ఏసీబీ దాడితో అధికారికి గుండెపోటు
ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ట్రెజరీలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సీనియర్ అసిస్టెంట్ తోటకూర శ్రీనివాస్ రూ. 2500 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీడీ ఆకస్మిక దాడులతో ఊహించిన శ్రీనివాస్ గుండెపోటుకు గురైయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.