thyagarajan
-
సర్వం ధారపోసిన ఈ బిజినెస్ టైకూన్ గురించి తెలుసా?
సంపన్న కుటుంబంలో పుట్టి ఆ వారసత్వ సంపదను నిలుపుకోవడంలో, రెట్టింపు చేయడంలో చాలామంది సక్సెస్ అవుతారు. మిలియనీర్లు, బిలియనీర్లుగా ఎదుగుతారు. కానీ కోట్లకు పడగలెత్తినా ఎలాంటి ఆడంబరాలు, విలాసాలకు తావు లేకుండా అతి సాధారణ జీవితాన్ని గడిపేవారు చాలా అరుదు. దాతృత్వంలో సర్వ ధార పోసి తమకు తామే సాటి అని చాటుకుంటారు. అలాంటి వారిలో ఘనుడు 85 ఏళ్ల శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఆర్ త్యాగరాజన్. తమిళనాడులోని సంపన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టిన త్యాగరాజన్ 37 సంవత్సరాల వయస్సులో బంధువులు, స్నేహితులతో శ్రీరామ్ చిట్స్‌ను స్థాపించడం ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1974లో చెన్నైలో శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించారు. అంతకు ముందు 1961లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో చేరి, వివిధ ఫైనాన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పని చేస్తూ ఇరవై సంవత్సరాల అనుభవాన్ని గడించారు. ఆర్థికంగా అన్ని అడ్డంకులను ఎదుర్కొని వ్యాపార దిగ్గజంగా ఎదగడం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత, మానవత్వం పట్ల కూడా అంతే నిబద్ధతతో ఉన్న మహా మనీషి ఆయన.పేరుకు తగ్గట్టే త్యాగంలో రారాజు. నా దృష్టి అంతా వారిమీదే ఈ అనుభవంతోనే సాంప్రదాయ బ్యాంకులు పట్టించుకోని తక్కువ-ఆదాయ రుణగ్రహీతలకు రుణాలు ఇవ్వడంపై దృష్టి సారించారు. ట్రక్కులు, ట్రాక్టర్లు , ఇతర వాహనాల కోసం సమాజంలోని పేదవర్గాలకు రుణాన్ని అందించడంలో కంపెనీ అగ్రగామిగా ఉంది. వెనుకబడిన వారికి సహాయం చేయడంలోని అతని నమ్మకం కంపెనీ వృద్ధికి దారితీసింది. ఫలితంగా కంపెనీ రూ. 6210 కోట్లు కంటే ఎక్కువ విలువైన సంస్థగా అవతరించింది. 23 మిలియన్లకు పైగా వినియోగదారులతో 30 కంపెనీలతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. శ్రీరామ్ గ్రూపు షేర్లు ఈ సంవత్సరం 35శాతం పెరిగి జూలైలో రికార్డ్ నమోదు చేశాయి. ఇది భారతదేశపు బెంచ్‌మార్క్ స్టాక్ ఇండెక్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. అంతేకాదు వ్యాపారంలో ఘన విజయం సాధించిన త్యాగరాజన్ దృష్టి కేవలంకంపెనీని విజయంబాటపట్టించడే కాదు.. స్వయంగా కమ్యూనిస్టు భావాలను రంగరించు కున్న ఆయన తన విజయంలో కంపెనీ ఉద్యోగులపాత్రను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. వారి కష్టాలు,సవాళ్లను స్వయంగా అర్థం చేసుకున్నారు కనుకనే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం ఐదు వేల డాలర్లు తన వద్ద ఉంచుకుని దాదాపు రూ. 6210 కోట్ల ( 750 మిలియన్ల డాలర్ల) మొత్తం సంపదను తన ఉద్యోగులకు విరాళంగా ఇవ్వాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సామ్రాజ్యం విజయానికి, కోట్ల సంపదకు ఆర్జనకు సహకరించిన వారి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. సందపను పంచి ఇవ్వాలనే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తు.చ తప్పకుండా పాటించారు. కమ్యూనిస్ట్ భావజాల ప్రభావం,అతి సాధారణ జీవితం బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో,క్రెడిట్ చరిత్ర లేని వారికి డబ్బు ఇవ్వడం ప్రమాదకరం కాదని నిరూపించడానికి కంపెనీని ప్రారంభించినట్లు త్యాగరాజన్ చెప్పారు. అంతేకాదు వ్యాపారవేత్తగా అతి సాధారణ జీవితంలో గడపడంలో ఆయనే తరువాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు.దుబారా అంటే అస్సలు నచ్చదు. ఐఫోన్, ఖరీదైన కారు, లగ్జరీ ఇల్లు, సదుపాయాలకు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం శ్రీరామ్ గ్రూప్ నుండి విశ్రాంతి తీసుకున్న త్యాగరాజన్ చిన్న ఇల్లు, రూ. 