thunder strom
-
కాలిఫోర్నియాలో వరద బీభత్సం.. నగరాన్ని వీడాలని హెచ్చరిక
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాను భీకర వరదలు ముంచెత్తాయి. కాలిఫోరి్నయా, లాస్ ఏంజెలిస్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలిఫోర్నియా జనాభాలో ఏకంగా 90 శాతం మంది ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. More deadly storms have slammed the California coast with torrential rains and thunderstorms, causing massive flooding, landslides and widespread power outages. At least 25 million residents are under flood advisories while more than 145,000 are still without power. pic.twitter.com/ma9fEewj2X — CBS Evening News (@CBSEveningNews) January 11, 2023 భారీ వర్షాల నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 25 వేల మందిని ప్రభుత్వ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. హాలీవుడ్ సినీ ప్రముఖులు నివసించే మాంటెసిటో నగరంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని అధికారులు వెల్లడించారు. బురద ముప్పు పొంచి ఉందని, ప్రజలు ఈ నగరాన్ని వెంటనే వీడాలని అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. కాలిఫోర్నియాలో 17 ప్రాంతాల్లో భీకర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కాలిఫోర్నియాలో పలు ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో బురద ప్రవాహం పెరిగింది. San Francisco roads are swallowed by the flood. Stay inside or go somewhere safe. #SanFrancisco #California #Weather #Flooding #Mothernature #Waterpark #SoakCity #StayDry pic.twitter.com/tNhIFDOXYR — Sh*t That’s Interesting (@SUDN2K) January 10, 2023 -
ఇళ్లపై ఈ ఏర్పాటుతో పిడుగుల నుంచి రక్షణ పొందొచ్చు
వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చి బైక్‌పై తిరిగి వెళ్తుండగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్‌పై తల్లికొడుకులు సోమవారం పిడుగుపాటుకు మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా మారింది. ఇదే నెలలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న ఎడ్లబండి పిడుగు వేయడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. జూలై 7న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందగా.. పలుచోట్ల పశువులు బలయ్యాయి. ఇలా ఏటా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో పిడుగులు పడి పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వర్షాకాలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, కూలీలు, పశువుల కాపరులు, రోడ్లపై వెళ్లే వాహనదారులు అధికంగా పిడుగుపాటుకు గురవుతున్నారు. అవగాహన కలిగి ఉంటే పిడుగుపాటు నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. – మంచిర్యాలటౌన్ ప్రధాన కారణం.. వర్షంపడే సమయంలో వాతావరణంలో పీడనం, ఉష్ణోగ్రతలో కలిగే మార్పులు ప్రధానంగా పిడుగులకు కారణమవుతాయి. పిడుగు అంటే ఆకాశంలో సహజసిద్ధంగా ఉత్పన్నమయ్యే విద్యుదుత్పాతం. పిడుగు పడే సమయంలో ఉత్పత్తయ్యే శబ్దం లక్షల డెసిబిల్స్‌లో ఉంటుంది. ఒక మిల్లీ సెకన్ కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. అప్పుడు ఏర్పడే శక్తి క్షేత్ర మీటర్‌కు 2 లక్షల వోల్టులతో సమానం.ఇది ఒక లక్ష కిలోమీటర్ల పొడవు ఉంటుంది. రెండు మేఘాల మధ్య అయితే తక్కువలో తక్కువ 7 నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్, ధ్వని తరంగాలు సన్నటి మార్గం గుండా భూమిని చేరుతాయి. ఆ సమయంలో అవి ప్రవహించే మార్గంలో 50 వేల డిగ్రీల వేడి నమోదవుతుంది. అలా ఉపరితలం మీద నుంచి ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, ఆలయ ధ్వజస్తంభాలు వంటి వాటి ద్వారా తరంగాలు భూమిలోకి చేరుతాయి. ఆ సమయంలో సమీపంలో ఉన్న మనుషులు, జంతువులు కూడా వాటికి సాధనంగా మారుతారు. కాపర్ ఎర్తింగ్.. పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు కాపర్ ఎర్త్ (రాగి తీగ)ను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని భవనం పైనుంచి భూమిలోపలి వరకు ఏర్పాటు చేయాలి. కిలోమీటరు దూరంలో పిడుగుపడినా భూమి ఆకర్షిస్తుంది. రాగితీగను ఏర్పాటు చేసుకునే సమయంలో ఉప్పుతోపాటు బొగ్గు కలిపి అందులో వేయాలి. శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం పిడుగు రూపంలో కిందికి వచ్చినప్పుడు కాపర్(రాగి) తీగ ఆపే అవకాశం ఉంది. టవర్లు, సినిమా హాళ్ల వద్ద ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. భవనాలు, పరిశ్రమలు అంతస్తులపై