూపించింది.27 ఏళ్ల లైల్స్ తన కెరీర్ అత్యుత్తమ టైమింగ్‌తో ఒలింపిక్ స్వర్ణాన్ని అందుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో అత్యంత హోరాహోరీగా సాగిన 100 మీటర్ల పరుగు ఇది. ఫైనల్లో పాల్గొన్న ఎనిమిది మంది కూడా 10 సెకన్లలోపు పరుగు పూర్తి చేయడం ఇదే మొదటిసారి. విజేతకు, చివరి స్థానంలో నిలిచిన అథ్లెట్ టైమింగ్‌కు మధ్య అతి తక్కువ (0.12 సెకన్లు) తేడా మాత్రమే ఉండటం కూడా మరో విశేషం. ఈ రేసులో 4వ, 5వ, 6వ, 7వ, 8వ స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఆయా స్థానాల్లో కొత్త ప్రపంచ రికార్డు టైమింగ్స్‌ను నమోదు చేయడం మరో ఆసక్తికర అంశం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ఇటలీ స్ప్రింటర్ మార్సెల్ జాకబ్స్ ఈసారి ఐదో స్థానంతో ముగించాడు. అనామకుడేమీ కాదు!100 మీటర్ల పరుగులో విజేతగా నిలిచి ‘ఫాస్టెస్ట్ మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్న నోవా లైల్స్ అనూహ్యంగా దూసుకు రాలేదు. గత కొంత కాలంగా అతను అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారిన అతను స్ప్రింట్స్‌లో మంచి విజయాలు సాధించాడు. వరుసగా మూడు వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అతను పతకాలు గెలుచుకున్నాడు. 2019లో 200 మీ., 4్ఠ100 మీటర్ల రిలేలో 2 స్వర్ణాలు గెలుచుకున్న అతను 2022లో కూడా ఇవే ఈవెంట్లలో స్వర్ణం, రజతం సాధించాడు. అయితే 2023లో బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్íÙప్లో అతని కెరీర్లో హైలైట్ ప్రదర్శన వచి్చంది. ఈ ఈవెంట్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలేలలో స్వర్ణాలు సాధించిన అతను...దిగ్గజం ఉసేన్ బోల్ట్ (2015) తర్వాత ఒకే ప్రపంచ చాంపియన్‌ప్‌లో ‘ట్రిపుల్’ సాధించిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ ప్రదర్శన వల్లే ఒలింపిక్స్‌లోనూ అతనిపై అంచనాలు పెరిగాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలవడంలో సఫలమైన లైల్స్... అంతకుముందు అమెరికా ఒలింపిక్ ట్రయల్స్‌లో విఫలం కావడంతో 100 మీటర్ల పరుగులో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఇప్పుడు అదే ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న అతను, 200 మీటర్ల పరుగులోనూ స్వర్ణంపై గురి పెట్టాడు. ‘ఫోటో ఫినిష్’ ఈ విధంగా... రేస్ సమయంలో నిర్వాహకులు ‘స్లిట్ వీడియో సిస్టం’ను ఏర్పాటు చేసి దీనిని ఫినిషింగ్ లైన్‌కు అనుసంధానిస్తారు. అథ్లెట్లు లైన్‌ను దాటే సమయంలో ఈ వీడియో సిస్టం సెకనుకు 2000 చొప్పున అత్యంత స్పష్టమైన చిత్రాలు (స్కానింగ్) తీస్తుంది. ఎవరైనా అథ్లెట్ అడ్డు వచ్చి మరో అథ్లెట్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉండే ప్రమాదం ఉండటంతో ట్రాక్‌కు రెండోవైపు కూడా అదనపు కెమెరాను ఏర్పాటు చేస్తారు. ఈ రేసు ముగింపు క్షణాన్ని చూస్తే లైల్స్కంటే ముందే థాంప్సన్ కాలు లైన్‌ను దాటినట్లుగా కనిపిస్తోంది. కానీ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నిబంధనల ప్రకారం అథ్లెట్ కాలుకంటే అతని నడుము పైభాగం (ఛాతీ, పొత్తికడుపు, వీపు) ముందుగా లైన్‌ను దాటాలి. సరిగ్గా ఇక్కడే లైల్స్ పైచేయి సాధించాడు. ఫోటో ఫినిష్‌లో దీని కారణంగానే టైమింగ్ విషయంలో మరింత స్పష్టత వచ్చింది. -
వరుస పసిడి పతకాలు.. ఏకైక మహిళా అథ్లెట్‌గా