6 లక్షల విలువైన హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ కారుతో చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పటికీ ప్రతీ 15 రోజులకు ఒకసారి కంపెనీ సీనియర్ మేనేజర్లతో సమావేశమవుతూ, సలహాలు, సూచనలతో శ్రీరామ్ కంపెనీని మరింత అభివృద్దికి బాటలు వేస్తున్నారు. త్యాగరాజన్ ఎక్కడ పుట్టారు? త్యాగరాజన్ 1937 ఆగస్టు 25వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలో గ్రాడ్యుయేషన్, మాథ్య్స్లో మాస్టర్స్ చేశారు. తరువాత కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో మూడు సంవత్సరాలు చదివారు. 1961లో దేశీయ అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలోనూ, దాదాపు రెండు దశాబ్దాల పాటు వైశ్యా బ్యాంక్, రీఇన్స్యూరెన్స్ బ్రోకర్ సంస్థ JB బోడా అండ్ కోలో పనిచేశారు. శ్రీరామ్స్ సంస్థల కారణంగా వడ్డీ రేట్లు దిగి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ సుమారు 8.5 బిలియన్ డాలర్లు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సుమారు 200 మిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది. శ్రీరామ్ కంపెనీలలో తన వాటాలన్నింటినీ ఉద్యోగుల గ్రూపునకు కేటాయించి, 2006లో ఏర్పాటు చేసిన శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్‌కు బదిలీ చేసిన గొప్ప వ్యక్తి త్యాగరాజన్. ఈ శాశ్వత ట్రస్ట్‌లో 44 గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. ట్రస్ట్ హోల్డింగ్ మొత్తం విలువ 750 మిలియన్లడాలర్లకు పైమాటే. ఇటీవల శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కో. శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌లను షేర్-స్వాప్ డీల్‌లో విలీనం చేసుకుంది. -
దేశంలోనే ఐటీలో మేటి హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ నగరంగా హైదరాబాద్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టినట్లు చెప్పారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పాలసీలపై 3 రోజులపాటు అధ్యయనం చేసేందుకు గురువారం హైదరాబాద్ విచ్చేసిన తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో సమావేశమైంది. ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, ఐటీ పాలసీ, అనుబంధ పాలసీలు, పరిశ్రమ బలోపేతం కోసం తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా కేటీఆర్ తమిళనాడు ప్రతినిధి బృందానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. ఐటీ శాఖ ద్వారా రాష్ట్రంలోని యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూనే మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆన్లైన్ , మొబైల్, డిజిటల్ తదితర సేవల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్‌తోపాటు ద్వితీయశ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట లాంటి పట్టణాలలో ఐటీ టవర్లను ఏర్పాటు చేశామని, ఈ టవర్లలో టాస్క్, టీ–హబ్, వీ–హబ్ వంటి ఉప కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమిళనాడు ఐటీ శాఖ ప్రశంసలు తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషిపట్ల తమిళనాడు మంత్రి పీటీఆర్ బృందం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పాలసీలపట్ల ప్రశంసలు కురిపించింది. తమిళనాడు ఐటీ మంత్రిగా నూతన బాధ్యతలు చేపట్టిన తనకు ఈ పర్యటన ఉపయుక్తంగా ఉంటుందన్న నమ్మకాన్ని పీటీఆర్ వ్యక్తం చేశారు. ఇక్కడి ఆదర్శవంతమైన విధానాలను తమిళనాడులో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
CII Dakshin 2023: యువత సినీపరిశ్రమకు రావాలి
