top leaders
-
ఇరాన్ సవాలు.. ఇజ్రాయెల్ సమాధానం
కేవలం 12 గంటలు. అంత స్వల్ప వ్యవధిలో ఇటు హిజ్బొల్లాను, అటు హమాస్‌ను ఇజ్రాయెల్ చావుదెబ్బ తీసింది. రెండు ఉగ్ర సంస్థల్లోనూ అత్యున్నత స్థాయి నేతలను అత్యంత కచి్చతత్వంతో కూడిన వైమానిక దాడుల ద్వారా అడ్డు తొలగించుకుంది. మంగళవారం రాత్రి హిజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుక్ర్‌ను లెబనాన్ రాజధాని బీరూట్‌లో అంతమొందించింది. తెల్లవారుజామున తన ఆగర్భ శత్రువైన ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడి»ొడ్డులో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఆయ న సొంతింట్లోనే హత్య చేసింది. తద్వారా ఎక్కడైనా, ఎవరినైనా, ఎప్పుడైనా లక్ష్యం చేసుకోగల సత్తా తనకుందని మరోసారి నిరూపించుకుంది. గాజా యుద్ధంతో ఇప్పటికే అట్టుడుకుతున్న పశి్చమాసియాలో ఇజ్రాయెల్ తాజా చర్యలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హనియే హత్యకు ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తప్పకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిజ్బొల్లా కూడా షుక్ర్ మృతిని ధ్రువీకరించింది. ‘ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పద’ని పేర్కొంది. గాజాలో కాల్పుల విరమణకు ఇక దారులు మూసుకుపోయినట్టేనని భావిస్తున్నారు...టెహ్రాన్/బీరూట్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్‌లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్‌లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్ నేతలతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్బొల్లా, యెమన్‌కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కాసేపటికే ఇజ్రాయెల్ గట్టిగా జవాబిచి్చంది. కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే ప్రాణాంతక వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. హనియేను ఇజ్రాయెల్ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్‌పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గలాంట్ ప్రకటించారు. హెచ్చరించినట్టుగానే... గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్ నమ్ముతోంది.ఇజ్రాయెల్‌కు మరణశాసనమే: ఖమేనీ అల్టిమేటంహనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ ఆధ్యాతి్మక నేత, సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు.షుక్ర్‌ను మట్టుపెట్టాం: ఇజ్రాయెల్ హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమొందించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1983లో బీరూట్‌లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్ ఆ దేశ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.శరణార్థి నుంచి హమాస్ చీఫ్ దాకా... ఇస్మాయిల్ హనియే గాజా సమీపంలో శరణార్థి శిబిరంలో 1962లో జని్మంచారు. 1987లో మొదటి పాలస్తీనా యుద్ధ సమయంలో పుట్టుకొచి్చన హమాస్‌లో ఆయన వ్యవస్థాపక సభ్యుడు. సంస్థ వ్యవస్థాపకుడు, తొలి చీఫ్ అహ్మద్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ మరణించాక హమాస్‌లో కీలకంగా మారారు. ఉర్రూతలూగించే ప్రసంగాలకు పెట్టింది పేరు. 2006లో పాలస్తీనా ప్రధానిగా గాజా పాలన చేపట్టారు. ఏడాదికే పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. నాటినుంచి గాజాలో ఫతా–హమాస్ మధ్య పోరు సాగుతోంది. అబ్బాస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హనియే గాజా ప్రధానిగా కొనసాగుతున్నారు. 2017లో హమాస్ చీఫ్ అయ్యారు. -
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్‌పురి దాకా...హోరాహోరీ
