tippareddy
-
బీజేపీ ఎమ్మెల్యేకు షాక్.. వాట్సాప్‌లో యువతి న్యూడ్ వీడియో కాల్చేసి..
ఇటీవలి కాలంలో హనీట్రాప్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాజకీయనేతలు, ప్రముఖులే టార్గెట్‌గా అందమైన యువతులు హనీట్రాప్‌నకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేకు భారీ షాక్ తగిలింది. ఓ యువతి వాట్సాప్ కాల్ చేసి న్యూడ్‌గా మాట్లాడటంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్ చేశాడు. వివరాల ప్రకారం.. కర్నాటకలోని చిత్రదుర్గ ఎమ్మెల్యే జి.హెచ్. తిప్పారెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. ఓ అపరిచిత యువతి తిప్పారెడ్డికి వాట్సాప్ కాల్ చేసి హనీట్రాప్ చేసేందుకు ప్రయత్నించింది. సదరు యువతి తనకు అక్టోబర్ 31వ తేదీన తనకు వీడియో కాల్ చేసిందన్నారు. అయితే, నియోజకవర్గానికి చెందిన వ్యక్తులెవరైనా తనకు కాల్ చేస్తున్నారని భావించిన ఆయన.. కాల్ లిఫ్ట్ చేయడంతో యువతి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈ క్రమంలో తన దుస్తులు విప్పేసి న్యూడ్‌గా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. తాను వెంటనే కాల్ కట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. కాగా, మరికొద్ది క్షణాలు తర్వాత.. ఆమె మళ్లీ కాల్ చేసిందన్నారు. దీంతో, తన భార్యను కాల్ లిఫ్ట్ చేయమని చెప్పాను. అనంతరం, తన భార్య.. ఆ నంబర్‌ను బ్లాస్ చేసినట్టు చెప్పుకొచ్చారు. అనంతరం, ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. Karnataka #BJP Mla #GHThippareddy files complaint alleging there was an attempt to #HoneyTrap him. In his complaint, he alleges, he received a video call on WhatsApp, and some lady, on the other end stripped herself in the video. MLA has filed complaint with #Chitradurga police. pic.twitter.com/bcdcdyqq0k — Hate Detector 🔍 (@HateDetectors) November 2, 2022 -
శస్త్ర చికిత్స చేసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
కడుపులో పేగు కుళ్లిపోయి.. తీవ్ర నొప్పితో బాధపడుతూ మదనపల్లె ఏరియా ఆస్పత్రికి వచ్చిన బాలికకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు. పెద్దాస్పత్రికి తీసుకెళ్లే స్థోమత లేదని, ఇక్కడే శస్త్రచికిత్స చేయాలని బాలిక తల్లిదండ్రులు వేడుకున్నారు. హైరిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్‌ను తాము చేయలేమని చేతులెత్తేశారు. విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా మదపల్లె ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. విజయవంతంగా ఆపరేషన్ చేసి బాలికప్రాణాలు కాపాడారు. మదనపల్లెకు చెందిన 13 ఏళ్ల బాలిక ఏడో తరగతి చదువుతోంది. ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడం తో సోమవారం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. జనరల్ సర్జన్ ఫహీమ్‌నవాజ్, సహాయక సర్జన్ రామకృష్ణారెడ్డి ఆపరేషన్‌కు ఉపక్రమించారు. థియేటర్‌లోనికి వెళ్లిన తర్వాత బాలిక పరిస్థితిని గమనించి ఎక్కువ రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్ అని తిరిగి వెనక్కి వచ్చేశారు. విషయాన్ని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రవికుమార్ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డికి ఫోన్‌చేసి కేసు పరిస్థితిని వివరించారు. జనరల్ సర్జన్ అయిన తిప్పారెడ్డి స్థానికంగానే వైద్య సేవలందించేవారు. వెంటనే ఆస్పత్రికి చేరుకుని జనరల్ సర్జన్ల సమక్షం లో బాలికకు ఆపరేషన్ చేసి కుళ్లిపోయిన పేగును తీసేశారు. ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎమ్మెల్యే గా రాజకీయ కోణంలోనే కాకుండా వైద్యుడిగా కూడా తన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తిప్పారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
బాబును ముప్పు‘తిప్ప’లు పెట్టింది
కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని ఎంతోకాలంగా పార్టీకి సేవలందిస్తున్న తమ్ముళ్లకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబబాబు నాయుడు చేయిచ్చారు.. ఆ తర్వాత పలుమార్లు అభ్యర్థులను మార్పు చేశారు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోసిగి బహిరంగ సభలో మంత్రాలయం అభ్యర్థిని ప్రజలకు పరిచయం చేస్తూ.. పాలకుర్తి తిక్కారెడ్డికి బదులుగా తిప్పారెడ్డి అని పేర్కొనడం తమ్ముళ్లకు నవ్వు తెప్పించింది. ఏదో పొరపాటు అన్నారనుకుంటే.. మూడుసార్లు ఇదే పేరు ఉచ్ఛరించడం గమనార్హం. పక్కనే ఉన్న ఎంపీ అభ్యర్థి బి.టి.నాయుడు పేరు తప్పని పదేపదే ఆయన చెవు కొరికినా ఫలితం లేకపోయింది. మొత్తానికి తిక్కారెడ్డి పేరు బాబును ముప్పు‘తిప్ప’లు పెట్టింది.