Total Literacy
-
సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి
కలెక్టర్ రఘునందన్‌రావు బాకారంలో అక్షరరాస్యత కేంద్రాల పరిశీలన మొయినాబాద్ రూరల్: బాకారం గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలంటే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి మొయినాబాద్ మండలం బాకారంలో వంద రోజుల సంపూర్ణ అక్ష్యరాస్యత సాధన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. అక్షరాస్యత కేంద్రాలను పరిశీలించిన అనంతరం మహిళలతో మాట్లాడారు. చదువు చేర్చుకుంటున్న మహిళలతో అక్షరాలు రాయించారు. సంపూర్ణ అక్షరాస్యతలో భాగంగా మహిళలు తమ ఇళ్ల ముందు ముగ్గులకు బదులు అక్షరాలు రాస్తున్నట్టు చెప్పారు. సర్పంచ్ సుధాకర్‌యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదర్శ గ్రామం అంటే సీసీ రోడ్లు, మంచినీరు, బస్సు, పాఠశాల వంటివి మాత్రమే సరిపోవని, అందరూ చదువుకోవాలని సూచించారు. గ్రామంలో సాక్షరభారత్ ఆధ్వర్యంలో వంద రోజుల సంపూర్ణ అక్షరాస్యత కొనసాగించడంపై సర్పంచ్ సుధాకర్‌యాదవ్‌ను అభినందించారు. అందరూ చదువుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఽకార్యక్రమంలో సాక్షరభారత్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రాందాస్‌నాయక్, తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీఓ సుభాషిణి, రోటరీక్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, మండల వైస్ ఎంపీపీ పద్మ, సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ కిరణ్, సిబ్బంది శ్రీనివాస్, మీనాక్షి, జ్యోతి, వార్డు సభ్యులు తిరుపతిరెడ్డి, శాంతమ్మ, తదితరులు ఉన్నారు.a -
మాతృభాషపై ఆసక్తి పెంచుకోవాలి
నార్నూర్ : మాతృభాషపై ఆసక్తి పెంచుకున్నప్పుడే గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. నార్నూర్ మండలంలోని గుం జాల గ్రామంలో సోమవారం ‘గుంజాల గోండి లిపి-సంపూర్ణ అక్షరాస్యత గ్రామం గా గుంజాల’ అనే కార్యక్రమ ప్రారంభ సభను నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రశాంత్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు గ్రామంలోని కొమురం భీమ్ జెండా వద్ద నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, కొన్ని దశాబ్దాల పాటు కనుమరుగైన గుంజాల గోండి లిపి ప్రతులను వెలుగులోకి తీసుకువచ్చిన జంగు, లింగులను, గోండి లిపిని అధ్యయనం చేసి అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రొఫెసర్లను అభినందించారు. గుంజాలలో గోండి లిపి రీసర్చ్ సెంటర్ భవన నిర్మాణానికి వెంటనే రూ.20 లక్షల నిధులు విడుదల చేయాలని ఐటీడీఏ పీవో ప్రశాంత్పాటిల్ను ఆదేశించారు. గుంజాల గోండి లిపి అధ్యయన కేంద్రం అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు మాట్లాడుతూ, 5 సంవత్సరాల నుంచి 85 ఏళ్ల ముసలి వరకు గోండి లిపిలో అక్షరాస్యత సాధించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలోని 17 పాఠశాలల్లో గుంజాల గోండి లిపిలో బోధన కొనసాగుతోందని, లిపిలో మొదటి వాచకాన్ని సైతం రూపొందించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఆదివాసీలు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. దళిత, ఆదివాసీ అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ ఆర్.ఎస్.సర్రాజు, ఆర్డీవో ఐల్లయ్య, ఏజెన్సీ జిల్లా విద్యాధికారి సనత్‌కుమార్, గుంజాల గోండి లిపి అధ్యయన కేంద్రం ప్రొఫెసర్లు మనోజ, స్కాలర్లు, ఎంపీడీవో రాథోడ్ రవీందర్, తహశీల్దార్ మల్లయ్య, సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు. కృషితోనే ఇంతటి ప్రాధాన్యం ఉట్నూర్ రూరల్ : గోండి భాష పరిరక్షణ, అభివృద్ధి కృషితోనే ఆ భాషకు ఇంతటి ప్రాధాన్యం దక్కుతోందని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ‘4వ జాతీయ గోండి భాష ప్రామాణికం’ వర్క్‌షాప్ సోమవారం ముగిసిం ది. కలెక్టర్ హాజరయ్యారు. ఐటీడీఏ ద్వా రా భాష అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.