Toronto International Film Festival (TIFF)
-
రాజమౌళికి అరుదైన గౌరవం, హాలీవుడ్ దర్శకులతో కలిసి..
Toronto International Film Festival 2022: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. అంత్యంత ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-2022(టీఫ్)లో రాజమౌళి భాగం కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా టీఫ్ అధికారికంగా ప్రకటించింది. హాలీవుడ్ ప్రముఖలతో కలిసి ఈ ఏడాది టీప్ వేడుకలో ఆయన చర్చావేదికలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కాగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. చదవండి: చిక్కుల్లో స్టార్ హీరో దర్శన్, ఆడియో క్లిప్‌తో సహా పోలీసులను ఆశ్రయించిన నిర్మాత కెనడాలోని టొరంటోలో ఈ ఫిలిం ఫెస్టివల్‌ను ప్రతి ఏడాది అంత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ వేడుకులో పలువురు సినీ టెక్నిషియన్స్‌తో ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్స్ చర్చలు జరపనున్నారు. ఇక ఈసారి సెప్టెంబర్‌లో జరిగే ఈ సినీ ఫెస్టివల్‌కు రాజమౌళికి కూడా ఆహ్వానం అందడం విశేషం. హాలీవుడ్ అగ్ర దర్శకులతో కలిసి రాజమౌళి కూడా చర్చించనున్నాడు. టొరంటో ఫిలిం ఫెస్టివల్‌కు ఆహ్వానం అందిన తొలి భారతీయుడిగా జక్కన్న నిలిచారు. అయితే ఈ ఫెస్టివల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. Our Visionaries lineup will feature inspirational keynotes from distinguished guests, including @tylerperry and @ssrajamouli (director of RRR) who join previously announced speakers @cakarel (founder and CEO of @MUBI) and @HillaryClinton and @ChelseaClinton. #TIFF22 pic.twitter.com/YAtoeqLX5m — TIFF Press & Industry (@TIFF_Industry) August 10, 2022 -
ఇండియా నుంచి ఈ ఇద్దరూ..
ప్రియాంకా చోప్రా గత ఏడాది సందడి చేసిన వేడుకల్లో టొరొంటో చలన చిత్రోత్సవాలు ఒకటి. ఆమె నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. దాంతో ఈ వేడుకకు హాజరై, ఎర్ర తివాచీపై ‘క్యాట్ వాక్’ చేసి, కనువిందు చేశారు. ఈసారి ప్రియాంక ఈ చిత్రోత్సవాలకు ‘బ్రాండ్ అంబాసిడర్’. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలకు 50 మంది సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆహ్వానంగా అందుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి ప్రియాంకా చోప్రా, దర్శకుడు అనురాగ్ కశ్యప్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్ 10 నుంచి 19 వరకూ... కరోనా వల్ల ఆస్కార్ అవార్డు వేడుక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కి వాయిదా పడింది. మేలో ఫ్రాన్స్‌లో జరగాల్సిన కాన్స్ చలన చిత్రోత్సవాలు జరగలేదు. అయితే టొరొంటో చలన చిత్రోత్సవాలు మాత్రం ప్రతి ఏడాదిలానే సెప్టెంబర్‌లో 10 నుంచి 19 వరకూ జరగనున్నాయి. ఈ వేడుకలు డిజిటల్లో స్క్రీనింగ్ అవుతాయి. ‘‘ఇవి 45వ టొరొంటో చలన చిత్రోత్సవాలు. ఇన్నేళ్ల టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో డిజిటల్లో ప్రసారం కాబోతున్న తొలి వేడుక ఇదే’’ అని చిత్రోత్సవాల ప్రతినిధులు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా 50 చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించాలనుకుంటున్నామని, సామాజిక దూరాన్ని పాటించే దిశగా సీట్ల ఏర్పాటు ఉంటుందని, అయితే ప్రభుత్వం అనుమతిస్తేనే ఇది సాధ్యపడుతుందని కూడా తెలిపారు. -
నటి ప్రియాంక చోప్రా వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సిక్కిం రాష్ట్రం అల్లర్లకు నెలవుగా మారిందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక చోప్రా నిర్మాతగా మారి పహునా అనే చిత్రాన్ని నిర్మించారు. సిక్కిం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న క్రమంలో ఇద్దరు చిన్నారి శరణార్థుల మధ్య చోటు చేసుకునే పరిణామాలతో ఉద్వేగపూరితంగా తెరకెక్కించారు. పహునాను టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా.. ప్రశంసలు దక్కాయి. దీంతో మీడియా సమావేశంలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... ‘సిక్కం ఈశాన్య భారతంలో ఓ చిన్న రాష్ట్రం. అక్కడ ఫిల్మ్ఇండస్ట్రీ లేదు.. కనీసం సినిమాలు తీసేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. అందుకు కారణం నిత్యం అక్కడ తిరుగుబాటులు, అల్లర్లు చెలరేగి ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. అయినా అతి కష్టం మీద ఇబ్బందులను ఎదుర్కుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన తొలిచిత్రం పహునానే’ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లగక్కుతున్నారు. సిక్కిం చాలా ప్రశాంతతో కూడుకున్న రాష్ట్రమని కొందరు కామెంట్ చేస్తే.. అసలు సిక్కిం ఎక్కడ ఉంటుందో ప్రియాంకకు తెలుసా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు సిక్కిం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రియాంకకు సూచిస్తున్నారు. కాగా, సిక్కిం నుంచి ఈ మధ్య చాలా మంచి మంచి సినిమాలే వస్తున్నాయి. అందులో ప్రశాంత్ రసయిలి లాంటి టాలెంటెడ్ దర్శకుడు తీసిన కథ, ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ యేడాది సిక్కిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ధోక్బు కూడా పలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది.