ఎంహెచ్-17: గుర్తించాల్సిన 5 ప్రధానాంశాలు
మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గురువారం రాత్రి కుప్పకూలడంతో అందులో ఉన్న మొత్తం 295 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విమానం గురించి గుర్తించాల్సిన 5 ప్రధానాంశాలివి..
మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్-17 విమానం నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 12.14 గంటలకు బయల్దేరింది.
శుక్రవారం ఉదయం 6.10 గంటలకు ఇది కౌలాలంపూర్ చేరుకోవాల్సి ఉంది. అందులో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు.
బోయింగ్ 777-200ఇఆర్ తరహా విమానాన్ని 1997 జూలై 30వ తేదీన మలేషియా ఎయిర్‌లైన్స్‌కు అందజేశారు. ఇప్పటివరకు అది 43వేల గంటల పాటు ప్రయాణించింది. ఉక్రెయిన్ గగనతలంలో ఉండగా దాంతో తమకు సంబంధాలు తెగిపోయినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
భూమికి 10 కిలోమీటర్ల ఎత్తులో అది ప్రయాణిస్తుండగా చిట్టచివరిసారిగా ఓ సైనిక నిఘా ఉపగ్రహం దీన్ని కనుగొంది. అయితే, సరిగ్గా అది ఏ ప్రాంతంలో ఉండగా క్షిపణి తాకిందో మాత్రం కనుగొనలేకపోయింది.
అలాగే, క్షిపణి సరిగ్గా ఎక్కడినుంచి బయల్దేరి వచ్చి ఈ విమానాన్ని ఢీకొందనే విషయాన్ని తేల్చడానికి గణిత సూత్రాలు, హైస్పీడ్ కంప్యూటర్లు, ఇతర సెన్సర్లను విశ్లేషకులు ఉపయోగిస్తున్నారు.