Ticket cancellation charges
-
35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
కోటా: రాజస్తాన్‌కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్‌లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్‌లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్‌పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్‌ను టాగ్ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. -
రైలు టికెట్ రద్దు: మీకో షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: వెయిట్‌లిస్ట్ చేసిన టికెట్లను రద్దు చేయడం మర్చిపోయారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. భారతీయ రైల్వే కాన్సిలేషన్ టికెట్ల ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించింది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. రైల్వే ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు, లేదా రద్దు చేసుకోవడం మర్చిపోయిన టికెట్ల ద్వారా....అక్షరాల 9వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. గత మూడు ఏళ్లలో దేశవ్యాప్తంగా వెయిటింగ్ లిస్టులో ఉండి రద్దు కాని టికెట్ల ద్వారా రూ. 9 వేల కోట్ల ఆదాయం వచ్చిందని స్వయంగా రైల్వే సమాచార సంస్థ కేంద్రం (సీఆర్ఐఎస్) వెల్లడించింది. రాజస్థాన్ కోటాకు చెందిన సామాజిక కార్యకర్త సుజిత్ స్వామి సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరడంతో సీఆర్ఐఎస్ ఈ వివరాలను వెల్లడించింది. జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2020 మధ్య కాలంలో (మూడేళ్లు) వెయిటింగ్ లిస్టులో ఉన్న 9.5 కోట్ల మంది తమ టికెట్లను రద్దు చేసుకోలేదు. తద్వారా ఈ ప్రయాణికుల నుండి అత్యధికంగా రూ .4,335 కోట్లు సంపాదించింది. అలాగే టికెట్ల క్యాన్సిలేషన ద్వారా రూ.4335కోట్లను ఆర్జించింది. ఇలా గత మూడేళ్లలో టికెట్ రద్దు ఛార్జీలు, వెయిట్‌లిస్ట్ టికెట్లను రద్దు చేయకపోవడం వల్ల భారతీయ రైల్వే 9,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. ఆన్లైన్ ద్వారా ఐఆర్సిటిసి రైలు టిక్కెట్ల బుకింగ్‌లో ఖచ్చితమైన పెరుగుదల ఉందని తెలిపింది. 2017- 2020 జనవరి 31 వరకు మొత్తం 145 కోట్ల మంది ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోగా, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా పాత బుకింగ్ పద్ధతిలో 74 కోట్ల మంది టికెట్లను తీసుకున్నారు. భారతీయ రైల్వేల రిజర్వేషన్ పాలసీ, రీఫండ్ పాలసీ (రద్దు చేసుకున్న టికెట్లపై ప్రయాణికులకు తిరిగి వచ్చే సొమ్ము)లో చాలా వివక్ష వుందని సుజిత్ స్వామి ఆరోపించారు. అలాగే ఆన్లైన్ బుకింగ్, కౌంటర్ బుకింగ్‌ల మధ్య చాలా వ్యత్యాసం వుందని, ఇది ప్రయాణికులపై అనవసరపు భారాన్ని మోపుతోందని వాదించారు. తద్వారా రైల్వే అన్యాయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోందంటూ స్వామి రాజస్థాన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా రైల్వే టిక్కెట్లను కాన్సిల్ చేసినపుడు, పూర్తి డబ్బులు కాకుండా.. సర్వీస్ ఛార్జీలు కోత పెట్టి, మిగతా సొమ్మును వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుందన్న సంగతి తెలిసిందే. నిర్ణీత సమయానికి 48 గంటల లోపు టికెట్లను కాన్సిల్ చేసుకుంటే.. చార్జీలు ఏసీ ఫస్ట్ క్లాస్ / ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ల రద్దు ఛార్జీ రూ. 240 + జీఎస్టీ ఏసీ 2 టైర్, ఫస్ట్ క్లాస్ టిక్కెట్ల రద్దు ఛార్జీ రూ. 200 + జీఎస్టీ ఏసీ 3 టైర్ / ఏసీ చైర్ కార్ / ఏసీ 3 ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కోసం రద్దు ఛార్జీ రూ. 180 + జీఎస్టీ స్లీపర్ క్లాస్ టిక్కెట్ల కోసం, రద్దు ఛార్జీ రూ. 120. సెకండ్ క్లాస్ టిక్కెట్లపై రూ. 60 -