‘‘దక్షిణాది సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం గొప్ప విషయం. యువత సినిమా పరిశ్రమకు రావాలి. ‘ఆర్ఆర్ఆర్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డులు సాధించడం గర్వకారణం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. బుధవారం చెన్నైలో జరిగిన సీఐఐ (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) దక్షిణ్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఐఐ దక్షిణ్ చైర్మన్, మేనేజింగ్ పార్ట్నర్ టీజీ త్యాగరాజన్ నేతృత్వంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ప్రారంభోత్సవంలో తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, స్వామినాథన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీఐఐ దక్షిణ్ కమిటీ సభ్యురాలు సుహాసిని, నిర్మాత అల్లు అరవింద్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటులు కార్తీ, రిషబ్ శెట్టి, నటి మంజు వారియర్, దర్శకుడు వెట్రిమారన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెల్వమణి మాట్లాడుతూ– ‘‘తమిళ చిత్రాల షూటింగ్‌లు తమిళనాడులో అధికంగా జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకూ దక్షిణాదిలో 50 వేల చిత్రాలు రూపొందాయి. అయితే సినిమాలనే నమ్ముకున్న కార్మికులకు ప్రోత్సాహం లేదు. వారి కోసం తమిళనాడు సినీ కార్మికుల డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి’’ అన్నారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ – ‘‘తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ సినీ పరిశ్రమకు అండగా ఉంటారు. సెల్వమణి తదితరులు పేర్కొన్న అంశాల గురించి చర్చించి, చర్యలు తీసుకుంటాం’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు...’ పాట నృత్యదర్శకుడు ప్రేమ్ రక్షిత్, ‘ది ఎలిఫెంట్ ఆఫ్ విస్పరర్స్’ షార్ట్ ఫిలిం దర్శకురాలు కార్తీకీలను సత్కరించారు. -
వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్ల రుణం ప్లీజ్!
సాక్షి, చెన్నై: తమిళనాడుకు వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్లు రుణం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి పళణి వేల్ వెళ్లారు. పార్లమెంట్ హాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆమె చాంబర్లో కలిశారు. తమిళనాడుకు రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. అలాగే, వడ్డీ లేని రుణం, జీఎస్టీ నిల్వ తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని, తమిళనాడులో సాగుతున్న ప్రాజెక్టులతో వినతి పత్రాన్ని, నివేదికను ఆమెకు అందజేశారు. అనంతరం వెలుపల మీడియాతో పళణి వేల్ త్యాగరాజన్ మాట్లాడారు. తమిళనాడుకు సంబంధించి అనేక అంశాలు, ప్రాజెక్టులపై పూర్తిస్థాయి నివేదికను అందించినట్లు తెలిపారు. చదవండి: (భిక్షగాడిగా మారిన మాజీ వ్యవసాయ అధికారి దీనగాథ.. 26 ఏళ్ల తరువాత న్యాయం) మదురైలో జీఎస్టీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. చెన్నైలో జరుగుతున్న రెండో విడత మెట్రో పథకం కోసం రుణపత్రాలకు ఆమోదం ఇవ్వాలని కోరామని చెప్పారు. వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్ల మేర రుణం ఇవ్వాలని కోరామని, దీనిపై నిర్మాలా సీతారామన్ సానుకూలంగా స్పందించాలని వెల్లడించారు. అలాగే, తమ విజ్ఞప్తి మేరకు ఆప్టిక్ కేబుల్ పనులకు రూ. 184 కోట్లు, గ్రామీణాభివృద్ధి, రహదారుల పనులకు రూ.3,263 కోట్లు విడుదల చేశారని తెలిపారు. అలాగే, ఐటీ ఈపీఎఫ్‌ఓలకు డేటా విడుదల చేయాలని కోరినట్లు వెల్లడించారు. మదురైలో నైబర్ పథకం గురించి ప్రస్తావించగా, దానిని కేంద్రం పక్కన పెట్టినట్టు మంత్రి వివరణ ఇచ్చారని పళణివేల్ త్యాగరాజన్ పేర్కొన్నారు. -
త్యాగరాజన్ చేతుల్లోకి నేత్ర
