Thousand crores
-
ప్రభాస్ తో ప్రభాస్ కే పోటీ రచ్చ లేపుతున్న 1000 కోట్ల వార్..
-
మరో రూ. 8వేల కోట్లు కట్టిన టెల్కోలు
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిలకు సంబంధించి టెలికం సంస్థలు మంగళవారం మరో రూ. 8,000 కోట్లు కేంద్రానికి చెల్లించాయి. వొడాఫోన్ ఐడియా రూ. 3,043 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 1,950 కోట్లు, రిలయన్స్ జియో రూ. 1,053 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ. 2,000 కోట్లు కట్టాయి. ఇప్పటికే పూర్తి సెటిల్మెంట్ కోసం రూ. 2,197 కోట్లు కట్టామన్న టాటా టెలీసర్వీసెస్.. ఒకవేళ లెక్కల్లో వ్యత్యాసాలేమైనా వచ్చినా సర్దుబాటు చేసేందుకు వీలుగా అదనపు మొత్తం కట్టినట్లు వెల్లడించింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) సీఈవో రవీందర్ టక్కర్ మరోసారి టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో భేటీ అయ్యారు. అయితే, సమావేశం వివరాలు ఆయన వెల్లడించలేదు. అటు.. వీఐఎల్ ఎప్పట్లోగా బాకీల స్వీయ మదింపు పూర్తి చేస్తుందన్న ప్రశ్నకు స్పందించేందుకు టక్కర్ నిరాకరించారు. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీ (ఎస్‌యూసీ) బాకీల కింద 15 టెలికం సంస్థలు.. సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. ఏజీఆర్ బాకీల విషయంలో టెల్కోల స్వీయ మదింపు, తమ లెక్కల్లో వ్యత్యాసాలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయా సంస్థలకు టెలికం శాఖ త్వరలోనే లేఖలు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
వెయ్యి కోట్ల పాత కరెన్సీ తరలింపు..
చెన్నై: నెల్లె ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలతో కలిసి పాత నోట్లను సేకరించారు. ప్రజలు, సంస్థల నుంచి సేకరించిన పాత రూ.500, రూ.1000 నోట్లు బుధవారం తిరుచందూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా చెన్నైకు తీసుకు వచ్చారు. తిరునల్వేలి జిల్లా నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా తీసుకువచ్చిన వెయ్యి కోట్ల విలువైన కరెన్సీని భద్రంగా రిజర్వ్ బ్యాంకుకు అప్పగించారు. అందుకోసం ఆ రైలుకు ప్రత్యేక బోగీని జత చేశారు. ఆ బోగీలో ఒక సహాయ కమిషనర్, ఇద్దరు ఇన్స్పెక్టర్లతో సహా 13 మంది పోలీసుల పహారాతో రైలులో ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వెంటనే నగదు ఉన్న బోగీని మాత్రమే విడిగా తీసి పోలీసు అధికారుల సమక్షంలో రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆ నగదును పెట్టెను తెరిచారు. ఆ బోగీ నుంచి 174 క్యాష్ బాక్స్ లను లారీలలో ఎక్కించి భద్రంగా బ్రాడ్వేలో గల రిజర్వ్ బ్యాంకుకు తీసుకెళ్లారు. వాటి మొత్తం విలువ వెయ్యి కోట్లని అధికారులు తెలపారు. మోదీ ప్రభుత్వం చేసిన నోట్ల రద్దు నవంబర్ 8వ తేది నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
‘పాలమూరు’ పూర్తికి రూ. 35 వేల కోట్లు!