లోక్‌సభ ఎన్నికల సుదీర్ఘ ఘట్టంలో మే 7న మూడో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ విడతలో రాజకీయ ఉద్ధండులతో పాటు కొత్త ముఖాలూ బరిలో ఉన్నారు. కొల్హాపూర్‌లో ఛత్రపతి శివాజీ వారసునికి బీజేపీ టికెటిచి్చంది. శివమొగ్గలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ భార్య బరిలోకి ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ లోక్‌సభ టికెట్ తీసుకున్నారు. మెయిన్‌పురిలో డింపుల్ భాభీ మరోసారి మేజిక్ చేసేందుకు సిద్ధమంటున్నారు. ఇలా మూడో దశ బరిలో ఆసక్తి రేపుతున్న కీలక స్థానాలపై ఫోకస్... బారామతి వదినా మరదళ్ల వార్! దేశమంతటా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గమిది. మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ ముద్దుల తనయ సుప్రియా సులేపై వదిన సునేత్రా పవార్ పోటీకి సై అంటున్నారు. బాబాయి శరద్ పవార్‌పై తిరుగుబావుటా ఎగరేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని దక్కించుకున్న అజిత్ పవార్ తన చెల్లెలిపై ఏకంగా భార్యనే రంగంలోకి దించారు. సుప్రియ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. ఎన్సీపీ (శరద్) వర్గానికి సారథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నేత కంచన్ రాహుల్ కూల్‌పై 1,55,774 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి వదినా మరదళ్ల మధ్య హై ఓల్టేజ్ పోటీ నెలకొంది. సునేత్రకు బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి కూటమి బలమైన దన్నుంది. ఇక సుప్రియ కాంగ్రెస్, శివసేన (ఠాక్రే) ఎన్సీపీ (పవార్)తో కూడిన మహా వికాస్ అగాడీ తరఫున వదినకు సవాలు విసురుతున్నారు. బీఎస్పీ నుంచి ప్రియదర్శని కోక్రే కూడా రేసులో ఉన్నారు. విదిశ మామాజీ ఈజ్ బ్యాక్ మధ్యప్రదేశ్‌కు 20 ఏళ్లకు పైగా సీఎం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించి పెట్టారు. ఇంతటి రికార్డున్నా శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మళ్లీ సీఎంగా చాన్స్ రాలేదు. అయితే బీజేపీ అనూహ్యంగా ఆయనను విదిశ నుంచి లోక్‌సభ బరిలో దింపింది. ‘‘శివరాజ్‌ను ఢిల్లీకి తీసుకెళ్తా. కేంద్ర ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు’ అన్న మోదీ ప్రకటనతో విదిశ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మామాజీగా ప్రసిద్ధుడైన శివరాజ్ ఇక్కడ 1991 నుంచి 2004 దాకా వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలవడం విశేషం. బీజేపీ దిగ్గజాలు వాజ్‌పేయి ఒకసారి, సుష్మా స్వరాజ్ రెండుసార్లు ఇక్కడ విజయం సాధించారు. ఈ బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ నుంచి ప్రతాప్ భాను శర్మ బరిలో ఉన్నారు. ఆయన కూడా 1980, 1984లో ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఏకంగా 40 ఏళ్ల తర్వాత మళ్లీ బరిలో దిగుతున్నారు!ఆగ్రా త్రిముఖ పోరు యూపీకి దళిత రాజధానిగా పేరొందిన ఆగ్రాలో ముక్కోణపు పోరు నెలకొంది. సిట్టింగ్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్‌పై బీఎస్పీ నుంచి పూజా అమ్రోహి, సమాజ్‌వాదీ నుంచి సురేశ్ చంద్ర కర్దామ్ బరిలో ఉన్నారు. మోదీ–యోగీ ఫ్యాక్టర్, అయోధ్య రామమందిరం, సంక్షేమ పథకాలనే బఘెల్ నమ్ముకున్నారు. వైశ్యులు, బ్రాహ్మణులు, పంజాబీలు, యాదవేతర ఓబీసీలతో పాటు దళితుల్లో ఒక వర్గం కమలానికి మద్దతిస్తుండటం ఆయనకు కలిసి రానుంది. దళితుల ఓటు బ్యాంకుపై పూజ, జాతవ్‌లు, ముస్లిం ఓట్లపై కర్దామ్ ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడి 20.57 లక్షల ఓట్లలో 30 శాతం దళితులే. వారిలోనూ మూడొంతుల మంది జాతవ్ దళితులు! బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులిద్దరిదీ ఇదే సామాజికవర్గం. ప్రత్యర్థుల నాన్ లోకల్ విమర్శలను పూజ దీటుగా తిప్పికొడుతున్నారు. ఈ స్థానం ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. రామమందిర ఉద్యమంతో 1990 నుంచి బీజేపీ గుప్పిట్లోకి చేరింది. మధ్యలో రెండుసార్లు మాత్రం ఎస్పీ నుంచి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ గెలిచారు.