Three young people died
-
ప్రాణాలు తీసిన అతి వేగం..
హైదరాబాద్: ఇన్నర్ రింగ్‌రోడ్‌పై అర్ధరాత్రి పూట అతివేగం.. దీనికి తోడు ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్.. ఫలితంగా అదుపుతప్పిన బైక్ మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ఘటనా స్థలిలోనే మృత్యువాతపడ్డారు. ఈ ఘోర ప్రమాదం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ చౌరస్తా వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 20 రోజుల క్రితం చనిపోయిన తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేసేందుకు 2 రోజుల్లో స్వగ్రామానికి వెళ్లాల్సిన కొడుకు, ఉద్యోగం కోసం 2 రోజుల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిన యువకుడితోపాటు ఇంజనీరింగ్ చదువుతున్న మరో విద్యార్థి ఈ ప్రమాదంలో మృతి చెందారు. చదువు కోసం నగరానికి.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం మామిడిపల్లి కి చెందిన నిమ్మల పృథ్వీ (21) ఇబ్రహీంపట్నంలోని సీబీఐటీ కాలేజీలో రెండో ఏడాది చదువుతూ కాలేజీ హాస్టల్లోనే ఉంటున్నాడు. ఇతడి తండ్రి శ్రీనివాసులు 20 రోజుల క్రితం మరణించాడు. ఆ కార్యక్రమాలు ముగించుకుని పృథ్వీ ఇటీవలే నగరానికి వచ్చాడు. తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేయడానికి రావాల్సిందిగా కుటుంబీకులు కోరారు. తనకు పరీక్షలు జరుగుతున్నాయని, వారంలో వచ్చి భద్రాచలం వెళ్లి గోదావరిలో నిమజ్జనం చేస్తానంటూ వారికి చెప్పాడు. దీనికోసం పృథ్వీ 2 రోజుల్లో ఇంటికి వెళ్లాల్సింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరికి చెందిన బూషకర్ల ఉదయ్ (23) చౌటుప్పల్‌లో ఉంటూ బీ–ఫార్మసీ చదువుతుండటంతోపాటు ఉద్యో గ వేటలో ఉన్నాడు. ఇతడు మరో 2 రోజుల్లో నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సింది. దీనికోసమే సోమవారం సిటీకి వచ్చిన ఇతడు ఉప్పల్‌లో ఉండే స్నేహితుడు ఉదయ్‌రెడ్డి ఇంట్లో ఉంటున్నాడు. సూర్యాపేట ఫణిగిరికే చెందిన విశాఖ ఉదయ్‌రెడ్డి (21) ఇబ్రహీంపట్నంలోని సీబీఐటీ కాలేజీలో బీటెక్ చదువుతూ ఉప్పల్‌లోని తన పెదనాన్న ఇంట్లో ఉంటున్నాడు. భోజనానికి వెళ్తూ: స్నేహితులైన ఈ ముగ్గురూ సోమవారం రాత్రి ఉప్పల్‌లో కలుసుకున్నారు. భోజనం చేయాలని భావించారు. అర్ధరాత్రి కావడంతో ఆ ప్రాంతంలో హోటళ్లు మూసివేశారు. దీంతో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌కు ముగ్గురూ పల్సర్ వాహనంపై బయలుదేరారు. ఉదయ్ బైక్ నడుపుతుండగా ఇద్దరూ వెనుక కూర్చున్నారు. అర్ధరాత్రి కావడంతో ఉదయ్ వాహనాన్ని మితిమీరిన వేగంతో ముందుకు పోనిచ్చాడు. మెట్టుగూడ చౌరస్తాలోని పెట్రోల్ బంక్ వద్ద 1.30 గంటల ప్రాంతంలో బైక్ అదుపు తప్పింది. బైక్‌ను ఉదయ్ కంట్రోల్ చేయలేకపోవడంతో మెట్రో పిల్లర్(ఎంఎస్బీ 9)ను బలంగా ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ముగ్గురూ ఎగిరి ఇద్దరు రోడ్డుపై, మరొకరు మెట్రో పిల్లర్ల మధ్యలో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇతర వాహనచోదకులు అక్కడికి వెళ్లి చూడగా.. ముగ్గురు యువకులూ అక్కడ అచేతనంగా పడి ఉన్నారు. దీంతో వారు లాలాగూడ పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ముగ్గురు యువకుల మృతిపై సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న వారిని చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. -
విషాద పర్యటన
సేలం: కాంచీపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. వివరాలు.. చెన్నైలోని మన్నడి ప్రాంతంలోని బోర్కర్ మర్చెంట్ వీధికి చెందిన తొమ్మిది మంది యువకులు దీపావళి సెలవుల్లో పర్యాటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓ ఇన్నోవా కారులో శనివారం ఉదయం చెన్నై నుంచి ఏలగిరి పర్యాటనకు బయలుదేరారు. కారులో సజావిక్ (25), రియాజ్ (20), ఫైసల్ (24) యాకూప్ (25), ఆసిఫ్ (21), ఇంతియాజ్ (23), ముహ్మద్ యాసిఫ్, ఇన్సాద్ ఇర్ఫాన్ (25), ఇన్సా (25) ఉన్నారు. వీరంతా స్నేహితులు. వారిలో ఫైసల్ కారును నడిపాడు. కారును ఢీకొన్న లారీలు.. కారు వేలూరు వైపుగా కాంచీపురం సమీపం చెన్నై– బెంగళూరు జాతీయ రహదారిలోని చిన్నయ్యన్ సత్రం వద్ద వెళుతోంది. యువకులంతా ఆనందంగా పాటలు పాడుకుంటూ వెళుతున్నాడు. అప్పుడు వెనుకనే వస్తున్న ఓ లారీ అకస్మాత్తుగా వేగం పెంచి కారును ఢీకొంది. దీంతో అదుపుతప్పిన కారు రోడ్డు డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపై ఎక్కింది. అదే సమయంలో వేలూరు నుంచి చెన్నైకు వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా కారును ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జై కారులోని సలీం కుమారుడు సజావిక్ (25), రియాజ్ (20), కారు నడిపిన ఫైసల్ (24) సంఘటనా స్థలంలోనే దుర్మణం చెందారు. ఇంకా యాకూప్ (25), ఆసిఫ్ (21), ఇంతియాజ్ (23), ముహ్మద్ యాసిఫ్, ఇన్సాద్ ఇర్ఫాన్ (25), ఇన్సా (25) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల విచారణ.. సమాచారంతో డీఎస్పీ బాలసుబ్రమణియన్, తాలూకా సీఐ వెట్రిసెల్వన్, పోలీసులు రెండు ఆంబులెన్స్‌లు, రెండు అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడా అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంచీపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఫైసల్ తమ్ముడు ఆసిఫ్. ప్రమాద విషయం తెలియడంతో చెన్నై నుంచి ఆ యువకుల కుటుంబీకులు కాంచీపురానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. -
ఎంత కష్టం... ఎంత ఘోరం..