ప్రాజెక్టు నిర్మాణానికిభారీ స్థాయిలో కానున్న వ్యయం రెండు, మూడో దశ సర్వే అనంతరం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అంచనా నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శంకుస్థాపన చేయనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయం భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు మొత్తంగా రూ. 32 వేల కోట్ల నుంచి రూ. 35 వేల కోట్లు అవసరం ఉంటుందని రెండు, మూడో దశ సర్వే పూర్తి చేసిన అనంతరం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అంచనాకు వచ్చింది. మొదటి దశకు రూ. 15,850 కోట్ల మేర అవసరమని తేల్చిన సంస్థ, రెండు, మూడు దశలకు రూ. 20 వేల కోట్లు అవసరమని లెక్కగట్టినట్లు తెలిసింది. అదే నిజమైతే రాష్ట్రంలో రూ.38,500 కోట్లతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తర్వాత ప్రభుత్వం చేపట్టే భారీప్రాజెక్టు ఇదే. జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని తరలించేందుకు మహబూబ్‌నగర్ నుంచి రంగారెడ్డి మీదుగా నల్లగొండ వరకు నీటిని తరలించి సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని పాలమూరు ఎత్తిపోతలను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఈ మొత్తం ప్రాజెక్టులో 3 భారీ రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంటుందని తేల్చారు. ఇందులో తొలి దశ రిజర్వాయర్ అయిన కోయిల్‌కొండ వరకు జూరాల నుంచి నీటిని ఎత్తిపోసి తరలించేందుకు 3 కిలోమీటర్ల ఓపెన్‌చానల్, మరో 25 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వా ల్సి ఉంటుందని గుర్తించారు. దాంతోపాటే పంపింగ్ స్టేషన్ వద్ద 160 మెగావాట్ల సామర్థ్యంగల 14 పంపులు అవసరమని పేర్కొన్నారు. ఈ దశ నిధులకు త్వరలోనే అనుమతులు మంజూరు చేసి ఏప్రిల్ తొలి వారంలో శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించారు. రెండో రిజర్వాయర్‌ను రంగారెడ్డి జిల్లా గండేడు వద్ద 45 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో నిర్మించాలని ప్రతిపాదించారు. రిజర్వాయర్ నుంచి 2 ప్రధాన కాలువల కింద మొత్తంగా 5.2 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. ఇక్కడి పంపింగ్ స్టేషన్ వద్ద 160 మెగావాట్ల సామర్థ్యంగల 5 పంపులను ప్రతిపాదించారు. రిజర్వాయర్ కింద 8 గ్రామాలు,12,283 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేల్చారు. రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీదేవునిపల్లిలో 10 టీఎంసీల సామర్థ్యంతో మూడో రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. దీని నుంచి 3 ప్రధాన కాలువలను ప్రతిపాదించిన సర్వే సంస్థ, సుమారు 4.05 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ 70 మెగావాట్ల సామర్థ్యంగల 4 పంపులను ప్రతిపాదించారు. దీని కింద 2 గ్రామాలు, 4,100 ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. మొత్తంగా వి ద్యుత్ అవసరాలు 3,500 మెగావాట్ల వరకు ఉండొచ్చని గుర్తించారు. వీటన్నింటికీ మొత్తంగా రూ.35 వేల కోట్ల మేర అవసరమని సర్వే సంస్థ తేల్చింది. సీడీవో పరిశీలనలో నివేదిక: ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ పూర్తి చేసిన 2, 3 దశ సర్వే నివేదికను ప్ర స్తుతం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) పరిశీలిస్తోంది. ప్రాజెక్టులో మార్పుచేర్పులపై అధ్యయనం చేస్తోంది. తొలి దశ సర్వేనూ ప రిశీలించిన సీడీవో కొన్ని మార్పులు సూచించడంతో సర్వే సంస్థ అంచనా వ్యయం మరో రూ. వెయ్యి కోట్లు పెరిగింది. ప్రస్తుతం సీడీవో ఏవైనా మార్పులు సూచిస్తే అంచనా వ్యయాల్లో హెచ్చుతగ్గులుండే అవకాశం ఉంది. -
కేసీఆర్‌ను ఓడించడానికి వెయ్యి కోట్లా..!
