Tiger Project
-
పులి నవ్వింది
-
పులులు గర్జిస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: మన జాతీయ జంతువు పులిని సంరక్షించేందుకు ‘ప్రాజెక్టు టైగర్’ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయింది. అంతరించిపోతున్న పులులను సంరక్షించేందుకు 1973 ఏప్రిల్ 1న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించారు. 9 వేల చదరపు కిలోమీటర్లలో ఉన్న 9 టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లతో ఈ ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు 18 రాష్ట్రాల పరిధిలోని 75 వేల చదరపు కిలోమీటర్లలో 53 టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లకు విస్తరించింది. 1973లో జరిగిన మొదటి పులుల గణనలో 1,827 పులులు ఉండగా.. 2018 గణన ప్రకారం ఆ సంఖ్య 2,967కి పెరిగింది. ప్రపంచంలోని ఉన్న మొత్తం పులుల సంఖ్యలో ఇప్పుడు 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. టైగర్ ప్రాజెక్టు విజయవంతమైందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. పూర్వం 2 లక్షల పైనే ఉండేవి జీవ వైవిధ్యంలో ఎంతో కీలకమైన పులుల జీవనానికి మన దేశం అత్యంత అనుకూలంగా ఉండేది. చాలా ఏళ్ల క్రితం దేశంలో 2 లక్షలకు పైగా పులులు ఉండేవి. కానీ.. చక్రవర్తులు, రాజులు పులుల్ని వేటాడటాన్ని ప్రవృత్తిగా ఎంచుకోవడంతో వాటిసంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో పులుల వేట అత్యంత క్రూరంగా సాగింది. ఒక్కో రాజు పదులు, వందల సంఖ్యలో పులుల్ని చంపి.. తాము గొప్ప వీరులమని ప్రచారం చేసుకునేవారు. బ్రిటిష్ హయాంలోనూ వాటి వేట ఇష్టారాజ్యంగా కొనసాగింది. బ్రిటీషర్ల కాలంలోనే సాగు భూమి కోసం అడవుల్ని ఆక్రమించడంతో పులుల సంఖ్య తగ్గిపోయింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి 40 వేల పులులు మాత్రమే మిగిలినట్టు అంచనా. పులి అవయవాలన్నింటికీ డిమాండ్ ఉండటంతో ఆ తర్వాత కూడా వేట కొనసాగింది. ఫలితంగా క్రమేపీ అవి అంతరించే దశకు చేరుకున్నాయి. వన్యప్రాణుల చట్టం రక్షించింది 1972లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టం రావడం.. పర్యావరణంలో పులుల పాత్ర చాలా ముఖ్యమని భావించడంతో వాటి సంరక్షణకు బీజం పడింది. ఆ నేపథ్యంలోనే 1973లో ప్రాజెక్టు టైగర్ ఏర్పాటైంది. 1990వ దశకంలో పులుల ఆవాసాల సంరక్షణ ఇబ్బందిగా మారింది. 1993 నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంతచేసినా పులుల సంఖ్య పెరగలేదు. 2006 నాటికి దేశంలో పులులు సంఖ్య 1411కి పడిపోయింది. ఇలాగే వదిలేస్తే పులులు అంతరించే ప్రమాదం ఉందని గ్రహించిన కేంద్రం పులుల సంరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టడంతోపాటు సంరక్షణ విధానాన్ని కూడా మార్చింది. వాటి ఆవాసాలను సంరక్షించడంతోపాటు వేటను చాలావరకు నియంత్రించింది. ఫలితంగా అంతరిస్తున్న పులుల సంఖ్య నెమ్మదిగా పెరిగి కొన్నేళ్లుగా స్థిరంగా ఉంటోంది. 1973లో టైగర్ ప్రాజెక్టు బడ్జెట్ రూ.4 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.500 కోట్లు. ఇంతచేసినా రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వులో పులులు పూర్తిగా అంతరించిపోయాయి. కానీ.. మిగిలిన రిజర్వు ఫారెస్ట్‌లలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి 2,967కి చేరింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ స్థాయిలో పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఈ నెల 9న ప్రధాని మోదీ మైసూరులో 2022 పులుల గణన వివరాలను విడుదల చేయనున్నారు. ఈ గణనలో పులుల సంఖ్య పెరిగిందనే అంచనాలు వెలువడుతున్నాయి. (చదవండి: జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల) -
అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరం
సాక్షి, హైదరాబాద్: అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరమని, గ్రీన్ ఇండియా చాలెంజ్ తరపున పులుల రక్షణకు మద్దతు తెలుపుతున్నట్లు అడవులు, పర్యావరణంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్రం 1973లో ప్రాజెక్టు టైగర్‌ను ప్రవేశ పెట్టింది. శనివారం (ఏప్రిల్ 1) ఈ సేవ్ టైగర్ ఉద్యమానికి యాభై ఏళ్లు నిండాయి. దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ టైగర్ కింద తీసుకున్న చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని సంతోష్ పేర్కొ న్నారు. 1973లో 1,827గా నమోదైన పులుల సంఖ్య 2022 నాటికి 2,967కు చేరగా.. టైగర్ రిజర్వుల సంఖ్య తొమ్మిది నుంచి 53కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రాధాన్యాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సేవ్ టైగర్ ఉద్యమం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా తెలంగాణకు చెందిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు విడుదల చేసిన టైగర్ బుక్, టీషర్ట్, కాఫీ మగ్ సావనీర్లను సంతోష్ ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ద్వారా అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని బాగా నిర్వహిస్తోందని, పులుల సంఖ్య పెరుగుతోందన్నారు. పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగాన ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్, రాఘవ, శ్రీకాంత్ పాల్గొన్నారు. (చదవండి: ఇక తిరుపతికి ఎనిమిదిన్నర గంటల్లోనే.. వేగంగా వెళ్లేందుకే ఆ మార్గం ఎంపిక.. ) -
స్వతంత్ర భారతి 1973/2022
టైగర్ ప్రాజెక్టు భారతదేశ జాతీయ జంతువు పులికి ఉన్న ‘అడవి ప్రభువు’ అనే బిరుదు 1960ల చివరికి వచ్చేసరికి హాస్యాస్పదంగా మారింది. వేటగాడే వేటకు గురైనట్లయింది. పులులు తిరుగాడే అటవీ ప్రాంతాలలో చెట్లను క్రమంగా నరుకుతూ రావడం, పెద్ద యెత్తున సాగిన వేటలతో 1947లో 15 వేల మేరకు ఉన్న పులుల సంఖ్య 1972 నాటికి 1827 కు పడిపోయింది. భారతదేశంలో కనిపించే పులుల రకం అంతరించే ప్రమాదం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి.. కార్బెట్, కజిరంగ, మదుమలై, బందీపూర్లతో సహా తొమ్మిది ప్రధాన జాతీయ అభయారణ్యాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. ప్రాజెక్టులో భాగంగా.. పులులు అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఇతర జంతువుల వధపై నిషేధాన్ని దేశవ్యాప్తంగా అమలు లోకి తెచ్చారు. దానిని ఉల్లంఘించినవారికి జైలు శిక్షలు, పెద్ద మొత్తాలలో జరిమానాలు విధించారు. అభయారణ్యాలలో కీలక ప్రాంతాలకు రూపకల్పన చేశారు. వాటిలోకి మనుషులెవరూ అడుగు పెట్టకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో 1980 నాటికి పులుల సంఖ్య రెట్టింపు అయింది. 1972లో పులుల సంఖ్య 1827. 2002లో 3642. అయితే 2018 నాటి చిట్ట చివరి లెక్కల ప్రకారం చూస్తే మాత్రం నిరుత్సాహమే. పులుల సంఖ్య ఆ మూడు వేల దగ్గరే ఆగి ఉంది! -
పులి గాండ్రిస్తోంది!