విమాన ప్రయాణికులకు ఊరట!!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల హక్కులను కాపాడేందుకు, మరిన్ని సదుపాయాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు తెరపైకి తె చ్చింది. ప్రయాణికులకు ఊరటనిచ్చేలా.. దేశీయం గా ప్రయాణాల కోసం ఉద్దేశించిన టికెట్లను బుక్ చేసుకున్న 24 గంటల్లోగా క్యాన్సిల్ చేస్తే ఎలాంటి చార్జీలు విధించకూడదని ప్రతిపాదించింది. 24 గంటల లాకిన్ వ్యవధిలో ప్యాసింజర్ల పేర్లలో మార్పు లు .. చేర్పులు, ప్రయాణ తేదీలను సవరించుకోవడం మొదలైనవి ఉచితంగా చేసుకోవచ్చని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. విమానం బైల్దేరడానికి నాలుగు రోజుల ముందు బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. విమాన ప్రయాణికుల హక్కుల పరిరక్షణ, సదుపాయాల కల్పనకు సంబంధించిన ముసాయిదా చార్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. ‘టికెట్‌ను బుక్ చేసుకున్న 24 గంటల్లోగా ఎలాంటి చార్జీలు విధించకుండా రద్దు చేసుకునేలా విమానయాన సంస్థ లాకిన్ సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. విమానం బైల్దేరడానికి 96 గంటల ముందు దాకా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది‘ అని సిన్హా చెప్పారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు ఒక్కో విధంగా క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. అసంబద్ధమైన చార్జీలు వసూలు చేస్తున్నాయని, రిఫండ్ ఇవ్వడం లేదని పలు సంస్థలపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరించి, రెండు నెలల్లోగా నోటిఫై చేస్తామని సిన్హా తెలిపారు. చార్టర్లో మరిన్ని ప్రతిపాదనలు.. ♦ మార్గదర్శకాల ప్రకారం.. క్యాన్సిలేషన్ చార్జీలను టికెట్టుపై ప్రముఖంగా ముద్రించాలి. క్యాన్సిలేషన్ చార్జీలు ఎట్టిపరిస్థితుల్లోనూ బేసిక్ ఫేర్, ఇంధన సర్‌చార్జీని మించరాదు. ♦ విమాన సర్వీసులో జాప్యం కారణంగా ప్యాసింజరు కనెక్టింగ్ ఫ్లయిట్‌ని అందుకోలేకపోయిన పక్షంలో ఎయిర్‌లైన్స్ రూ. 5,000 నుంచి రూ. 20,000 దాకా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆఖరు నిమిషంలో విమాన సర్వీసును క్యాన్సిల్ చేసిన పక్షంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఫ్లయిట్లో పంపాలి. అయితే, వాతావరణ సంబంధ సమస్యల కారణంగా జాప్యం జరిగితే మాత్రం ఎయిర్‌లైన్స్ బాధ్యత ఉండదు. ♦ ఒకవేళ ప్రయాణికుల బోర్డింగ్‌కు నిరాకరించినట్లయితే.. కనిష్టంగా రూ. 5,000 పైచిలుకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ♦ త్వరలోనే విమానంలోనే వై–ఫై సదుపాయం అందుబాటులోకి. -
విమానయానంలో కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ : విమానయాన సంస్థలపై కేంద్రం కొరడా ఝళిపించింది. టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వినియోగదారులను అధిక చార్జీలతో బాదేస్తున్న సంస్థలపై కేంద్రం స్పందించింది. విమాన ప్రయాణికులకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ద్వారా విమాన టికెట్ క్యాన్సిలేషన్, లగేజి చార్జీలపై ఊరట కల్పించింది. టిక్కెట్ రద్దు చార్జీలు, పరిమిత లగేజి అనంతరం వసూలు చేస్తున్న ఛార్జీలపై కూడా కోత పెడుతూ విమాన సంస్థలకు కొత్త నిబంధనలు విధించింది. ఈ కొత్త నిబంధనలను విమానయాన శాఖా మంత్రి అశోక గజపతిరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. టికెట్ క్యాన్సిలేషన్ సమయంలో టిక్కెట్ బేస్ ధర కంటే రద్దు ఛార్జీలు అధికంగా ఉండకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే టికెట్ రద్దుచేసుకున్న 15 రోజుల్లోగా రిఫండ్ చేయాలని పేర్కొంది. నగదు వాపసు పొందవచ్చు లేదా ఆ మొత్తాన్ని తదుపరి ప్రయాణ అవసరాలకోసం క్రెడిట్ చేసుకునే నిర్ణయం ప్రయాణీకులదే.అన్నిరకాల పన్నులు, లెవీ, యూజర్ చార్జీలను తిరిగి చెల్లించాలని కోరింది. 15 కేజీల లగేజీ దాటితే అదనంగా ఐదు కేజీల వరరూ 100 రూ.కు మించి వసూలు చేయకూడదని కేంద్ర ఆదేశించింది. ఓవర్ బుకింగ్ అయిన పక్షంలో ప్రయాణీకుడికి 20 వేల రూపాయలను పరిహారంగా చెల్లించాలని తెలిపింది. 