Tom Hartley
-
ఉత్కంఠ రేపుతున్న వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఫైనల్ ట్రైలర్
‘మ్యాడ్ మ్యాక్స్, ది రెవినాంట్, ఇన్సెప్షన్’ వంటి సినిమాల్లో నటించిన టామ్ హార్డీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డాన్స్’. కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మార్వెల్ సంయుక్తంగా నిర్మించాయి. సోనీ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఇండియాలో ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనుంది. 3డితో పాటు ఐమాక్స్ 3డి వెర్షన్లో అక్టోబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి: పద్దెనిమిదో శతాబ్దం నేపథ్యంలో మహేశ్-రాజమౌళి సినిమా)ఈ సందర్భంగా ఈ చిత్రం ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘‘ఇది నీకు నచ్చకపోవచ్చు... నచ్చదు... నాకు కచ్చితంగా నచ్చదని గ్యారెంటీ ఇస్తున్నాను’, ‘ఆ గ్రహవాసులు మనల్ని కనిపెట్టారు’, ‘దాన్ని ఎవరు పంపించారు... ఆ సృష్టిక్తర’, ‘మీరు కలిసుంటే ఈ ప్రపంచం మనుగడ సాగించలేదు’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘టామ్ హార్డీ నటనతో ΄ాటు వెనమ్ క్యారెక్ట్ చేసే యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన ‘వెనమ్’ మొదటి భాగం, రెండవ భాగం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘వెనమ్: ది లాస్ట్ డాన్స్’ పై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
Day 2: చెలరేగిన ఇంగ్లండ్ స్పిన్నర్లు.. ఆదుకున్న జైస్వాల్
India vs England, 4th Test Day 2 Score: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలిరోజు ఆటలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో చెలరేగగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అయితే, జో రూట్ రాకతో సీన్ మారిపోయింది. ‘బజ్‌బాల్’ కాన్సెప్ట్నకుకు విరుద్ధంగా అచ్చమైన సంప్రదాయ క్రికెట్ ఆడుతూ రూట్ అజేయ సెంచరీతో చెలరేగిన కారణంగా.. తొలి రోజు ఇంగ్లండ్ తిరిగి పుంజుకోగలిగింది. ఆట పూర్తయ్యే సరికి 300 పరుగుల మార్కు దాటేసింది.ఈ క్రమంలో 302/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవరాల్‌గా భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. 𝙅𝙖𝙖𝙙𝙪𝙞 𝙅𝙖𝙙𝙙𝙪 weaving magic with the ball 🪄 Three quick wickets helped #TeamIndia bowl out the visitors early! 💪🏻#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/iiWyPgAn4C — JioCinema (@JioCinema) February 24, 2024 ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సర్ ఆదిలోనే షాకిచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత యువ బౌలర్ షోయబ్ బషీర్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. పాక్ మూలాలున్న ఈ రైటార్మ్ స్పిన్నర్ దెబ్బకు శుబ్‌మన్ గిల్(38), రజత్ పాటిదార్(17) లెగ్ బిఫోర్ వికెట్లుగా వెనుదిరిగారు. ఇక జట్టును ఆదుకుంటాడనుకున్న రవీంద్ర జడేజా(12)ను కూడా బషీరే పెవిలియన్‌కు పంపడం గమనార్హం. Bashir breaks the crucial partnership between Gill and Jaiswal! 🥲 #INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/hCKcWdJq5A — JioCinema (@JioCinema) February 24, 2024 ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకుని దానిని సెంచరీగా మలిచే ప్రయత్నం చేయగా.. బషీర్ అద్బుత రీతిలో అతడి బౌల్డ్ చేశాడు. దీంతో 73 పరుగులకే జైస్వాల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 ఇక సర్ఫరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్(1)లను మరో స్పిన్నర్ టామ్ హార్లే పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఈ క్రమంలో జైస్వాల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, అశూ స్థానంలో వచ్చిన కుల్దీప్ యాదవ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట ముగిసే టీమిండియా 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుబడి ఉంది. చేతిలో ఇంకా మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఆట పూర్తయ్యే సరికి జురెల్ 30, కుల్దీప్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ టీమిండియాపై పైచేయి సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. చదవండి: బంతితో చెలరేగిన బషీర్.. అంతకంటే ముందు సర్ఫరాజ్‌కు షాకిచ్చాడిలా! Kuldeep Yadav spinning surprises with both bat & ball! 🤩#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSport pic.twitter.com/D7hDjNf04x — JioCinema (@JioCinema) February 24, 2024 -