-
కూచ్.. నిధులు తూచ్
మన ఎంపీలు, మన రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత రైల్వే బడ్జెట్లో స్పష్టంగా కనిపించింది. కొత్త ప్రాజెక్టుల ఊసు లేకుండా ఈ ఏడాది రైల్వేబోర్డు ‘ప్లాన్ హాలిడే’ ప్రకటించిన నేపథ్యంలో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులకు నిధుల వరద పారుతుందన్న ఆశ ఆవిరైంది. ఖర్గే స్వరాష్ట్రానికి లబ్ధి చేకూర్చడంలో భాగంగా ప్రకటించిన రైళ్లు మన గుంతకల్లు డివిజన్ మీదుగా ప్రయాణించనుండటం మాత్రమే ఊరట కలిగిస్తోంది. గుంతకల్లు, న్యూస్‌లైన్: ఊహించినట్లే అయింది. రైల్వే బడ్జెట్లో గుంతకల్లు డివిజన్ పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపులో మొండి చెయ్యి చూపారు. దాదాపు వెయ్యి కోట్లు ఆశిస్తే.. కనీసం 200 కోట్లు కూడా దక్కే పరిస్థితి లేదని ఆంచనా. దీంతో రాయలసీమలో పనులు అదే నత్తనడక రీతిలో కొనసాగుతాయనడంలో సందేహం లేదు. కేంద్ర, రాష్ట్ర సంయుక్త ప్రాజెక్టులకు సైతం అత్తెసరు నిధులతో సర్దుకోకతప్పదని రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాయదుర్గం- తుమకూరు, కదిరి-పుట్టపర్తి, చిక్‌బళ్లాపుర-పుట్టపర్తి రైల్వే మార్గాలను నిర్మించాలని 2008-09లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రైల్వే శాఖపై తీవ్ర వత్తిడి తెచ్చి సంయుక్త భాగస్వామ్యం ప్రాతిపదికన మంజూరు చేయించారు. 2010-11 బడ్జ్జెట్‌లో ఒక్క రూపాయి విడుదల చేయలేదు. 2011-12లో రైల్వే శాఖ రూ.40 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా 50 శాతం విడుదల చేయకపోవడంతోపాటు విడుదల చేసిన నిధులనూ ఖర్చుపెట్టలేదు. 2012-13లో బడ్జెట్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేస్తే తప్ప రైల్వే శాఖ నిధులు ఖర్చుపెట్టమని హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. కొంత మేరకు నిధులు విడుదల చేసింది. 2013-14లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నిధులు విడుదల చేయించే విషయంలో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి మాయమాటలు చెబుతూ వచ్చారు. ఈ ఏడాది కూడా గతేడాది కన్నా భిన్నంగా ఉండదన్న సంకేతాలు రైల్వే వర్గాలు ఇస్తున్నాయి. మరో ఐదారు రోజుల్లో రైల్వే జోన్ కార్యాలయాలకు చేరే పింక్ బుక్‌ల వల్లే అసలు పరిస్థితి తెలుస్తుంది. వంద కోట్లు అవసరమైన గుంతకల్లు విద్యుత్తు లోకోషెడ్డు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్, ధర్మవరం- పాకాల డబ్లింగ్, విద్యుదీకరణ, గుత్తి- బెంగళూరు విద్యుదీకరణ, గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్, గుత్తి షెడ్ అభివృద్ధి, గుంతకల్లు - బళ్లారి సెక్షన్ విద్యుదీకరణ ప్రాజెక్టుల గురించి బడ్జెట్లో పేర్కొనకపోవటంతో ఈ సారి కూడా నిధులు తూతూ మంత్రంగానే ఇచ్చే అవకాశం ఉన్నట్లు రైల్వే వర్గాల సమాచారం. ఇక పుట్టపర్తి - చిక్‌బళ్లాపుర, పుట్టపర్తి -కదిరి, కడప- బెంగళూరు, కదిరి-రాయచోటి, కర్నూలు-మార్కాపురం, మంత్రాలయంరోడ్డు-కర్నూలు మార్గాల ఊసెత్తకుండా, నిధులు మంజూరు చేయకుండా తెలివిగా స్వరాష్ట్రంలోని చిక్‌బళ్లాపుర- కోలార్మార్గానికి గేజ్ కన్వర్షన్ పేరిట ఆధునికీకరణకు రైల్వే మంత్రి మల్లికార్జునఖర్గే నిధులు మంజూరు చేశారు. పనిలో పనిగా బళ్లారి-లింగసూగూరు (వయా సిరుగుప్ప, సింధనూరు), హుబ్లీ- బెల్గాం(వయా కిట్టూరు) నూతన రైల్వే లైన్లను సాధించి పెట్టారు. -