ఒలింపిక్స్ మహిళల అథ్లెటిక్స్‌లో జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ హెరా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మంగళవారం జరిగిన మహిళల 200 మీటర్ల ఫైనల్ రేసులో ఆమె విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ‘స్ప్రింట్’ రేసుల్లో ‘డబుల్’ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఎలైన్ 100, 200 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు గెల్చుకుంది. ఫలితంగా వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు నెగ్గిన ఏకైక మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో మాత్రం ఉసేన్ బోల్ట్ (జమైకా) వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచాడు. టోక్యో: ఒలింపిక్స్‌లో స్ప్రింట్ రేసు అంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు ఉసేన్ బోల్ట్. అతడు అంతలా స్ప్రింట్ రేసులను తన ప్రదర్శనతో ప్రభావితం చేశాడు. తాజా ఒలింపిక్స్‌లో అటువంటి ప్రదర్శననే జమైకన్ మహిళా స్ప్రింటర్ ఎలైన్ థామ్సన్ హెరా ప్రపంచానికి చేసి చూపింది. ఒకవైపు స్ప్రింట్ రేసుల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన జమైకన్ పురుష అథ్లెట్లు విఫలమవుతుంటే... మహిళల విభాగంలో మాత్రం ఎలైన్ అదరగొట్టింది. నాలుగు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన ఆమె మరోసారి మెరిసింది. మంగళవారం జరిగిన 200 మీటర్ల పరుగులోనూ పసిడిని తెచ్చే ప్రదర్శనను చేసింది. 21.53 సెకన్లలో అందరికంటే ముందుగా రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. తద్వారా స్ప్రింట్ (100, 200 మీటర్లు) ఈవెంట్లను క్లీన్ స్వీప్ చేసింది. 2016 ‘రియో’లోనూ థామ్సన్ స్ప్రింట్ ఈవెంట్లను క్లీన్ స్వీప్ చయడం విశేషం. ఇలా రెండు వరుస ఒలింపిక్స్‌ల్లోనూ 100, 200 మీటర్లలో స్వర్ణాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. క్రిస్టినే ఎమ్‌బోమా (నమీబియా; 21.81 సెకన్లు) రజతం... గాబ్రియేలా థామస్ (అమెరికా; 21.87 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. ఈ నెల 6న జరిగే మహిళల 4*100 టీమ్ రిలేలోనూ ఎలైన్ థామ్సన్ బరిలోకి దిగనుంది. Elaine Thompson-Herah does it again! It is the double-double for the #JAM sprint queen in 21.53!#Gold women’s 200m Tokyo 2020#Gold women’s 100m Tokyo 2020#Gold women’s 200m Rio 2016#Gold women’s 100m Rio 2016@WorldAthletics | #StrongerTogether | #Tokyo2020 | #Athletics pic.twitter.com/AENA2JzT1X — Olympics (@Olympics) August 3, 2021 -
మరింత ఫ్రెష్‌గా..
ప్రతి దానికీ ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.. మందులకు, కూల్ డ్రింక్‌లకు, పాలప్యాకెట్లకు.. ఇలా అన్నిటికీ.. మరి కూరగాయలకు? పళ్లకు?? మనం వండిన ఆహారానికి??? వీటి ఎక్స్పైరీ డేట్ తెలిసేదెలా? నేడే కొనండి.. ఆలసించిన ఆశాభంగం.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. రెండు కొంటే ఐదు ఫ్రీ సూపర్ మార్కెట్లో బోలెడన్ని ఆఫర్లు.. తక్కువకు వస్తున్నాయని కొనేశాం.. ఫ్రిజ్‌లో తోసేశాం.. కళ్లకు కనిపించినవి వాడుతున్నాం.. కానీ కనిపించకుండా కొన్ని లోలోపలే పాడైపోతున్నాయి.. ఆహారం వృథా.. చివర్లో చూసుకుని.. చేసేది లేక చెత్తకుప్పలో పడేయాల్సిన దుస్థితి ఇంతకీ పరిస్థితి మారేదెలా? ఇంట్లో జరిగే ఆహార వృథా.. చూడ్డానికి చిన్నదే కానీ ఓ పెద్ద సమస్య. దానికి పరిష్కారం ఈ స్మార్ట్ కంటెయినర్లని అంటోంది షికాగోకు చెందిన ఒవీ స్మార్టర్ వేర్. ఎందుకంటే వీటికి తగిలించి ఉండే ఎలక్ట్రానిక్ డిస్క్‌లు ఎప్పటికప్పుడు ఆహార పదార్థాల తాజాదనంపై మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటాయట. ఇవి ఇంటర్నెట్తో ఆనుసంధానమై ఉంటాయి. ఆన్లైన్ డాటాబేస్ ఆధారంగా పదార్థాలు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయన్న వివరాలను అంచనా వేస్తాయి. రంగుల ఆధారంగా వినియోగదారులను అప్రమత్తం చేస్తాయి. డిస్క్ పచ్చ రంగులో ఉంటే తాజాగా ఉందని అర్థం. అదే పసుపు రంగులోకి మారితే.. ఫ్రిజ్‌లో ముందు వాడాల్సిన లేదా తినాల్సిన వస్తువు అదే అని సూచిస్తున్నట్లు లెక్క.. ఎరుపు రంగులోకి మారితే.. పాడైనట్లు అన్నమాట. ఇవి మన ఫోన్లోని ప్రత్యేకమైన యాప్‌తో లింక్ చేసి ఉంటాయి. డిస్క్ పసుపు రంగులోకి మారగానే.. ఫోన్‌కు మెసేజ్ రూపంలో సమాచారం వస్తుంది. అంతేకాదు.. స్మార్ట్ కంటెయినర్లో ఉన్న