శివమొగ్గ బీజేపీకి పక్కలో బల్లెం కర్ణాటక దిగ్గజ నేత బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర మరోసారి శివమొగ్గలో బరిలో నిలిచారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ భార్య గీతకు కాంగ్రెస్ టికెటివ్వడంతో రాజకీయం వేడెక్కింది. పైగా బీజేపీతో 50 ఏళ్లకు పైగా అనుబంధమున్న అగ్ర నేత కేఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యరి్థగా బరిలో నిలిచి రాఘవేంద్రకు పక్కలో బల్లెంలా మారారు. ఈ ముక్కోణపు పోటీ అందరినీ ఆకర్షిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న ఈశ్వరప్ప తన కుమారుడు కంతేశ్‌కు ఎంపీ టికెట్ కోసం విఫలయత్నం చేశారు. యడ్యూరప్పతో మొదట్నుంచీ ఉప్పు నిప్పుగా ఉన్న ఈశ్వరప్పకు ఈ పరిణామం తీవ్ర ఆగ్రహం కలిగించింది. రాష్ట్ర బీజేపీ చీఫ్, యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రపై తీవ్ర విమర్శలకు దిగి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాను మోదీకి వీర విధేయుడినంటూ ఆయన బొమ్మతోనే ఈశ్వరప్ప జోరుగా ప్రచారం చేస్తుండటంతో బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు!కొల్హాపూర్.. బరిలో ఛత్రపతి ఛత్రపతి శివాజీ వంశీయుడిని కాంగ్రెస్ బరిలోకి దించడంతో కొల్హాపూర్‌లో పోటీ కాక పుట్టిస్తోంది. శివసేన సిట్టింగ్ ఎంపీ సంజయ్ మాండ్లిక్ ఈసారి శివసేన (షిండే) నేతగా మహాయుతి కూటమి తరఫున మళ్లీ బరిలో ఉన్నారు. దాంతో కాంగ్రెస్, శివసేన (ఠాక్రే) ఎన్సీపీ (శరద్)లతో కూడిన మహా వికాస్ అగాడీ వ్యూహాత్మకంగా ఛత్రపతి రాజర్షి సాహు మహారాజ్‌కు టికెటిచ్చింది. ఆయన కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో ఉన్నారు. అయితే ఆయన శివాజీకి నిజమైన వారసుడు కాదన్న మాండ్లిక్ వ్యాఖ్యలతో అగ్గి రాజుకుంది. వీటిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికార కూటమి వెనక్కు తగ్గింది. ‘గాడీ (సింహాసనం)ని గౌరవించండి. కానీ ఓటు మాత్రం మోడీకే వేయండి’ అంటూ కొత్త తరహా ప్రచారం మొదలుపెట్టింది. రెండు కూటముల మధ్య ఇక్కడ టఫ్ ఫైట్ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి పట్టుండటం సాహు మహారాజ్‌కు కలిసొచ్చే అంశం.మెయిన్‌పురి.. భాభీ సవాల్ ఈ స్థానం ఎస్పీ దిగ్గజం దివంగత ములాయం సింగ్ యాదవ్ కంచుకోట. ములాయం మరణానంతరం 2022లో ఉప ఎన్నికలో ఆయన కోడలు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ సత్తా చాటారు. 2.88 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ శాక్యను ఓడించారు. ఈసారి మళ్లీ బీజేపీకి సవాలు విసురుతున్నారు. బీజేపీ నుంచి యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. ఫిరోజాబాద్‌కు చెందిన ఠాకూర్ బలమైన నాయకుడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. బీఎస్పీ కూడా శివ ప్రసాద్ యాదవ్ రూపంలో బలమైన అభ్యరి్థని రంగంలోకి దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. బీఎస్పీ నుంచి మధ్యలో బీజేపీలోకి వెళ్లిన శివప్రసాద్ అనంతరం సొంత పార్టీ కూడా పెట్టి చివరికి బీఎస్పీ గూటికే చేరారు. ఇక్కడ మోదీ–యోగి ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో సమాజ్‌వాదీకి ఎలాగైనా చెక్ పెట్టేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. కానీ డింపుల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోలింగ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ హీటెక్కుతున్న రాజకీయం