24 గంటల్లోపు విమానం రద్దయితే 10వేల పరిహారం చెల్లించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ లైన్ పోర్టల్స్, ఎయిర్ లైన్స్ ద్వారా బుక్ చేసుకున్నా ఈ నిబంధనలు వర్తిస్తాయని మంత్రి వెల్లడించారు. అలాగే ప్రమోషనల్, స్పెషల్ రేట్లలో కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించారు. కాగాఇటీవల టిక్కెట్ రద్దు చార్జీలు బేస్ ధర కంటే ఎక్కువగా వసూలు చేసిన ఈ ఛార్జీలను వెంటనే కస్టమర్లకు చెల్లించాలని విమాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. టిక్కెట్ ధర కంటే కూడా రద్దు ఛార్జీలే ఎక్కువగా ఉండటం వల్ల, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు ప్రయాణికులు నష్టపోతున్నారన్నారు. సర్వీసు పన్నులను, ఇతర ఎయిర్ పోర్టు ఛార్జీలను ప్రయాణికులు టిక్కెట్ ధరల్లోనే విమాన సంస్థలకు చెల్లిస్తుంటారని, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు వీటిని అసలు లెక్కలోకే తీసుకోవడంలేది, టికెట్ రద్దు చార్జీలు క్రమేపీ పెరుగుతూ పోతున్నాయని.. వీటిని అదుపులో ఉంచడానికి అథారిటీ ఈ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇవి న్యాయసంబంధమైన విషయాలకు కిందకు వస్తాయని తెలిపారు. -
విమాన టిక్కెట్ రద్దు ఛార్జీలు తగ్గిస్తారా?
న్యూఢిల్లీ : విమాన సంస్థలు అధికంగా వసూలు చేస్తున్న టిక్కెట్ రద్దు ఛార్జీలపై భారత ఏమియేషన్ రెగ్యులేటరీ అథారిటీ దృష్టి సారించింది. టిక్కెట్ రద్దు చార్జీలను వెంటనే తగ్గించాలని ఆదేశించింది. టిక్కెట్ బేస్ ధర కంటే రద్దు ఛార్జీలు అధికంగా ఉండకూడదని విమాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. బేస్ ధర కంటే ఎక్కువగా వసూలు చేసిన ఈ ఛార్జీలను వెంటనే కస్టమర్లకు చెల్లించాలని ఆదేశించింది. టిక్కెట్ ధర కంటే కూడా రద్దు ఛార్జీలే ఎక్కువగా ఉండటం వల్ల, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు ప్రయాణికులు ప్రయోజనం పొందడం లేదని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఓ సీనియర్ అధికారి చెప్పారు. సర్వీసు పన్నులను, ఇతర ఎయిర్ పోర్టు ఛార్జీలను ప్రయాణికులు టిక్కెట్ ధరల్లోనే విమాన సంస్థలకు చెల్లిస్తుంటారని, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు వీటిని అసలు లెక్కలోకే తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇవి న్యాయసంబంధమైన విషయాలకు కిందకు వస్తాయని తెలిపారు. విమాన సంస్థలకు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నామని, వీటి గురించి ఇప్పటికే విమానసంస్థలతో డీజీసీఏ చర్చిందని, త్వరలోనే వీటిని ప్రకటిస్తారని తెలిపారు. టిక్కెట్ రద్దు చార్జీలు క్రమేపీ పెరుగుతూ పోతున్నాయని.. వీటిని అదుపులో ఉంచడానికి అథారిటీ ఈ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. జూన్ 7కి ఢిల్లీ-ముంబై మార్గానికి టిక్కెట్ బుక్ చేసుకుంటే, బేస్ ధర రూ.1,559 తో మొత్తం టిక్కెట్ ధర రూ.2,419గా ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు టిక్కెట్ ను రద్దు చేసుకుంటే అతని పొందేది కేవలం రూ.404 మాత్రమే. విమాన సంస్థలు అధిక రెవెన్యూల కోసమే ఈ ఛార్జీలను పెంచుకుంటూ పోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఇదే మొత్తంలో టిక్కెట్ ధరలను పెంచితే, ఎక్కడ కస్టమర్లు కోల్పోతారో అని ఆందోళనతో, ఈ మార్గాన్ని ఎంచుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. -
టికెట్ రద్దు రసుమును పెంచిన స్పైస్‌జెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా టికెట్ రద్దు రుసుమును రూ.350 వరకు పెంచింది. దీంతో దేశీ విమాన టికెట్ రద్దు చార్జీ రూ.2,250కు పెరిగింది. ఇక అంతర్జాతీయ విమాన టికెట్ రద్దు చార్జీలు రూ.2,500గా ఉన్నాయి. సవరించిన టికెట్ రద్దు చార్జీలు ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వచ్చాయని సంస్థ తెలిపింది. పలు దేశీ విమానయాన సంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ టికెట్ రద్దు చార్జీలను పెంచాయి.