ఇదేందయ్యా ఇది.. ఇలా ఎప్పుడు చూడలే!.. రోహిత్ సీరియస్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. నాలుగో రోజు ఆటలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన విధానానికి ఫీల్డ్ అంపైర్‌ను అడ్డగించాడు. అతడు వివరణ ఇచ్చిన తర్వాత అసంతృప్తిగా సహచరులతో కలిసి అక్కడి నుంచి కదిలాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వైజాగ్ టెస్టులో సోమవారం నాటి ఆటలో భాగంగా టీమిండియా విజయానికి మూడు వికెట్ల దూరంలో ఉన్న సమయంలో.. ఇంగ్లండ్ టెయిలెండర్ టామ్ హార్లీని అవుట్ చేసే అవకాశం వచ్చింది. 62.5వ ఓవర్లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో టామ్ హార్లీ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ చేతికి బంతి చిక్కింది. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ హార్లీని అవుట్‌గా ప్రకటించాడు. ఎనిమిదో వికెట్ కూడా పడిందన్న సంబరంలో టీమిండియా ఉండగా.. హార్లీ రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో బాల్ ట్రాకింగ్‌లో.. బంతి తొలుత హార్లీ ముంజేతిని తాకి బ్యాట్‌కు తాకినట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చారు. అయితే, ఎల్బీకి అప్పీలు చేయకపోయినా.. లెగ్ బిఫోర్ వికెట్‌ను థర్డ్ అంపైర్ ట్రాక్ చేసి.. అంపైర్స్ కాల్ ప్రకారం నాటౌట్ అని ప్రకటించింది. దీంతో గందరగోళం నెలకొంది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై భారత సారథి రోహిత్ శర్మ సహా అశ్విన్ విస్మయం చేస్తూ.. అంపైర్స్ కాల్ ప్రకారం ఇది అవుటే కదా.. నాటౌట్ ఎలా ఇస్తారు? అని మైదానంలో ఉన్న అంపైర్‌తో వాదనకు దిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘స్పిప్స్‌లో క్యాచ్ పట్టుకున్నపుడు నేను అవుట్ ఇచ్చాను. ఎల్బీడబ్ల్యూకు కాదు’’ అని రోహిత్ సేనకు సదరు ఆన్ ఫీల్డ్ అంపైర్ బదులిచ్చాడు. ఏదేమైనా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది టీమిండియా. ఈ హైడ్రామాకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఇలాంటి డీఆర్ఎస్ ఎప్పుడూ చూడలేదు.. క్యాచ్ విషయంలో అంపైర్స్ కాల్ రివర్స్ అంటూ నాటౌట్ ఇచ్చారు. ఎల్బీకి అప్పీలు చేయకపోయినా.. మరోసారి అదే అంపైర్స్ కాల్ పేరు చెప్పి ఈసారీ నాటౌట్ ఇచ్చారు. చిత్రంగా ఉంది’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు నాలుగో రోజే ఆట ముగించి ఇంగ్లండ్‌ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. - The umpire gives Tom Hartley out (caught behind) - Hartley reviews - No spike on Snicko - Checks LBW & Overturns on-field decision of caught behind (Umpire's call for LBW - not-out) - A successful review for Hartley Ashwin stays on 499* pic.twitter.com/s8UzgMXOYD — CricTracker (@Cricketracker) February 5, 2024 View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
Ind vs Eng: ఇంగ్లండ్‌కు షాక్.. కీలక స్పిన్నర్ దూరం
టీమిండియాపై తొలి టెస్టులో జోరు మీదున్న ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక స్పిన్నర్ జాక్ లీచ్ రెండో మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోకాలి కారణంగా అతడు విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో జాక్ లీచ్ స్థానంలో పాక్ మూలాలున్న యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఉపఖండ పిచ్‌లపై బంతి బాగా టర్న్ అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అనుభవజ్ఞుడైన జాక్ లీచ్‌తో పాటు యువ బౌలర్లు రెహాన్ అహ్మద్, టామ్ హార్లీలను తుదిజట్టులో ఆడించింది. వీరంతా మెరుగ్గా ఆడి జట్టు విజయంలో పాలుపంచుకోగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ కూడా అద్భుతంగా రాణించాడు. అరంగేట్ర బౌలర్ హార్లీ అత్యధికంగా తొమ్మిది వికెట్లు తీస్తే.. రూట్ ఐదు, రెహాన్ మూడు, జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టారు. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జాక్ లీచ్ ఎడమ మోకాలికి గాయమైంది. ఇదిలా ఉంటే... బ్యాటర్ ఒలి పోప్ అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు.. బౌలర్లు రాణించడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమిండియా మీద 28 రన్స్ తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో రెండో మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా- ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు సిద్ధం కాగా.. జాక్ లీచ్ నెట్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే టీమిండియా గెలిచేది: ఇంగ్లండ్ మాజీ సారథి -
వాళ్లిద్దరు అత్యద్భుతం.. రోహిత్‌ను చూసే నేర్చుకున్నా: స్టోక్స్
