Tourism Board
-
మధ్యప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు అనుమతి
భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన నిబంధనలకు అనుగుణంగా మధ్యప్రదేశ్‌లో పలు బాలీవుడ్ సినిమా, టీవీ, వెబ్‌సిరీస్‌ల షూటింగ్‌లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించినట్లు రాష్ట్ర పర్యాటక బోర్డు సలహాదారుడు ఆదివారం తెలిపారు. బోర్డు అదనపు మేనేజింగ్ డైరెక్టర్ సోనియా మీనా మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం షూటింగ్‌లను తిరిగి ప్రారంభించడానికి బోర్డు కొన్ని నియమాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. రాష్ట్ర టూరిజం బోర్డు ఫిల్మ్ ఫసిలిటేషన్ సెల్ కొన్ని నిబంధనలను జారీ చేసిన అనంతరం కొంతమంది చిత్ర నిర్మాతలు తిరిగి షూటింగ్‌లను పారంభించడానికి అనుమతి కోరుతూ బోర్డును సంప్రదించినట్లు పేర్కొన్నారు. దీంతో బోర్డు కొన్ని మార్గదర్శకాలను విధిస్తూ షూటింగ్‌లకు అనమతించినట్లు తెలిపారు. (ఆ సినిమాలను బాయ్‌కాట్ చేయండి) అవి.. ఇండోర్ షూటింగ్‌కు 15 మంది సిబ్బంది మాత్రమే పాల్గొనాలని, అవుట్ డోర్ షూటింగ్‌లకు 30 మంది పాల్గొనవచ్చని బోర్డు నిబంధనలు విధించిందని చెప్పారు. అంతేగాక షూటింగ్ సిబ్బంది తమ ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని, షూటింగ్లో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించడం, తరచూ శానిటైజర్ వాడటం, చేతులు కడుక్కుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపింది. ఇక సిబ్బందిలో ఎవరైనా కరోనా లక్షణాలతో కనిపిస్తే వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని, షూటింగ్ సమయంలో రద్దీకి అనుమతి లేదని బోర్డు స్పష్టం చేసినట్లు మీనా వెల్లడించారు. అంతేగాక భోపాల్, గ్వాలియర్, మహేశ్వర్, ఓర్చా, ఉజ్జయిని, మధాయ్ (హోషంగాబాద్), ఖజురహో, పన్నా, జబల్పూర్లతో పాటు ఇండోర్‌లోని వివిధ ప్రదేశాలలో సుమారు 25 వెబ్ సిరీస్‌లు, సినిమాలు, సీరియల్స్, మ్యూజిక్ వీడియోల షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని బోర్డు ఆమె తెలిపారు. వాటిలో తమిళం, తెలుగు, బెంగాలీ చిత్రాలు, కనీసం ఐదు వెబ్ సిరీస్‌లు ఉన్నాయని మీనా తెలిపారు. (పాట్నాలో సుశాంత్ మెమోరియల్) -
ఏపీ టూరిజం ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం
సాక్షి, విజయవాడ: తమది అవినీతి రహితంగా పనిచేసే ప్రభుత్వమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేసే వ్యక్తి అని.. ప్రచారం చేసే వ్యక్తి కాదని అన్నారు. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 3 నెలలుగా ఎలాంటి మరక లేకుండా పనిచేస్తున్నామన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఉద్దేశం మాకు లేదన్నారు. ప్రజలు నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. ‘ఆదాయం ఎంత ముఖ్యమో పర్యాటకుల భద్రత కూడా అంతే ముఖ్యం. కేరళ జీడీపీలో 11 శాతం పర్యటకానిదే. పర్యాటకుల కోసం అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు తీసుకోస్తాం’ అని అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పర్యాటక శాఖ సీఈవో ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం ఎక్సలెన్ సీ అవార్డ్స్ -2019ను మంత్రులు అందించారు. ఉత్తమ 5 స్టార్ హోటల్ గా విశాఖ నోవోటెల్ కు పురస్కారం ఉత్తమ 5స్టార్ హోటల్ ( క్లాసిఫైడ్) గా విజయవాడ గేట్ వే ఉత్తమ 4 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)గా విశాఖ పామ్ బీచ్ హోటల్ ఉత్తమ 3 స్టార్ హోటల్ (క్లాసిఫైడ్)గా హోటల్ బ్లీస్ ఉత్తమ పర్యావరణ హిత హోటల్ గా పల్లవి రిసార్ట్స్, పాలకొల్లు మోస్ట్ ఇన్నోవేటీవ్ ఇన్ బౌండ్ టూర్ ఆపరేటర్ అవార్డు సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ -
ఏసీబీ దాడులు.. కేజీ బంగారం సీజ్!
