శాకంబరి అలంకరణలో శ్రీతిరుపతమ్మ
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారు ¿శాకంబరీ అలంకరణలో ఈనెల 24న భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ ఈవో మంచనపల్లి రఘునాథ్, చైర్మన్ కర్ల వెంకటనారాయణలు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శాకంబరీ ఉత్సవంలో భాగంగా అమ్మవారితో పాటు ఉపాలయాల్లోని సహదేవతలను, ఆలయ పరిసరాలను పలు రకాల శాకములు(కూరగాయాల)తో అలంకరిస్తామన్నారు.
అదేరోజు చండీహోమం, రథంపై శాకంబరీ అలంకరణలో అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందన్నారు. అలంకరణకు కావాల్సిన కూరగాయలు, పండ్లు ఇవ్వదలచిన దాతలు 23వ తేదీన ఆలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు ఆలయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈ రమ, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.