► పొట్టపోషణకు వెళ్లి ముగ్గురి యువకుల మృత్యువాత ► చెన్నైలోని ఓ హోటల్ ట్యాంకులో విషవాయువుకు బలి ► విషయం తెలుసుకున్న లక్ష్మీపురంలోని కన్నవారి రోదన ► హుటాహుటిన చెన్నై బయలుదేరిన కుటుంబాలు వారంతా నిరుపేదలు. అందులో ఓ ముగ్గురు ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టపోషణకు వలసబాట పట్టారు. రోజంతా కాయకష్టం చేసి... సంపాదించిన దాంట్లో కొంత స్వగ్రామంలోని కన్నవారికి పంపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న ఆ యువకులు హఠాత్తుగా కన్నుమూశారు. వారిపైనే ఆధారపడిన ఆ కుటుంబాలు నేడు దిక్కుతోచక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. పెళ్లీడుకు రాకుండానే... ప్రాణాలు కోల్పోయిన తనయులను తలచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నాయి. ఆదుకుంటున్న పిల్లలు అందని తీరాలకు చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. విజయనగరం జిల్లా : ఒకే ఊరికి చెందిన వారంతా ఒకేచోట పనిచేస్తున్నారు. తోడునీడగా మెలిగి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. పని చేస్తున్న చోటే మురుగునీటిని శుభ్రం చేసేందుకు ట్యాంకులోకి దిగి ఊపిరాడక మృత్యువాత పడ్డారు. చెన్నైలోని పెరంబూరులో చోటు చేసుకున్న ఈ సంఘటనలో మృత్యువాత పడిన ముగ్గురూ సీతానగరం మండలం లక్ష్మీపురానికి చెందిన వారే. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన పడ్డ సత్యనారాయణ(22), పువ్వల రామకృష్ణ (20), చప్ప వినయ్(22)లు చెన్నెలోని మూడేళ్ళుగా సంగీతా రెస్టారెంట్లో పని చేస్తున్నారు. శనివారం విధులు ముగించుకుని నివాసస్థలానికి వెళ్తున్న సమయంలో హోటల్ మేనేజరు పిలిచి హోటల్‌ను ఆనుకుని ఉన్న మురుగునీటి ట్యాంకు శుభ్రం చేయమని పురమాయించాడు. తొలుత రామకృష్ణ అందులో దిగి ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో వినయ్ వెళ్లాడు. తానూ రాకపోవడంతో చివరిగా సత్యనారాయణ దిగాడు. ముగ్గురూ అందులోంచి తిరిగి రాకపోవడంతో విషవాయువు ప్రభావంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై మృత్యువాతపడ్డారని నిర్ధారించుకున్నారు. వెంటనే స్వగ్రామానికి సమాచారం వీరికి పని పురమాయించిన మేనేజర్ రెస్టారెంట్ యజమానికి సమాచారం అందించి పరారయ్యాడని చెన్నైలోనే నివాసం ఉంటున్న రామకృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని వెనువెంటనే లక్ష్మీపురంలోని సత్యనారాయణ, వినయ్ కుటుంబ సభ్యులకు అందించడంతో ఇక్కడివారంతా బోరున విలపించారు. కుటుంబాలను ఆదుకుంటూ.. ఎంతో ఒద్దికగా బతుకుతున్న తమ పిల్లలు ఇలా అర్ధంతరంగా తనువుచాలిస్తారని ఊహించలేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబానికి ఆసరాగా నిలవాలని... సన్నకారు వ్యవసాయ కుటుంబానికి చెందిన పడ్డ సూర్యనారాయణ రమణమ్మలకు ఇద్దరు కుమారులు. అందులో పెద్దకుమారుడు సత్యనారాయణకు ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి సంపాదన సరిపోకపోవడంతో పొట్టపోషణకోసం చెన్నై వెళ్లాడు. అక్కడి రెస్టారెంట్లో మూడేళ్ళుగా పనిచేస్తూ ఆర్ధికంగా కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఇంతలోనే అలా వెళ్లిపోయావా అంటూ ఆ తల్లిదండ్రుల రోదన గ్రామంలో మిన్నంటింది. ఆ ఇంటిదీపం ఆరిపోయింది సామాన్య రైతు కుటుంబానికి చెందిన చప్ప వాసుదేవరావు, చిన్నమ్మి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు వినయ్ ఏడో తరగతివరకూ చదువుకుని కుటుంబానికి ఆసరాగా నిలవాలని మూడేళ్ల