Tirumala Sri Venkateswara Swamy
-
Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (సోమవారం) 81,057 మంది స్వామివారిని దర్శించుకోగా 27,913మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.80 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
సాక్షి, తిరుపతి: ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో ఆయన తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహా ద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్ళారు. మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రధానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని స్వామివారి దర్శనానికి వెళ్లారు. మూలవిరాట్టు దర్శనం చేసుకున్నారు. అనంతరం హుండీ లో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. టీటీడీ డైరీ, క్యాలండర్లను ప్రధానికి అందించారు. ఆయన సుమారు 50 నిముషాల పాటు ఆలయంలో గడిపారు. అనంతరం రచన అతిథి గృహానికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రధానికి పర్యటన సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు. ప్రధాని వెళ్లే మార్గాలలో ఉన్న దుకాణాలు మూసివేశారు. వాహన రాకపోకలు నిషేధించారు. ప్రధాని పర్యటనకు మీడియాని కూడా అనుమతించలేదు. కాగా, ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు. చదవండి: జనం మెచ్చిన 'జగన్' -
టీటీడీ వంటశాలలో ప్రమాదం
సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలోని వంటశాల(పొటు)లో ప్రమాదం సంభవించింది. చింతపండు రసం తయారు చేసే విద్యుత్ బాయిలర్ పగిలి అందులోని వేడి నీరు ఐదుగురు పోటు కార్మికులపై పడడంతో గాయాల పాలైయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని తిరుమలలోని ఆశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గాయపడ్డ కార్మికులను టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి పరామర్షించారు. టీటీడీలో ఇప్పటివరకు ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదని పోటు ఇంచార్జ్ వరద రాజులు అన్నారు. వారం రోజులకు ఓసారి అధికారులు మాస్ క్లీనింగ్ నిర్వహిస్తారని, ప్రమాదవశాత్తే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఆ స్వామివారు కాపాడారని అన్నారు. (ఘనంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ) -
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
సాక్షి, మహబూబాబాద్ రూరల్: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ శనివారం దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి నిర్వహించే నైవేధ్య పూజా సమయంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఎమ్మెల్సీకి ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు. తనకు తగిన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని కోరినట్లు తెలిపారు. -
తిరుమలలో నేడు, రేపు బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 12వ తేదీ మంగళవారం రథసప్తమి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 11, 12వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. అదేవిధంగా, 12వ తేదీ చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. రథసప్తమి రోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అలాగే, 12వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. -
శ్రీవారి సేవలో రేమాండ్స్ అధినేత
గౌత మ్ సంగానియా సాక్షి,తిరుమల: రేమాండ్స్ కార్పొరేట్ కంపెనీ అధినేత గౌతమ్ సింగానియా సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఆయన సతీసమేతంగా సుపథం మార్గం నుంచి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి దర్శనం కల్పించి, అనంతరం లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
అందుబాటులో ఆర్జిత సేవా టికెట్లు