వెయ్యికోట్ల రుణాలిస్తాం
కృష్ణానగర్(మాక్లూర్), న్యూస్‌లైన్ : రబీ సీజన్లో రైతులకు బ్యాంకుల ద్వారా రూ. వెయ్యి కోట్ల రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. శనివారం మండలంలోని కృష్ణానగర్‌లో వరి నాటే యంత్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు రూ. 700కోట్ల రుణాలు సరిపోవని, వెయ్యి కోట్ల రుణాలు అవసరం ఉందని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రూ. 560 కోట్ల రుణాలు చెల్లించినట్లు చెప్పారు. రైతులు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రుణాలు సకాలంలో రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. ఆర్మూర్, బోధన్, భిక్కనూరు మండల కేంద్రాల్లో సోయా సీడ్స్ విత్తన కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రైతులు మార్కెట్లోనే కూరగాయలు అమ్ముకోవాలన్నారు. దళారులకు అమ్ముకోవ ద్దని సూచించారు. రైతులకు సబ్సిడీ పై టాటా ఏసీ వాహనాలు ఇస్తామని వారు ముందుకు రావాలని సూచించారు. పేద ప్రజ లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. కృష్ణానగర్ రైతులు సాగు చేస్తున్న పంటలను ఆడిగి తెలుసుకున్నారు. కృష్ణానగర్ గ్రామ శివారులోని బీటీ రోడ్డు పై కేజ్‌వీల్ ట్రాక్టర్లు నడవడంవల్ల రోడ్డు చెడిపోవడంతో తహశీల్దార్ నారాయణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు చెడిపోతే మళ్ళీ రోడ్లు ఎవ రూ బాగు చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో యాదిరెడ్డి, జేడీఏ నర్సింహ, సహాయ వ్యవసాయ సంచాలకులు నర్సింహచారి, వాజీద్ హుస్సేన్, వెంకటలక్ష్మి, ఏవో హరిక్రిష్ణ, ఏఈ వోలు లక్ష్మీపతి, దివ్య, తహశీల్దార్ నారాయణ, ఎంపీడీవో టీవీఎస్ గోపిబాబు, సర్పంచ్‌లు సుభాష్‌చంద్రబోస్, భూరోల్ల రజిత, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈనెల చివరికల్లా ‘ఆధార్’ పూర్తిచేయాలి కలెక్టరేట్,న్యూస్‌లైన్ : గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ అనుసంధానాన్ని ఈ నెల చివరి క ల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. శనివారం ప్రగతిభవన్‌లో ఆయన మాట్లాడారు.జిల్లాలో 3 లక్ష ల 78వేల 746 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, డిసెంబర్ చివరి కల్లా 2 లక్షల 60 వేల 46 కనెక్షన్లు ఆధార్ సీడింగ్ అనుసంధానంతో 73.74 శాతం పూర్తి చేశారన్నారు. మిగితా కనెక్షన్లు జనవరి చివరి కల్లా పూర్తి చేయాలన్నారు.గ్యాస్ ఏజెన్సీలకు ఈ సీడింగ్ కోసం ఇన్‌చార్జీలుగా నియమించిన డిప్యూటీ తహశీ ల్దార్లు తరచూ పర్యవేక్షణ చేసి, పూర్తి స్థాయిలో సీడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. సమావేశంలో జేసీ హర్షవర్ధన్, డీఎస్ఓ కొం డల్‌రావు, వీఎం దివాకర్ తదితరులు పాల్గొన్నారు.