-
కన్నడ బరిలో వారసుల సందడి!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అగ్రనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 24 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్)లు టిక్కెట్ల పంపిణీపై కసరత్తును తీవ్రతరం చేశాయి. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు తమ పిల్లల రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేయడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. సిద్ధరామయ్య కొడుకు X యడ్యూరప్ప కొడుకు ? మైసూర్ జిల్లాలోని వరుణ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఇక్కడి నుంచే పోటీచేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తన కుమారుడికి మార్గం సుగమం చేయడానికే సిద్దరామయ్య ఈ సారి వరుణకు బదులుగా, పొరుగునే ఉన్న చాముండేశ్వరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ కూడా వరుణ నియోజకవర్గంలో యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను పోటీకి దింపాలని భావిస్తోంది. విజయేంద్ర అయితేనే యతీంద్రకు గట్టి పోటీ ఇవ్వగలడని భావిస్తోంది. పైగా ఆ నియోజకవర్గంలో లింగాయత్‌ల జనాభా ఎక్కువ. ఇప్పటికే విజయేంద్ర వరుణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయేంద్రకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వంశం పేరు చెప్పుకొని బీజేపీ నుంచి ఎవరూ టికెట్ ఆశించలేరంటూ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. టిక్కెట్లకు పోటాపోటీ.. మంత్రులు, సీనియర్ నేతలు ఎందరో తమ పిల్లలకు టిక్కెట్ ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. హోం మంత్రి ఆర్.రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం సౌమ్య బెంగుళూరు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. న్యాయశాఖమంత్రి టీబీ జయచంద్ర కుమారుడు సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెఎన్ రాజన్న కుమారుడు రాజేంద్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మార్గరెట్ ఆల్వా కుమారుడు నివేదిత్ ఆల్వాలు టిక్కెట్ల రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత పోటీ లేకపోయినా బీజేపీ నేతలు కూడా వారసుల్ని తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ నేత పరిమళ నాగప్ప తన కుమారుడు ప్రీతమ్‌కు హనూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జేడీ(ఎస్) నుంచి దేవెగౌడ కుటుంబమంతా! జేడీ (ఎస్)లో వారసులకు కొదవే లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డి దేవెగౌడ కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవలు ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దేవెగౌడ కొడుకు హెచ్డీ కుమారస్వామి, ఆయన సోదరుడు హెచ్డీ రేవణ్ణలు మాత్రమే కాదు వారి భార్యలు అనిత కుమారస్వామి, భవానీ కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. రేవణ్ణ తన కొడుకు ప్రజ్వల్‌ను ఈసారి ఎన్నికల బరిలో దించబోతుండడంతో, కుమారస్వామి తన కుమారుడు, నటుడైన నిఖిల్‌ను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఎక్కడ చూసినా వారసుల సందడే కనిపించబోతుంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎందుకీ సమావేషాలు..?
