![టికెట్ రద్దు రసుమును పెంచిన స్పైస్‌జెట్](/styles/webp/s3/article_images/2017/09/3/61460143664_625x300.jpg.webp?itok=h66Rhhtq)
టికెట్ రద్దు రసుమును పెంచిన స్పైస్‌జెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా టికెట్ రద్దు రుసుమును రూ.350 వరకు పెంచింది. దీంతో దేశీ విమాన టికెట్ రద్దు చార్జీ రూ.2,250కు పెరిగింది. ఇక అంతర్జాతీయ విమాన టికెట్ రద్దు చార్జీలు రూ.2,500గా ఉన్నాయి. సవరించిన టికెట్ రద్దు చార్జీలు ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వచ్చాయని సంస్థ తెలిపింది. పలు దేశీ విమానయాన సంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ టికెట్ రద్దు చార్జీలను పెంచాయి.