tour cancelled
-
వైఎస్ జగన్ పుంగునూర్ పర్యటన రద్దు
-
ప్రధాని విశాఖ పర్యటన రద్దు!
సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని వార్తలు వెలువడ్డాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభల్లో పాల్గొంటారని ఆ మూడు పారీ్టల నేతలు హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న విశాఖలో మోదీ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని స్థానిక బీజేపీ నేతలకు సమాచారం వచ్చింది. దీనిపై బీజేపీ నాయకులు సమాలోచనలు చేస్తుండగా మోదీ బహిరంగ సభ రద్దయిందని, ఒక రోజు ముందుగానే 15వ తేదీన విశాఖలో రోడ్డు షో నిర్వహిస్తారని సాయంత్రానికి కబురు అందింది. దీంతో రోడ్డు షో నిర్వహణపై వీరు సమావేశమై సమాలోచనలు చేశారు. ఎన్ఏడీ జంక్షన్–కంచరపాలెం వరకు గాని, బీచ్ రోడ్డులో కోస్టల్ బ్యాటరీ/నోవాటెల్ హోటల్ జంక్షన్ నుంచి పార్క్ హోటల్/వుడా పార్క్ వరకు గాని రోడ్డు షో నిర్వహించాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చిస్తుండగానే రోడ్డు షో కూడా రద్దయిందని రాత్రి 9 గంటలకు సమాచారం వచ్చింది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దయిందని సమాచారం అందిందని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర సోమవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. -
ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. రేపు(మంగళవారం) చేవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం రెండు స్కీంలను ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్‌లను ప్రియాంక గాంధీ చేతులమీదగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రియాంక గాంధీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే.. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయింది. -
కేసీఆర్ గైర్హాజరు.. శ్రేణుల్లో నిరుత్సాహం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ అధినేత కల్వకుంట చంద్రశేఖర్‌రావు ఇబ్రహీంపట్నం పర్యటన రద్దు కావడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న టీఆర్ఎస్కు కేసీఆర్ పర్యటన మరింత బలం చేకూర్చుతుందని భావించిన పార్టీ నాయకులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఎన్నికల ప్రచార పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సభ ప్రారంభం కానుండడంతో ఆ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు, స్థానిక నాయకులు పెద్దఎత్తున జనసమీకరణ చేపట్టాలని అనుకున్నా ఆశించిన మేర జనంరాలేదు. అఅభిమానుల్లో అసంతృప్తి చాలా కాలం తర్వాత కేసీఆర్ ఇబ్రహీంపట్నం వస్తుండన్న ప్రచారంతో అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. శుక్రవారం భానుడి ప్రతాపం తగ్గడంతో సభకు వచ్చిన వారంతా ఉత్సాహంగా కేసీఆర్ కోసం వేచి చూశారు. అయితే సాయంత్రం ఆరుగంటలు దాటుతున్నప్పటికీ కేసీఆర్ రాకపోవడంతో సభకు హాజరైన అగ్రనేతలు కే.కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి తదితరులు ప్రసంగాలు ప్రారంభించారు. వారి ప్రసంగాలు ముగిసినా కేసీఆర్ రాకపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఊసురు మంటూ వెనుదిరిగారు.