► నిస్సారంగా జెడ్పీ స్థాయి సమావేశాలు ► కోరం లేక నాలుగు సమావేశాలు వాయిదా ► మంత్రి పుట్టిన రోజే కారణమంటూ గుసగుసలు జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచించాల్సిన అపూర్వ వేదిక తన స్థాయి కోల్పోతోంది. సరికొత్త తీర్మానాలకు పురుడు పోయాల్సిన అపురూప ప్రాంగణం నేతల తీరుతో అధ్వానంగా మారుతోంది. అత్యంత కీలకమైన జెడ్పీ స్థాయి సమావేశాలకు నాయకులు కనీస సంఖ్యలోనూ హాజరు కాకపోవడంతో అవి వాయిదాకు దారి తీస్తున్నాయి. ఆదివారం నాటి జెడ్పీ స్థాయి సంఘ సమావేశం తీరు ఈ విషయాలను మరోసారి రుజువు చేసింది. అరసవల్లి: జిల్లా పరిషత్ స్థాయి సమావేశాలు నేతల నిర్లక్ష్య తీరుతో అభాసుపాలవుతున్నాయి. అత్యంత కీలకమైన ఈ సమావేశాలకు నాయకులు హాజరు కాకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఆదివారం కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పుట్టిన రోజు కావడంతో ఆయా ప్రాం తాల్లో టీడీపీ ప్రతినిధులు సంబరాలు చేసుకుని, జెడ్పీ సమావేశాలకు డుమ్మా కొట్టారనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆదివారం మొత్తం 7 జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించేందుకు జెడ్పీ సీఈఓ బి.నగేష్ అందరికీ ప్రత్యేక ఆహ్వానాలను పంపించారు. ఒక్కో కమిటీలో గరిష్టంగా ఉన్న 9 మంది జెడ్పీటీసీ సభ్యులందరికీ ఈ ఆహ్వానాలు అందాయి. అయితే వీటిని పెద్దగా పట్టించుకోని మన జెడ్పీటీసీలు సమావేశాలను లైట్ తీసుకున్నారు. దీంతో కోరం లేకపోవడంతో(కనీస సంఖ్యలో హాజరు లేకపోవడం) 2వ, 3వ, 5వ, 6వ స్థాయి సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇక మిగిలిన మూడు స్థాయి సమావేశాలకు కేవలం ‘కోరం’కు సరిపడే ముగ్గురు (వీరిలో జెడ్పీ చైర్పర్సన్ ఒకరు) మాత్రమే హాజరుకావడం విశేషం. అంటే గరిష్టంగా సభ్యుల హాజరు ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమే అని స్పష్టమవుతోంది. అలాగే హాజరైన ప్రతినిధులు కూడా ఏదో వచ్చామా వెళ్లామా అన్న ధోరణి ప్రదర్శించడంతో మిగిలిన సమావేశాలు కూడా నిస్సారంగా ముగిశాయి. నాయకుల నిర్లక్ష్య ధోరణిపై అధికారులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరి వల్ల విలువైన సమయం వృథా అంటూ ఓ కీలక శాఖ అధికారే వ్యాఖ్యానించారు. అగ్ర నేతల జాడ ఏదీ?: జిల్లా జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలకు జిల్లాకు చెందిన అగ్రనేతలైన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రావాల్సి ఉంటుంది. ఒక్కో కమిటీలో ఒక్కో అగ్రనేతకు చోటు ఉంటుంది. అయితే ఆదివారం నాటి సమావేశాలకు ఒక్క అగ్రనేత కూడా హాజరుకాకపోవడం గమనార్హం. కేవలం మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు కావడంతోనే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు లోకల్ కార్యక్రమాలు, పర్యటనల్లో మునిగితేలారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ ఒక్కరే జరిగిన మూడు స్థాయి సమావేశాలకు కోరంలో ఒక సభ్యురాలిగా ఉండటం విశేషం. అధికారులే విఫలమయ్యారు: రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, పలు కీలక పథకాలను ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్లడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఆదివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన 1వ, 4వ,7వ స్థాయి సంఘ సమావేశాల్లో మాట్లాడారు. జిల్లా స్థాయి అ ధికారులు ఎప్పటికప్పుడు మండలాల్లో, పంచాయతీల్లో పథకాల అమలును సమీక్షించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోం దని, అయితే వైద్యారోగ్య శాఖ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. అలాగే జెడ్పీ సమావేశాల్లో జెడ్పీటీసీ సభ్యుల తీర్మానాలను అధికారులు పట్టించుకోవడం లేదని, తీర్మానాల తదుపరి చర్యలను సభ్యులకు చెప్పడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఎం.పురంలో రూ.50 లక్షలతో పెద్ద చెరువు పనులకు టెండర్లు ఖరారైనా, నేటికీ పనులు ప్రారంభించకపోవడంపై ఆమె అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు మాత్రం అంతా చేసేస్తామంటూ పాత పాటే పాడారు. పలువురు జెడ్పీటిసీ సభ్యులు కూడా తమ పరి ధిలోని సమస్యలను సంబంధిత అ ధికారులకు విన్నవించుకున్నారు. సమావేశాలకు జెడ్పీ సీఈఓ బి.నగేష్, వయోజన విద్య డీడీ కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి తిరుపతిరావు, డీఈవో సుబ్బారావు, విద్యుత్ శాఖ డీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.