tolerate
-
మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభు త్వంలో మంత్రిగా ఉన్న చౌదరి ఫవాద్ హుస్సేన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌లో విద్వే షం, ఉగ్రవాద శక్తులను శాంతి సామరస్యా లు ఓడించాలని ఆకాంక్షించారు. దీనికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీటైన సమాధానమిచ్చారు. ‘చౌదరి సాహిబ్, నేను, మా దేశ ప్రజలకు సమస్యల్ని పరిష్కరించుకునే సమర్థత ఉంది. మీ ట్వీట్ అవసరం లేదు. పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. మీ దేశం సంగతి చూసుకోండి. ఎన్నికలు భారత్ అంతర్గత వ్యవహారం. ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్‌గా ఉన్న పాకిస్తాన్ మా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోం’అని హెచ్చరించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ అభిప్రాయాలపై చౌదరి ఫవాద్ హుస్సేన్ స్పందించారు. ‘ఉగ్రవాదానికి సరిహద్దులతో సంబంధంలేదు. పాక్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి. మెరుగైన సమాజం కావాలనే ఎవరైనా కోరుకుంటారు’అని పేర్కొన్నారు. ఈ పరిణామంపై బీజేపీ స్పందించింది. ‘ఆప్ నేత అవినీతి రాజకీయాలకు పాక్ నుంచి కూడా వంతపాడుతున్నారు. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ పాక్ నుంచి స్పందిస్తుంటారు. దేశ శత్రువులతో కేజ్రీవాల్ అంటకాగుతున్నారనడానికి ఇదే రుజువు’ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ పేర్కొన్నారు. -
‘మరోసారి పాక్ దాడులు చేస్తే సహించేది లేదు’
Taliban administration blamed Pakistan for airstrikes: అఫ్గనిస్తాన్ రాజధాని కాబోల్ని కునార్, ఖోస్ట్ ప్రావిన్స్‌లలో వరుస వైమానిక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అఫ్గాన్ ఈ దాడులను పాకిస్తాన్ నిర్వహించిందని సంచలన ఆరోపణలు చేసింది కూడా. పైగా తాము ఈ దాడులను సహించమని తాలిబన్లు హెచ్చరించారు. అయితే పాక్ మాత్రం అఫ్గనిస్తాన్ సరిహద్దులో జరిగిన వైమానిక దాడుల్లో తమ ప్రమేయం లేదని ధృవీకరించకపోవడం గమనార్హం. ఈ మేరకు అఫ్గనిస్తాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్ మాట్లాడుతూ...మేము ప్రపంచం, పోరుగు దేశాల నుంచి చాలా రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఇందుకు మా సరిహద్దు భూభాగాల్లో జరిగిన వైమానిక దాడులే ఒక ఉదాహరణ. కానీ పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ రెండు సోదర దేశాలు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మేమే ఈ దాడులన సహించాం. మరోసారి ఈ దాడులు జరిగితే సహించేది లేదు అని నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ రెండు దేశాలు తీవ్రవాదాన్ని వ్యతిరేకించేవే కానీ గత కొంతకాలంగా తీవ్రవాదానికి సంబంధించిన దేశాలు అనే కళంకంతో బాధపడుతున్నాయని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ఆయా గడ్డలలో ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవడంలోనూ ఇరు దేశాలకు సంబంధించిన అధికారులు సహకరించాలని చెప్పారు. ఈ దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తాలిబాన్ పరిపాలన విదేశాంగ శాఖ గత వారం పాకిస్తాన్‌న్ రాయబారిని పిలిచింది కూడా. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 36 మంది మరణించారని అఫ్గాన్ స్థానిక అధికారులు తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ 16న ఖోస్ట్, కునార్ ప్రావీన్సులలో జరిగిన వైమానిక దాడుల్లో 20 మంది పిల్లలు మరణించారని ఆఫ్ఘనిస్తాన్లోని ఐక్యరాజ్యసమితి పిల్లల ఏజెన్సీ హెడ్ పేర్కొన్నారు. (చదవండి: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు) -
జనసభలో మాట్లాడుతున్నా..ఆశీర్వదించండి!
-
జనసభలో మాట్లాడుతున్నా..ఆశీర్వదించండి!
అహ్మదాబాద్: గుజరాత్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. లోక్ సభలో మాట్లాడనివ్వడంలేదనీ అందుకే తను జనసభలో మాట్లాడుతున్నానంటూ పార్లమెంటులో ప్రతిపక్షాల చేస్తున్న ఆందోళనపై విరుచుకుపడ్డారు. పేదల వికాసం కోసమే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా, నల్ల డబ్బు కు వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజరాత్లో దీసాలో శనివారం ఓ సభలో మోదీ పెద్ద నోట్ల రద్దును పూర్తిగా సమర్థించుకన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తోన్న నల్లధనాన్ని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడి సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని, బ్యాంకర్లు ఈ-వ్యాలెట్ల ద్వారా బ్యాంకులనే మీ మొబైల్ ఫోన్లలోకి తీసుకొచ్చారని చెప్పారు. వాటిని ఉపయోగించుకుంటూ నగదురహిత లావాదేవీలు జరపాలని పిలుపునిచ్చారు. నల్లధనం దాచుకున్న అక్రమార్కులు ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చామని అన్నారు. నన్ను విమర్శించండి...కానీ నగదు రహిత లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ పై ప్రజలకు అవగాహన క్పలించాలని ప్రతిపక్షాల్నికోరారు. నల్లధనంపై పోరులో 50 రోజులు గడువు అడిగాం.. ఇపుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయో మీరు చూస్తున్నారని మోదీ చెప్పారు. నకిలీ కరెన్సీని, అవినీతిని దేశం ఎట్టి పరిస్తితుల్లోనూ సహించదు. ఈ విషయంలో మీ దీవెనలు కావాలంటూ ప్రజలనుద్దేశించి మోదీ కోరారు. ఇపుడు ప్రజల శక్తి బలం పెరుగుతోంది. రూ.100నోట్లను సరఫరాను పెంచామంటూ ప్రధాని ప్రసంగిచారు.