India vs England, 1st Test: టీమిండియాతో తొలి టెస్టులో విజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ హర్షం వ్యక్తం చేశాడు. భారత గడ్డపై సాధించిన ఈ గెలుపు వందకు వంద శాతం ఎంతో గొప్పదని వ్యాఖ్యానించాడు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి సాధించిన పరిపూర్ణ విజయమని పేర్కొన్నాడు. నాలుగో రోజే ముగిసిన టెస్టు అదే విధంగా.. ఉపఖండంలో తొలిసారి కెప్టెన్ హోదాలో అడుగుపెట్టానని.. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టును ఓడించడం సంతోషంగా ఉందన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ టీమిండియాను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఉప్పల్‌లో తొలి రెండు రోజులు వెనుకబడ్డ స్టోక్స్ బృందం.. అనూహ్యంగా పుంజుకుని నాలుగో రోజే ఖేల్ ఖతం చేసి విజయం అందుకుంది. పరిపూర్ణ విజయం.. ఒలీ పోప్ అద్భుత శతకం(196), అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్లీ(మొత్తం తొమ్మిది వికెట్లు) కారణంగా ఊహించని రీతిలో టీమిండియాను ఓడించింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మా జట్టు విజయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఘన విజయం మరింత గొప్పగా అనిపిస్తోంది. ఇండియాలో కెప్టెన్‌గా నా తొలి ప్రయత్నంలోనే గెలుపు దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో మేము పొరపడ్డ మాట వాస్తవం. అయితే, టీమిండియా స్పిన్నర్లు ఆడుతున్న తీరు.. రోహిత్ ఫీల్డింగ్ సెట్ చేస్తున్న విధానాన్ని గమనిస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. వాటిని మా వ్యూహాలకు అనుగుణంగా అమలు చేసి ఫలితం రాబట్టడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరు అత్యద్భుతం అదే విధంగా తమ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒలీ పోప్, టామ్ హార్లీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘భుజానికి సర్జరీ చేయించుకున్న తర్వాత ఒలీ పోప్ రీ ఎంట్రీలో ఇలా అదరగొట్టాడు. టామ్‌కు ఇదే అరంగేట్ర మ్యాచ్. అయినప్పటికీ తన మీద నమ్మకంతో వరుసగా ఓవర్లు వేయించాను. ప్రతికూల ఫలితం వచ్చినా పర్లేదని ముందే నిశ్చయించుకున్నా. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) అయితే, అతడు నా నమ్మకాన్ని నిజం చేశాడు. ఉపఖండంలో అనేక టెస్టులు ఆడిన అనుభవం నాకు ఉంది. అయితే, ఓ ఇంగ్లిష్ బ్యాటర్ ఇక్కడ ఆడిన అత్యద్భుత ఇన్నింగ్స్ ఏదంటే.. ఒలీ పోప్ పేరు చెప్పొచ్చు. నిజానికి ఒకవేళ మేము ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా నేను పెద్దగా బాధపడే వాడిని కాదు. వైఫల్యాలకు భయపడే వాడిని కానేకాను. ఆటగాళ్లను కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తూ.. ఎల్లవేళలా వాళ్లకు మద్దతుగా నిలిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతాను’’ అని బెన్ స్టోక్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. చదవండి: IND Vs ENG: ఇంట్లోనే తలవంచారు... భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తి వివరాలు -
పోప్ సంగతి సరే.. వాళ్ల విషయంలోనూ అలా ఎందుకు?: డీకే విమర్శలు
India vs England, 1st Test : సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉప్పల్‌లో గురువారం మొదలైన టెస్టులో తొలి రెండు రోజులు ఆధిపత్యం కొనసాగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇంగ్లండ్ విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజే తలవంచి ఓటమిని ఆహ్వానించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. స్వదేశంలో టీమిండియా ఇలా ఊహించని రీతిలో ఓటమిపాలు కావడంతో రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. వాళ్ల విషయంలోనూ డిఫెన్సివ్‌గా ఎందుకు? తొలి టెస్టులో భారత్ ఆట తీరు, రోహిత్ శర్మ కెప్టెన్సీపై వెటరన్, మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ స్పందిస్తూ.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడిందని విమర్శించాడు. ఒలి పోప్ వంటి బ్యాటర్ విషయంలో డిఫెన్సివ్‌గా ఉండటంలో తప్పులేదని.. కానీ.. టామ్ హార్లీ వంటి టెయిలెండర్ల విషయంలోనూ అదే తరహాలో ఆడటం సరికాదని డీకే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్ చేసి ఉంటే బాగుండన్నాడు. ఈ మేరకు జియో సినిమా షోలో దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఇంత బేలగా చూడలేదు ఇక భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. సొంతగడ్డపై టీమిండియా ఇంతకు ముందెన్నడూ ఇంత బేలగా చూడలేదన్నాడు. రోహిత్ సేన పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోవడం.. థర్డ్ ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టుకు 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఇవ్వడం తనని ఆశ్చర్యపరిచిందని అన్నాడు. భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆడుతుంది అసలు మనవాళ్లేనా అన్న సందేహం కలిగిందని వాపోయాడు. కాగా ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ ఈ మ్యాచ్‌లో 196 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. చదవండి: IND Vs ENG: ఇంట్లోనే తలవంచారు... భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ పూర్తి వివరాలు