-
గోదావరి విహారం..అధికారుల పరిహాసం
పశ్చిమగోదావరి, పోలవరం : గోదావరి విహారం గాడి తప్పుతోంది. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లో, సమాచార లోపంతోనో ఈ పరిస్థితి ఏర్పడింది. అధికారులు, టూరిజం బోట్ల నిర్వాహకుల మధ్య సమావేశం జరిగే వరకు బోట్లను నిలిపివేయాలని ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తే, మరో ఉన్నతాధికారి నిరభ్యంతరంగా నడుపుకోవచ్చని అనుమతిచ్చారు. దీంతో ఆదివారం ఎనిమిది టూరిజం బోట్లు పర్యాటకులను గోదావరి విహారానికి తీసుకుని వెళ్లాయి. ఇటీవల రాయల గోదావరి టూరిజం బోటులో అగ్ని ప్రమాదం జరిగి బోటు పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. బోటు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించటంతో వందమందికి పైగా ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదం నేపధ్యంలో పోలీస్, రెవెన్యూ, నీటి పారుదల, అగ్నిమాపక, మత్స్య శాఖల అధికారులతోను, టూరిజం బోట్ల నిర్వాహకులతోనూ సమావేశం నిర్వహించి, అనుమతులపైనా, జాగ్రత్తలపైనా చర్చించాక అనుమతి ఇవ్వాలని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ నిర్ణయించినట్టు సమాచారం. అయితే టూరిజం బోట్ల యజమానులు శనివారం రంపచోడవరం సబ్–కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా, ఆయన బోట్లను నడుపుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. అనుమతితో పాటు సోమవారం నుంచి సంబంధిత శాఖల అధికారులు టూరిజం బోట్లను తనిఖీ చేయాలని కూడా ఆయన ఆదేశించారు. అయితే అగ్ని ప్రమాదం జరిగి బోటు కాలిపోయినా బోట్ల అనుమతులపైనా, పర్యాటకుల రక్షణ చర్యలపైనా ఏవిధమైన చర్యలు చేపట్టకుండా టూరిజం బోట్లకు అనుమతి ఇవ్వటం చర్చనీయంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు మాత్రమే టూరిజం బోట్లకు అనుమతి ఉంది. అనుమతులను ఇరిగేషన్ శాఖ బోట్ సూపరింటెండెంట్ ఇచ్చేవారు. ఇటీవల కొత్త నిబంధనల ప్రకారం కాకినాడ పోర్టు అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. బోట్ల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా మే నెలాఖరు వరకు బోట్లను తిప్పుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై ఇరిగేషన్ శాఖకు చెందిన బోట్ సూపరింటెండెంట్ జి.ప్రసన్నకుమార్‌ను ప్రశ్నించగా సోమవారం సమావేశం నిర్వహిస్తామని, రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భారత టూరిస్టులపై విదేశాల కన్ను!
♦ గతేడాది శ్రీలంకకు 3.5 లక్షల మంది ♦ ఈ ఏడాది రెండంకెల వృద్ధి అంచనా ♦ సింగపూర్‌కు వెళ్లింది 11 లక్షల మంది ♦ దక్షిణాఫ్రికాలోనూ లక్ష మంది షికారు ♦ మరింత వృద్ధిపై టూరిజం బోర్డుల అంచనాలు పర్యటన కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. గతేడాది పొరుగునున్న శ్రీలంకకు 20 లక్షల మంది, సింగపూర్‌కు 10 లక్షల మంది వెళ్లగా... సుదూరాన ఉన్న దక్షిణాఫ్రికాకు సైతం లక్ష మంది వరకూ వెళ్లారు. ఈ ఏడాది వీరి సంఖ్య మరింత వృద్ధి చెందవచ్చని ఆయా దేశాల టూరిజం బోర్డులు అభిప్రాయపడ్డాయి. బుధవారమిక్కడ ఆయా దేశాల టూరిజం బోర్డుల ప్రతినిధులు విలేకరులతో ఏం చెప్పారంటే...– హైదరాబాద్, బిజినెస్ బ్యూరో 20% వృద్ధిపై శ్రీలంక టూరిజం బ్యూరో అంచనా ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యలో రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నట్లు శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో డైరెక్టర్ ఇంద్రజిత్ డిసిల్వా చెప్పారు. గతేడాది మొత్తం 20 లక్షల మంది పర్యాటకులు రాగా, వారిలో 3.56 లక్షల మంది భారత్ నుంచి వచ్చారని చెప్పారు. ఈసారి టూరిస్టుల సంఖ్యలో 20% పైగా వృద్ధి ఉండొచ్చని.. ఇం డియా నుంచి 4.5 లక్షల మంది వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. బుధవారమిక్కడ జరిగిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. భారత్‌లో ఐదు రోడ్‌షోలు తలపెట్టామని, హైదరాబాద్‌తో కలిపి నాలుగు పూర్తయ్యాయని చెప్పారు. పుణేలో మరో రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశాలు, ఎగ్జిబిషన్స్ మొదలైన ఈవెంట్స్ నిర్వహణకు, వివాహ వేడుకలకు, సినిమా షూటింగ్‌లకు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. భారత్ నుంచి శ్రీలంకకు విమాన సర్వీసులు కూడా వారానికి 150కి పెరిగాయని, ఇటీవలే హైదరాబాద్ నుంచీ విమాన సేవలు మొదలయ్యాయని డిసిల్వా తెలియజేశారు. లక్ష మంది దాటొచ్చు: దక్షిణాఫ్రికా భారత్ నుంచి ఈ ఏడాది వచ్చే పర్యాటకుల సంఖ్య లక్ష దాటుతుందని దక్షిణాఫ్రికా పర్యాటక శాఖ అంచనా వేసింది. 2016లో తమ దేశాన్ని 95,377 మంది సందర్శించారని దక్షిణాఫ్రికా టూరిజం ఇండియా మేనేజర్ హన్నెలి స్లాబర్ తెలిపారు. 2015 కన్నా ఇది 21.7 శాతం అధికమని చెప్పారు. సందర్శకుల సంఖ్య పరంగా భారత్ 8వ స్థానంలో ఉందన్నారు. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ, తెలంగాణ శాఖ చైర్మన్ రామిడి అజయ్ కుమార్‌తో కలిసి బుధవారమిక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. భారత పర్యాటకుల్లో హైదరాబాద్ వాటా ప్రస్తుతం 5 శాతముందని, ఏడేళ్ల క్రితం ఇది 2 శాతమేనని వివరించారు. అడ్వెంచర్ టూర్లకు హైదరాబాదీలు అధికంగా వెచ్చిస్తారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఖర్చులో భారతీయులది 3వ స్థానం: సింగపూర్ పర్యాటకానికి ఖర్చు చేయటంలో చైనా, ఇండోనేసియా తర్వాతి స్థానం భారతీయులదేనని సింగపూర్ టూరిజం బోర్డు తెలిపింది. 2016 జనవరి–సెప్టెంబర్ మధ్య భారతీయులు సింగపూర్ సందర్శనకు రూ.5,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది అంతకు ముందటి సంవత్సరంతో పోలిస్తే సగటున 26 శాతం పెరిగినట్లు లెక్క. 2016లో విదేశాల నుంచి 1.64 కోట్ల మంది సింగపూర్‌లో అడుగుపెట్టగా వీరిలో భారత్ నుంచి వెళ్లిన వారు 11 లక్షల మంది. ఈ ఏడాది ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు బోర్డు ప్రాంతీయ డైరెక్టర్ జి.బి.శ్రీధర్ తెలిపారు. 2017 జనవరి–ఏప్రిల్‌లో 3.5 లక్షల మంది సింగపూర్‌ను సందర్శించారన్నారు. సింగపూర్ నుంచి క్రూయిజ్‌లో లక్ష మందికిపైగా భారతీయులు పలు సందర్శనీయ స్థలాలను చుట్టివస్తున్నట్టు తెలియజేశారు. సందర్శకులను ఆకట్టుకోవడానికి తమ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందన్నారు. -
సీఎం చైర్మన్‌గా టూరిజం బోర్డు
సాక్షి, అమరావతి : పర్యాటక, సంస్కృతి, వారసత్వ బోర్డును ఏర్పాటు చేస్తూ పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు చైర్మన్‌గా ఉండే ఈ బోర్డుకు పర్యాటక, సంస్కృతి, వారసత్వ శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టూరిజం, కల్చర్ ఇన్చార్జి కార్యదర్శి, డైరెక్టర్ జనరల్, ఆర్థిక శాఖ, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్రే్టషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లకు చెందిన శాఖ కార్యదర్శులు, టూరిజం అథారిటీ సీఈఓ, కేంద్ర ప్రభుత్వ టూరిజం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, టూర్ ఆపరేటర్స్ ఇండియన్ అసోసియేషన్ చైర్మన్, ఏపీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సూచించిన ఒక వ్యక్తి, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అధ్యక్షుడు బోర్డులో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు సాహసం క్రీడల అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, భారతీయ పరిశ్రమల సమ్మేళనం సూచించిన వ్యక్తి ఒకరు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.