తమిళసినిమా: నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ చేతుల్లోకి నేత్ర చిత్రం చేరింది. దర్శకుడు వెంకటేశ్ అంగాడితెరు చిత్రంతో నటుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అలా దర్శకుడిగా, నటుడిగా జోడు గుర్రాల సవారి చేస్తున్న ఈయన తాజాగా నిర్మాతగా కూడా మారారు. శ్వేత సినీఆర్ట్స్ పరరాజసింగ్తో కలిసి తన వెంకటేశ్ పిక్చర్స్ పతాకంపై ఏ.వెంకటేశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం నేత్ర. వినయ్, తమన్‌కుమార్, సుభిక్ష, రిత్విక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించారు. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ చిత్ర విడుదల హక్కులు త్యాగరాజన్ స్టార్ మూవీస్ ఖాతాలో పడింది. నేత్ర చిత్రాన్ని త్యాగరాజన్ ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం స్థానికి టీ.నగర్‌లోని త్యాగరాజన్‌కు చెందిన ప్రశాంత్ గోల్డ్ టవర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శక నటుడు కే.భాగ్యరాజ్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా, నటుడు శరత్‌కుమార్ తొలి సీడీని అందుకున్నారు. శరత్‌కుమార్ మాట్లాడుతూ దర్శకుడు ఏ.వెంకటేశ్ చాలా ప్రతిభావంతుడైన దర్శకుడని, ఆయనతో ఏయ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు చేశానని తెలిపారు. చాలా పకడ్బందీగా, వేగంగా చిత్రాలు చేసే దర్శకుడు ఆయన అని చెప్పారు. ఇక ఈ నేత్ర చిత్ర విడుదల హక్కులను త్యాగరాజన్ పొందారంటే అందులో ఎంత విషయం ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తన కొడుకు నటించిన చిత్రాలు మినహా బయట చిత్రాలను త్యాగరాజన్ విడుదల చేయడం అన్నది ఇదే మొదటి సారి అని అన్నారు. త్యాగరాజన్‌తో తనకు చిరకాల అనుబంధం ఉందని, ఈయన నేత్ర చిత్రాన్ని సక్సెస్ చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. నిర్మాతగా మారిన ఈ చిత్ర దర్శకుడు ఏ.వెంకటేశ్ మాట్లాడుతూ తాను అనుకోకుండా నిర్మాతనయ్యానన్నారు. నిర్మాత పరరాజసింగ్ వచ్చి చిత్రం చేద్దామని చెప్పగానే కథను సిద్ధం చేశానని, అయితే ఆయన తననూ ఈ చిత్ర నిర్మాణంలో భాగం కావలసిందిగా కోరడంతో అంగీకరించక తప్పలేదన్నారు. నేత్ర చిత్రాన్ని కెనడా నేపథ్యంలో రూపొందించామని తెలిపారు. అందుకే ఎక్కువ భాగం షూటింగ్‌ను కెనడాలోనే చేసినట్లు తెలిపారు. ఇది ఇంతకు ముందు వచ్చిన నూరావదునాళ్, విడింజా కల్యాణం తరహాలో సాగే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని, చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని దర్శక, నిర్మాత ఏ.వెంకటేశ్ తెలిపారు. నటి నమిత, ఫిలించాంబర్ అధ్యక్షుడు కాట్రగడ్డప్రసాద్, దర్శకుడు,ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, వసంతబాలన్ పాల్గొన్నారు. -
ప్రశాంత్ ఈజ్ బ్యాక్
చార్మింగ్ హీరో ప్రశాంత్ చిన్న గ్యాప్ తరువాత ఫుల్ యాక్షన్ ప్యాకేజ్‌తో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. సాహసం చిత్రం తరువాత ఈయన నటిస్తున్న తాజా చిత్రం జానీ. ఈ పేరు వింటే నటుడు రజనీకాంత్ గుర్తుకొస్తారు. అవును ఆయన చిత్ర టైటిల్‌తో ప్రశాంత్ తాజాగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్ మూవీస్ పతాకంపై సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవదర్శకుడు వెట్రిసెల్వన్ పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ప్రశాంత్‌కు జంటగా సంచితశెట్టి నటిస్తోంది. ప్రభు, షియాజీ షిండే, ఆనంద్‌రాజ్, అశుతోష్ రాణా వంటి భారీ తారాగణం ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న జానీ చిత్రంలో పాటలు లేకపోవడం విశేషం. ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనాలతో కూడిన ఇందులో పాటలు చిత్ర వేగానికి బ్రేక్ వేస్తాయన్న ఉద్దేశంతోనే వాటిని చిత్రంలో చొప్పించలేదని నిర్మాత త్యాగరాజన్ పేర్కొన్నారు. చిత్ర టీజర్ ఇంతకు ముందే విడుదలై మంచి స్పందనను పొందగా, తాజాగా జానీ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. 