Tourist sector
-
ఆతిథ్య రంగం జోరు..
ముంబై: ఆతిథ్య రంగం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–13 శాతం మేర వృద్ధి చెందనుంది. దేశీయంగా పర్యాటకానికి డిమాండ్ స్థిరంగా కొనసాగనుండటంతో పాటు విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరగనుండటం ఇందుకు తోడ్పడనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 15–17 శాతం స్థాయిలో ఉండగలదని పేర్కొంది. డిమాండ్ పటిష్టంగా ఉండటం, కొత్తగా హోటల్స్ లభ్యత ఒక మోస్తరుగానే పెరుగుతుండటంతో సమీపకాలంలో పరిశ్రమ లాభదాయకత ప్రస్తుత, వచ్చే ఆరి్థక సంవత్సరాల్లో మెరుగ్గా ఉండనుందని నివేదిక వివరించింది. గదుల అద్దె రేట్లు (ఏఆర్ఆర్) సగటున ఈ ఆరి్థక సంవత్సరం 10–12 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరం 5–7 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఆక్యుపెన్సీ ఆరోగ్యకరంగా 73–74 శాతం స్థాయిలో కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విదేశీ టూరిస్టుల రాక ఈ ఆరి్థక సంవత్సరమూ పెరగనున్నప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 10 శాతం తక్కువగానే నమోదు కావచ్చని చెప్పారు. అయితే, వచ్చే ఏడాది ఇది పుంజుకోగలదన్నారు. ఆచితూచి పెట్టుబడులు.. డిమాండ్ పుంజుకోవడం పరిశ్రమ సెంటిమెంటు మెరుగుపడేందుకు ఊతమిస్తున్నప్పటికీ కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పరిశ్రమ ఆచితూచి వ్యవహరిస్తోందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలిపారు. ‘స్థల సేకరణ వ్యయాలు అధికంగా ఉండటం, నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం, పరిశ్రమ సైక్లికల్ స్వభావం కారణంగా లాభాలకు మళ్లాలంటే సుదీర్ఘ సమయం పట్టనుండటం వంటి అంశాల వల్ల కొత్తగా పెట్టుబడి వ్యయాలు చేయాలంటే ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కాబట్టి బ్రాండ్లు తమ ముందస్తు పెట్టుబడి వ్యయాలను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ కాంట్రాక్టుల ద్వారా గదులను పెంచుకోవడాన్ని కొనసాగించే అవకాశం ఉంది‘ అని కన్సల్ పేర్కొన్నారు. ఏఆర్ఆర్పరమైన ఆదాయ వృద్ధితో సమానంగా నిర్వహణ వ్యయాలు పెరగకపోవడం వల్ల లాభదాయకత మెరుగుపడగలదని ఆయన చెప్పారు. హోటళ్లు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గత రెండేళ్లుగా సిబ్బందిని, ఫుడ్.. బెవరేజ్‌ల వ్యయాలను క్రమబదీ్ధకరించుకుంటూ పలు చర్యలు తీసుకోవడం కూడా పరిశ్రమకు సానుకూలాంశమని కన్సల్ వివరించారు. -
టూరిజం కుదేలు...
కోల్‌కతా: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి దేశీ పర్యాటక, ఆతిథ్య రంగాలు ఊహించనంత వేగంగా కుదేలవుతున్నాయని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. టూరిజం శాఖ గణాంకాల ప్రకారం జనవరి–మార్చి త్రైమాసికంలో విదేశీ టూరిస్టుల రాక (ఎఫ్‌టీఏ) 67 శాతం, దేశీయంగా టూరిస్టుల ప్రయాణాలు 40 శాతం పడిపోయాయని వెల్లడించింది. ‘కరోనా వైరస్ ప్రతికూల ప్రభావంతో దేశవ్యాప్తంగా హాస్పిటాలిటీ రంగంలో ఆక్యుపెన్సీ 18–20 శాతం పడిపోయే అవకాశం ఉంది. మొత్తం 2020లో సగటు రోజువారీ రేట్లు 12–14 శాతం తగ్గిపోవచ్చు‘ అని ఐసీసీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ సింగ్ చెప్పారు. సుమారు 2.67 కోట్ల ఉద్యోగాల కల్పనతో ట్రావెల్, టూరిజం రంగం 2018లో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 9.2 శాతం వాటా దక్కించుకుందని ఆయన తెలిపారు. కరోనా సంక్షోభంలో చిక్కుకున్న చాలా మటుకు టూరిజం సంస్థలు కనీసం ఆరు నెలల పాటైనా ఈఎంఐలు, పన్నులు, ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల నుంచి తాత్కాలిక ఊరట కోసం ఎదురుచూస్తున్నాయని సింగ్ వివరించారు. ఈ నేపథ్యంలో టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటీ సంస్థలకు టర్మ్ రుణాల రీపేమెంట్‌పై మారటోరియం వ్యవధిని ఆరు నెలలకు వర్తింపచేయాలని, తదుపరి 12 నెలలకు జీఎస్టీ హాలిడే ప్రకటించి తోడ్పాటునివ్వాలని కేంద్రాన్ని ఐసీసీ కోరింది. ఆయా సంస్థలు ఆర్థికంగా నష్టపోకుండా, ఉద్యోగాల్లో కోత పడకుండా తోడ్పాటు కోసం ట్రావెల్ అండ్ టూరిజం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆ నిబంధనతో టూరిజం రంగానికి కష్టమే.. కరోనా కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకున్న కస్టమర్లకు రీఫండ్ చేయకుండా ఫోర్స్ మెజూర్ నిబంధన వాడుకునేలా విమానయాన సంస్థలకు అనుమతినిచ్చిన పక్షంలో టూరిజం, ట్రావెల్ రంగ సంస్థలపై భారీ ప్రతికూల ప్రభావం పడుతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షోభం నుంచి ఎయిర్‌లైన్స్ బైటపడేందుకు ఇది ఉపయోగపడవచ్చు గానీ వ్యవస్థలోని మిగతా రంగాలను దెబ్బతీస్తుందని, లక్షల మంది ఉపాధికి గండి కొడుతుందని పేర్కొంది -