క్రితమే చెన్నై వెళ్లి అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. అంతేగాకుండా తన తమ్ముడ్ని కూడా చెన్నై తీసుకు వెళ్ళడంతో ఊళ్లో ఆ ఇద్దరే ఉంటూ తమకున్న తక్కువ భూమిలో పంట పండించుకుని జీవిస్తున్నారు. పెద్ద కొడుకు మరణవార్తతో ఆ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. చెన్నైలోనే కాపురం ఉంటూ... పువ్వల శంకరరావు, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిద్దరూ టెన్్తవరకూ లక్ష్మీపురంలోనే ఉండిlచదివించినప్పటికీ ఆర్థిక స్థోమత లేకపోవడంతో పిల్లలిద్దరినీ తోడ్చుకుని ఆ కుటుంబం మొత్తం మూడేళ్ళక్రితం చెన్నైకి వలస పోయారు. ప్రస్తుతం అక్కడే జీవనం సాగిస్తున్నారు. అందులో పెద్దకుమారుడు రామకృష్ణ ట్యాంకులోకి దిగి మృత్యువాత పడటంతో ఆ కుటుంబం దిక్కుతోచనిదయ్యింది. -
మృత్యువు మింగేసింది
ఆ ముగ్గురు యువకులూ కష్టాన్నే నమ్ముకున్నారు. తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. విధి వారితో ఆటలాడింది. ముగ్గుర్నీ మృత్యువు పొట్టనపెట్టుకుంది. భీమడోలు మండలం అంబర్‌పేట వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో నరసాపురం మండలం వేములదీవి, తూర్పుతాళ్లు గ్రామాలకు చెందిన యువకులు మృతి చెందటంతో ఆ కుటుంబాలు శోకసము ద్రంలో మునిగిపోయూయి. నరసాపురం రూరల్/భీమడోలు, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం సముద్ర తీరప్రాంత గ్రామాల్లో విషాదం నింపింది. వేములదీవి, తూర్పుతాళ్లు గ్రామాలకు చెందిన పరసా ఆదినారాయణ(25), తోట దుర్గాప్రసాద్(22), వలవల సురేష్(21)లు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా కొవ్వూరు- గుండుగొలను రహదారిపై భీమడోలు మండలం అంబర్ పేట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందారు. వీరు మంచినీటి ట్యాంక్ నిర్మాణ పనులు, సెంట్రింగ్ పనులు చేస్తుంటారు. పనుల్లో భాగంగా వారం రోజుల క్రితమే దూబచర్లకు వచ్చి ఉంటున్నారు. బుధవారం రాత్రి పల్సర్ బైక్‌పై భీమడోలు వచ్చిన వీరు తిరిగి దూబచర్ల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాపీపని చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్న యువకుల మృతితో ఆయూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాధిత కుటుంబాలను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో గ్రామాలు హోరెత్తారుు. ముగ్గురిలో ఎవరికీ వివాహాలు కాలేదు. సర్దుగొడపకు చెందిన ఆదినారాయణ తండ్రి అనారోగ్యంతో చాలాకాలం క్రితం మృతి చెందగా ఆరుగురు సంతానాన్ని తల్లి సత్యవతి పెంచింది. అందరిలో చిన్నవాడు కావడంతో పెళ్లికి సన్నాహాలు చేస్తున్నారని ఆ ప్రాంతవాసులు తెలిపారు. తూర్పుతాళ్లుకు చెందిన తోట దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. కుమారుడి మృతితో వీరుపడే వేదనను బంధుమిత్రులు చూసి కంట తడిపెడుతున్నారు. మరణ వార్తను ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలుకరిస్తూ ఉండేవాడని కరింశెట్టివారిపాలెం గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పుతాళ్లుకు చెందిన వలవల సురేష్ ఇంటికి పెద్ద కుమారుడు కావడంతో తమ కుటుంబానికి దిక్కు ఎవరని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. సురేష్ దుబాయ్ వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. గురువారం రాత్రికి ఏలూరులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు గ్రామానికి చేరుకుంటాయని బంధువులు తెలిపారు.