51 సెకన్లు నిడివి కలిగిన ఈ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోందని చిత్ర వర్గాలు తెలిపారు. త్వరలోనే జానీ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ప్రశాంత్ చాలా కాలం తరువాత ఒక తెలుగు చిత్రంలో నటిస్తుండడం విశేషం. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ప్రశాంత్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర గురించి సామాజిక మాధ్యమాల్లో తక్కువ చేసి ప్రశాంత్‌కు ఇలాంటి పరిస్థితినా? అంటూ ప్రసారం వైరల్ అవుతోంది. ఇలాంటి ప్రసారాన్ని ప్రశాంత్ తండ్రి, జానీ చిత్ర నిర్మాత త్యాగారాజన్ తీవ్రంగా ఖండించారు. రామ్‌చరణ్ చిత్రంలో ప్రశాంత్ పోషిస్తున్న పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
సినీ దర్శక నిర్మాత ఇకలేరు
పెరంబూరు: సీనియర్ దర్శక, నిర్మాత ఆర్.త్యాగరాజన్ ఆదివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 74. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో అనేక చిత్రాలను నిర్మించిన దివంగత ప్రఖ్యాత నిర్మాత చిన్నప్ప దేవర్‌కు త్యాగరాజన్ అల్లుడు అన్నది గమనార్హం. త్యాగరాజన్ ఎంజీఆర్ నటించిన పలు చిత్రాలను నిర్మించడంతో పాటు దర్శకుడిగా రజనీకాంత్‌తో తాయ్‌వీడు, అన్నై ఒర్ ఆలయం, తాయ్ మీదు సత్యం, అన్బుక్కు నాన్ అడిమై 8 చిత్రాలతో పాటు కమలహాసన్ హీరోగా రామ్‌లక్ష్మణన్, తాయ్ ఇల్లామల్ నాన్ ఇల్లై మూడు చిత్రాలు, విజయ్‌కాంత్‌తో నల్లనాళ్, అన్నైభూమి 3డీ, హిందీలో రజనీకాంత్, రాజేవ్‌ఖన్నాలతో రెండు చిత్రాలు అంటూ మొత్తం 35 చిత్రాలను తెరకెక్కించారు. శివకుమార్, శ్రీప్రియ జంటగా ఆట్టుక్కార అలమేలు, వెళ్లిక్కిళమై వ్రదం చిత్రాలు ఈయన దర్శకత్వంలో రూపొందినవే. ఆట్టుక్కార అలమేలు చిత్రం తెలుగులో పొట్టేలు పున్నమ్మ పేరుతో రీమేక్ అయ్యింది. స్థానిక పోరూర్, భారతీయార్ వీధి, కావేరి గార్డెన్లో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న త్యాగరాజన్ ఆదివారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఈయనకు భార్య సుబ్బలక్ష్మి, కొడుకు వేల్మురుగన్, కూతురు షణ్ముగవడివు ఉన్నారు. త్యాగరాజన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన భౌతికకాయానికి సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వలసరవాక్కంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. -
మళ్లీ పెళ్లి వద్దందని తల్లినే చంపాడు!
తంజావూరు(తమిళనాడు): మళ్లీ పెళ్లి చేసుకుంటానంటే అడ్డుచెప్పిందని తల్లినే చంపాడో రాక్షసుడు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో కాదు.. భావిపౌరులను తీర్చిదిద్దే ఓ ప్రధానోపాధ్యాయుడు. తమిళనాడు తంజావూరులోని శ్రీనివాసపురం ప్రాంతానికి చెందిన కె.త్యాగరాజన్(57) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే, కొంతకాలం క్రితం అతని భార్య ఎటో వెళ్లిపోయింది. దీంతో త్యాగరాజన్ మళ్లీ పెళ్లికి సిద్ధపడ్డాడు. అతని తల్లి(80) మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపింది. మళ్లీ పెళ్లి వద్దని వాదించింది. ఈ విషయమై ఏప్రిల్ 20వ తేదీన తల్లి, కొడుకు మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఉన్న త్యాగరాజన్ తల్లి ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. మరునాటి ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన తల్లిని ఎవరో చంపారని ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె కళ్లలో కారం చల్లి ఆభరణాలను దోచుకెళ్లారని తెలిపాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొడుకు త్యాగరాజన్‌ను అనుమానించారు. విచారణలో అతడు నిజాన్ని అంగీకరించాడు. పెళ్లి చేసుకుంటానంటే అడ్డు చెప్పిందని చంపేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతడిని బుధవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.