రాగి కడ్డీలను ఏర్పాటు చేసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి ► ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్న సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దు. విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండరాదు. చెట్లు, స్తంభాలకు దూరంగా ఉండాలి. ► ఇంట్లో ఉన్న స్విచ్‌బోర్డుల నుంచి ప్లగ్గు లు తొలగించాలి. టీవీలకు ఉన్న కేబు ల్ తీగలు తొలగించాలి. అలాగే ఉంచితే ఎలక్ట్రికల్ వస్తు సామగ్రి దెబ్బతినే ప్రమాదం ఉంది. ► విద్యుత్ స్తంభాలు పిడుగులను ఆకర్షించే అవకాశం ఉంది. ► ఉరుములతో కూడిన వర్షం పడుతుంటే కిటికీలు, తలుపుల వద్ద ఉండి బయటకు చూడవద్దు. కిటికీ తలుపులు మూసేయాలి. ► ఎత్తైన ప్రదేశంలో నిల్చోని ఫోన్ మాట్లాడకూడదు. ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాలు నడపొద్దు. ► అధిక నీరు ఉన్నచోట ఉండడంగాని, నీళ్లలో ఈత కొట్టడం చేయకూడదు. ► ఎర్తింగ్ కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమా దం. అలాంటి సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. ఆరుబయట ఉంటే.. ► వర్షం కురిసే సమయంలో పొలాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► పిడుగు పడే సమయంలో బయట ఉంటే అరచేతులతో చెవులు మూసుకుని, నేలపై మోకాళ్ల మీద కూర్చోని తల కిందకు వంచి ఉండాలి. ► వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలకు దూరంగా ఉండాలి. ► ఈదురుగాలులు, వర్షం పడే సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగల కింద ఉండొద్దు. ► గుండే జబ్బులు ఉన్నవారు వర్షం, ఉరుములు, మెరుపుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగుపాటుకు గురైతే.. ► పిడుగుపాటుకు గురైన వారు ప్రాణాపాయం నుంచి బయటపడడం అరుదు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. ► బాధితుడికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. ► పిడుగు తాకిన ప్రదేశం తడిగా ఉంటే బాధితుడిని దుప్పటిపై పడుకొబెట్టాలి. ► ఊపిరి ఆగిపోతే బాధితుడి కృత్రిమ శ్వాస అందించాలి. ► గుండే కొట్టుకోవడంలో తేడాలు గమనిస్తే ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు రెండు చేతులతో ఛాతి పైభాగాన్ని గట్టిగా ఒత్తుతూ ఉండాలి. చదవండి: బైక్‌పై వెళ్తుండగా పిడుగు పడి.. -
టూవీలర్‌పై వెళ్తున్న వ్యక్తులపై పిడుగుపాటు.. ఇద్దరు మృతి
మంచిర్యాల(ఆదిలాబాద్): మంచిర్యాల జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కాగా, జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్ బ్రిడ్జ్‌పై వర్షంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఒకే కుటుంబంలో ఇద్దరు పిడుగుపాటుకు గురై చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: Tragedy: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి -
హడలెత్తించిన పిడుగులు
సాక్షి, శ్రీకాకుళం : వాండ్రంగి, రాపాక పంచాయతీ చీడిపేటలో శనివారం సాయంత్రం కొబ్బరిచెట్లపై పిడుగులు పడ్డాయి. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్లపై మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇల్లయ్యగారిపేటలో ఓ ఇంటిపై పిడుగు పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులు వచ్చాయి. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లలోకి వెల్లిపోయారు. అదే సమయంలో నడిమింటి శ్రీరాములు ఇంటి మేడపై ముందుభాగాన పిడుగు పడింది. దీంతో గోడ ధ్వంసమై ఇటుకలు ఊడి బయటపడ్డాయి. సుమారు రూ. 50 వేలు నష్టం వాటిల్లిందని బాధితులు లబోదిబోమంటున్నారు. తుంగపేటలో కూలిన ఇంటిగోడ మండలంలోని తుంగపేటలో శనివారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నాలుగు కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఇంటిగోడ కుప్పకూలింది. ఇటీవల కురిసిన చిరుజల్లులకు గోడ నానడంతో కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని యజమానులు కూన ఇందుమతి, కూన లక్ష్మిన కూన వెంకట సూర్యం, కూన రేవతిలు తెలిపారు. -
ఏపీలో ఒక్కరోజులో 41,025 పిడుగులు
-
ఏపీలో పిడుగుల వర్షం ; 12 మంది మృతి
-
పిడుగుపాటుతో రైతు మృతి
ఇచ్చాపురం (శ్రీకాకుళం): పొలంలో పనులు చేసుకుంటున్న రైతుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని కేదారిపురం గ్రామానికి చెందిన పిట్ట చిరంజీవి (45) శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో తన పొలంలో పనులు చేస్తుండగా పెద్ద శబ్దంతో ఆయనపై పిడుగుపడింది. దీంతో రైతు అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇరవయ్యేళ్ల లోపు ఇద్దరుకుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.