ఆహార పదార్థాలతో ఎలాంటి వంటలు చేసుకోవచ్చు. మీ ఏరియాలోని ఇతరులతో పోలిస్తే.. మీరు చేస్తున్న ఆహార వృథాను కూడా తెలియజేస్తుంది. ఒవీ స్మార్ట్‌వేర్ మీ సాధారణ ఫ్రిజ్‌ను స్మార్ట్ ఫ్రిజ్‌గా మారుస్తుందని ఆ కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు థాంపన్స్ అన్నారు. ‘చాలా మందికి ఆహారాన్ని వృథా చేయడం ఇష్టం ఉండదు. కానీ అలా జరిగిపోతూ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోతుంటారు.. ఒక్కోసారి ప్యాకెట్లకు ప్యాకెట్లు పడేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా ప్రతి ఇల్లు లెక్కేస్తే.. ఈ వృథా చాలా భారీగా ఉంటుంది. ఈ కంటెయినర్లు ఆహార వృథాను తగ్గించేందుకు తోడ్పడుతాయి’ అని తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుంటున్నారు. మార్చి నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర రూ. 9,100. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సీఐపై అన్నాడీఎంకే నేత ఫిర్యాదు
టీనగర్, న్యూస్‌లైన్: అవినీతి కేసులో అరెస్టయిన ఇన్స్పెక్టర్ థామ్సన్‌పై అన్నాడీఎంకే నేత ఒకరు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జేజే నగర్ పోలీసు ఇన్స్పెక్టర్ థామ్సన్ శనివారం సాయంత్రం ఏసీబీ పోలీసులకు పట్టుబడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నేత రమేష్‌పై విజయ అనే మహిళ జేజే నగర్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. అందులో రూ.5 లక్షల రుణం తీసుకున్న రమేష్ ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలిపారు. దీని గురించి విచారణ జరిపిన థామ్సన్ విజయ ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అన్నాడీఎంకె నేత రమేష్ వద్ద రూ.25 వేలు లంచంగా కోరారు. శనివారం మధ్యాహ్నం పాడికుప్పం రోడ్డులో రమేష్ లంచం సొమ్ము అందజేశాడు. ఆ సమయంలో అక్కడ పొంచివున్న అడిషనల్ పోలీసు ఎసీప షణ్ముగ ప్రియ, డీఎస్పీ మురుగేశన్ ఇతర పోలీసు సిబ్బంది థామ్సన్‌ను చుట్డుముట్టారు. పోలీసులను చూడగానే పరారయ్యేందుకు ప్రయత్నించిన అతనిని అదుపులోని తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత తిరువళ్లూరు కోర్టులో హాజరుపరచిన ఇన్స్పెక్టర్ థామ్సన్ జనవరి మూడవ తేదీ వరకు రిమాండ్‌లో ఉంచాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అన్నానగర్ 47వ డివిజన్ అన్నాడీఎంకే కోశాధికారి ఆనంద్‌కుమార్. ఈయన ఆదివారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో థామ్సన్‌పై ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఫిర్యాదు ఇచ్చేందుకు వీలు కాలేదు. దీని గురించి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 10 నవంబర్ 2006లో థామ్సన్ తనను ఒక వ్యాపారిగా పరిచయం చేసుకుని తన ఇంటిని బాడుగకు తీసుకున్నాడని దీంతో అన్నానగర్ వెస్ట్ బాలాజీ నగర్ పాడికుప్పం రోడ్డులో గల తన ఇంటిని బాడుగకు ఇచ్చానని తెలిపారు. అడ్వాన్సుగా రూ.50వేలు, ఐదువేలు బాడుగకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందన్నారు. 2008 జనవరిలో బాడుగ అందచేశారని రెండు సంవత్సరాల తరువాత అగ్రిమెంటును రెన్యువల్ చేసేందుకు వెళ్లగా అతడు పోలీసు ఇన్స్పెక్టర్గా తెలిసిందన్నారు. తరువాత అతను బాడుగ ఇవ్వకుండా మోసగిస్తూ వచ్చాడన్నారు. దీనిగురించి పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి స్పెషల్ సెల్‌కు ఫిర్యాదు చేశానన్నారు. ఇలా వుండగా అతనికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలిసిందని దీంతోతానుకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని అన్నారు. ఆ కేసు వాపసు తీసుకోవలసిందిగా థామ్సన్ ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.ఈ సమయంలో థామ్సన్ అవినీతి కేసులో పట్టుబడ్డారని తెలిసి అందుచేత తన ఇంటిని తిరిగి అప్పగించాల్సిందిగా తాను ఫిర్యాదులో పేర్కొంటున్నట్లు తెలిసింది.