తిరుమల, న్యూస్‌లైన్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి రోజు ఉదయం వేళలో నిర్వహించే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లు సోమవారం లక్కీడిప్‌లో అందుబాటులో ఉంటాయి. మంగళవారం వేకువజామున స్వామివారికి నిర్వహించే తోమాల - 04, అర్చన-10 టికెట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆర్జిత సేవల్లో ఖాళీగా ఉన్న కొన్ని టికెట్లను భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు అదనంగా లక్కీడిప్ ద్వారా సుప్రభాతం-25, అష్టదళం-15, తోమాల-10, అర్చన-10 టికెట్లను అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లను కేంద్రీయ విచారణ కార్యాలయంలోని విజయబ్యాంక్లో లక్కీడిప్ పద్ధతిలో భక్తులకు కేటాయిస్తారు. సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు భక్తులు తమ పేర్లు కంప్యూటర్లో నమోదు చేసుకోవాలి. 5 గంటల తరువాత ఎంపికైన భక్తులకు ఎస్ఎమ్ఎస్ల ద్వారా సమాచారం తెలియజేస్తారు. ఎంపికైన భక్తులు రాత్రి 8లోపు టికెట్లు కోనుగోలు చేయాలి. టికెట్లు పొందిన భక్తులు మంగళవారం ఈ సేవల్లో పాల్గొనవచ్చు. శ్రీవారి దర్శనానికి 22 గంటలు: తిరుమల శ్రీవారి దర్శనానికి 22 గంటల సమయం పడుతోంది. ఆదివారం సెలవురోజు కావటంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగాపెరిగింది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 48,324 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. -
వెంకన్న భక్తులకు ‘సమైక్య’ కష్టాలు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంటే తమిళనాడు వాసులకు మహాప్రీతి. ఆ దేవదేవుడిని కనులారా చూద్దామని లక్షలాదిగా తరలి వెళుతుంటారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా తమిళనాడు, సీమాంధ్ర మధ్య బస్సుసేవలు నిలిచిపోయాయి. మరోవైపు రైళ్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో భక్తులకు దిక్కుతోచడం లేదు. సాక్షి, చెన్నై: ప్రత్యేక తెలంగాణ ప్రకటనతో సీమాంధ్రలో ఉద్యమం మొదలైంది. అక్కడి సెగ చెన్నై, వేలూరు, తిరువళ్లూరు, కృష్ణగిరి, ధర్మపురి తదితర రాష్ట్ర సరిహద్దు జిల్లాల్ని తాకింది. ఫలితంగా ప్రభుత్వ బస్సు సేవలు నిలిచిపోయాయి. ఎక్కడి బస్సులు అక్కడే ఆగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి రైలు ప్రయూణమే ఆధారమవుతోంది. అయితే అన్ని రైళ్లూ కిటకిటలాడుతున్నాయి. భక్తులకు కష్టాలు వెంకన్న బ్రహ్మోత్సవాలు తిలకించాలంటే రెండు కళ్లూ చాలవంటారు. అలాంటి బ్రహ్మోత్సవాలకు తమిళనాడు నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వెళ్లడం ఆనవాయితీ. స్వామివారి సేవలో తరించేందుకు పెద్దయెత్తున్న భజన బృందాలు ఇక్కడి నుంచే వెళతాయి. రామానుజం కుట్టుం అని పిలిచే ఈ బృందాలు ఆలయ మాడావీధుల్లో భజనలు చేస్తుంటాయి. స్వామివారి గరుడసేవకు చెన్నై నుంచి గొడుగులు, శ్రీవళ్లి పుత్తూరు నుంచి పూలమాల వెళ్లడం ఆనవాయితీ. అలాగే గోవింద మాల ధరించి వేలాది మంది పాదయాత్ర రూపంలో తిరుమలకు వెళుతుంటారు. పస్తుతం సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. ఫలితంగా బ్రహ్మోత్సవాలు చూసే భాగ్యం ఎక్కడ కోల్పోతామోనని తమిళనాడులోని భక్తులు ఆందోళన చెందుతున్నారు. స్వామి మీదే భారం వేసి ముందుకు కదులుతున్నారు. బస్సులు లేకపోవడంతో రైళ్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో తిరుపతి మీదుగా వెళ్లే సప్తగిరి, గరుడ ఎక్స్‌ప్రెస్, లోక్ ఎలక్ట్రిక్ రైళ్లు కిటకిటలాడుతున్నాయి. గోవింద మాల భక్తులు, ఇంకొందరు కాలినడకనే తిరుమలకు పయనమవుతున్నారు. కోర్టులో పిటిషన్ వెంకన్న భక్తులు ఎదుర్కొంటున్న కష్టాల్ని గుర్తించిన చెన్నైకి చెందిన న్యాయవాది జ్ఞానశేఖరన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తిరుపతిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు తమిళనాడు నుంచి లక్షలాది మంది భక్తులు వెళతారని పిటిషన్లో పేర్కొన్నారు. పాదయాత్ర రూపంలో, రైళ్ల ద్వారా అతికష్టం మీద తిరుపతికి వెళుతున్నారని వివరించారు. వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులకు తిరుపతిలో ఇబ్బందులు కలగకుండా గట్టి భద్రత కల్పించే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్, సత్యనారాయణతో కూడిన బెంచ్ శనివారం సాయంత్రం విచారించింది. అయితే భక్తులపై దాడులు దిగిన సందర్భాలు లేవని బెంచ్ పేర్కొంది. ఈ దృష్ట్యా భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేమని పిటిషన్‌ను తిరస్కరించింది.