అచ్చంపేట : నల్లమల అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో జాతీయ జంతువుల మనుగడ కొనసాగుతుంది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు చేపట్టిన గణ నలో 21 పెద్ద పులులు, 57 చిరుతల అ డుగు జాడలను సేకరించారు. ఇప్పటికే మాంసాహార జంతువుల గణన పూర్తి కా గా శనివారం నుంచి రెండురోజులపాటు శాఖాహార జంతువుల గణన చేపడుతారు. క్షేత్రస్థాయిలో సేకరించిన జాడల (పాదముద్రలు)ను సిబ్బంది ఇప్పటికే అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ సీసీ వినోద్‌కుమార్, డీఎఫ్ఓ జోజీలకు వివరిస్తూ నివేదిక అందజేశారు. అమ్రాబాద్ అభయారణ్యంలో 214 బీట్లలో చేపట్టిన గణనలో పులులు, చిరుతల పాదముద్రలు, మలం , వెంట్రుకలు సేకరించిన అటవీశాఖ అధికారులు వీటి సంఖ్యను తేల్చే ందుకు పరీక్షల నిమిత్తం పంపించారు. పరీక్షల అనంతరం వాటి లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు. నిర్ధేశించిన ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది, అటవీ అకాడమీ విద్యార్థులు, ఎన్జీఓలు లైనింగ్‌ల వెంట కాలినడకన తిరుగుతూ పులులు, చిరుత పులుల పాదముద్రలను సేకరించారు. ప్రతి బీట్‌లో ఇద్దరు చొప్పున గణనలో పాల్గొన్నారు. ఎక్కడెక్కడ ఎన్ని.. అచ్చంపేట రేంజ్ పరిధిలోని బాణాల, చౌటపల్లి బీట్లలో 2 పులులు, 12 చిరుతలు, మన్ననూర్లోని 10 బీట్లలో 8 పులులు, 20 చిరుతలు, దోమలపెంట రేంజ్ పరిధిలో బోరెడ్డిపల్లి, కొమ్మనపెంట, వటవర్లపల్లి బీట్లలో 2 పులులు, అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని కొల్లంపెంట, పర్షాబాద్ నార్త్ బీట్లలో 3 పులులు, 9 చిరుతలు, 4 ఎలుగుబంట్లు, మద్దిమడుగు రేంజ్లో గీసుగండి, బాపన్‌పాడు బీట్లలో 2 పులులు, 6 చిరుతలు, కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని ఎర్రపెంట, ఎర్రగుండం పెంట బీట్లలో 2 పులులు, 9 చిరుతలు, లింగాల రేంజ్లో మర్లపాయ బీట్‌లో 2 పులుల, 5 చిరుత ల పాదముద్రలు లభించాయి. గతంలో ఎప్పుడూ కూడా బల్మూర్ మండలం బాణాల, అచ్చంపేట మండలం చౌటపల్లి ప్రాంతంలో పులుల జాడలు కనిపించలేదు. మొదటిసారి ఇక్కడ పులులు, చిరుతల జాడలు లభించడం గమనార్హం. బాణాల, బిల్లకలు సమీపంలో రుసుల చెరువు ఉండటంతో నీళ్లు తాగడానికి వచ్చిన పులి ఈ ప్రాంతం లో సంచరించి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే.. దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్ అయారణ్యం 45వ స్థానంలో ఉండగా.. దక్షణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్త రించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ అభయారణ్యం కాగా 445.02 చదరపు కి.మీ బఫర్‌జోన్‌గా ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ పులు లు, చిరుతలతోపాటు ఇతర జంతువులు, పక్షుల లెక్కలు కూడా ఇందులో పొందుపరిచా రు. 200 రకాల పక్షులు, క్షీరదాలు, వంద రకాల సీతాకోక చిలకలు, 50 రకాల క్రి ములున్నాయి. అటవీశాఖ కూడికలు, తీసివేతల ప్రకారం పులులు, చిరుతల లెక్క లు చెబుతున్నారే తప్ప వాస్తవంగా ఎన్ని ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. ఇంత వరకు పులుల సంఖ్య చెబుతున్నారే తప్ప వాటి పిల్లల సంఖ్య.. సీసీ పుటేజీల్లో కనిపించినట్లు ఎక్కడా చెప్పడం గాని.. చూపడం గాని జరగడం లేదు. -
పులి... చిన్నారిని చంపేసింది
పాట్నా: ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసి చంపేసింది. ఈ సంఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెరిహండీ గ్రామ సమీపంలో వాల్మీకి నేషనల్ పార్క్‌లో శుక్రవారం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. నేషనల్ పార్క్ సమీపంలోని గ్రామ పరిధిలో చిన్నారి బబ్లూ ఆటలాడుకుంటున్నాడు. ఆ క్రమంలో బబ్లూపై పులి ఆకస్మాత్తుగా దాడి చేసి చంపేసింది. అనంతరం అతడి శరీరాన్ని చిన్నచిన్న ముక్కలుగా చిన్నాభిన్నం చేసింది. దాంతో గ్రామస్తులు, పార మిలటరీ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే వాల్మీకి నేషనల్ పార్క్‌లో పులుల సంఖ్య గత మూడేళ్ల కాలవ్యవధిలో రెండింతలు అయ్యాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్క్ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం మృతి చెందిన బబ్లూ కుటుంబానికి రూ. 2 లక్షలు నష్ట పరిహారం అందజేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.