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి: చంద్రబాబు
విజయవాడ: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. క్రూయీజ్, వాటర్ స్కూటర్స్ సౌకర్యాలను నేవీ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. మంగళవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఎమ్ఎస్ఎమ్ఈల ఏర్పాటుతో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు వస్తాయని చంద్రబాబు చెప్పారు. -
రాచకొండలో డిస్నీ వరల్డ్
* ‘సాక్షి’తో పేర్వారం రాములు * తెలంగాణ పర్యాటకాభివృద్ధి * సంస్థ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ * రాష్ట్ర పర్యాటకానికి కొత్త రూపు, ఊపు తెస్తా * కేబీఆర్ పార్కులో‘లండన్ ఐ’ నిర్మిస్తాం * హుస్సేన్‌సాగర్, నాగార్జునసాగర్‌లలో వాటర్‌వరల్డ్ సాక్షి, హైదరాబాద్: ‘రాత్రి వేళ ఆకాశంలోకి చూస్తే నక్షత్రాల చిత్రవిచిత్ర ఆకృతులు అలరిస్తాయి. గోరుకొయ్యలు, సప్తరుషి మండలం, ధ్రువతార... ఇలా వాటికి పేర్లెన్నో. రాత్రివేళ కొన్ని పక్షులు కిలకిలారావాలతో పలకరిస్తాయి. వాటితోపాటు ఇతర జంతుజాలం చేసే శబ్దవిన్యాసాలు ఆస్వాదిస్తూ నక్షత్ర భ్రమణాన్ని పరికిస్తుంటే ఆ అనుభూతే వేరు. కానీ నేటితరానికి వాటి మజానే తెలీదు. వీలు చిక్కితే సెల్ఫోన్లతో గడిపే యువత కు ఆ అనుభూతిని కలిగించాలనేది నా ఆకాంక్ష. దాన్ని పర్యాటక రంగ పురోగతితో ముడిపెట్టి ముందుకు తీసుకెళ్తా’ అని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్, విశ్రాంత ఐపీఎస్ అధికారి పేర్వారం రాములు పేర్కొన్నారు. ఆదివారం కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పేర్వారం తన ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డిస్నీవరల్డ్‌ను తెలంగాణకు తెప్పించటం, అద్భుతాల్లో అద్భుతంగా భావించే లండన్ ఐ తరహా జెయింట్ ఫెర్రీస్ వీల్‌ను ఆవిష్కరించటం ఆయన ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. కేంద్రం అందించే పర్యాటక నిధులను గరిష్ట స్థాయిలో పొంది, రాష్ట్రప్రభుత్వ నిధుల వాటాను పెంచి రాష్ట్ర పర్యాటకానికి కొత్త రూపు, ఊపు తేవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... * రాచకొండను ఫిల్మ్ స్టూడియోగా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్న నేపథ్యంలో అక్కడ దాదాపు 2 వేల ఎకరాల్లో డిస్నీ వరల్డ్ ఏర్పా టు చేయాలనే ఆలోచన ఉంది. దాన్ని ఇక్క డ సాకారం చేసే ప్రతిపాదన చేస్తున్నాం. * దాదాపు 565 అడుగుల ఎత్తుతో ఉండే లండన్ ఐ తరహా జెయింట్ ఫెర్రీస్ వీల్‌ను కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేయాలని ఉం ది. ఆరు ఎకరాల స్థలం దీనికి అవసరం. ఇందుకు 40 కోట్ల వరకు ఖర్చవుతుంది. * భువనగిరి, రామగిరి ఖిల్లా, వికారాబాద్ అనంతగిరుల్లో పారాగ్లైడింగ్ ఏర్పాటు చేస్తాం. * ఆదిలాబాద్-ఖమ్మం మధ్య గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న గుట్టల్లో ట్రెక్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. * మెదక్ జిల్లాలోని ఝరాసంగం, ఏడుపాయల గుడులను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. * హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన తర్వాత అందులో, నాగార్జునసాగర్‌లో నీటి అంతర్భాగంలో వాటర్ వరల్డ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. * వరంగల్ జిల్లాలోని రామప్ప, పాకాల, లక్నవరం చెరువుల్లో వాటర్ స్కీయింగ్ ఏర్పాటు చేస్తాం. * రాణీ రుద్రమదేవి కన్నుమూసిన నల్లగొండ జిల్లా చెందుపట్లను, కంచర్ల గోపన్న జన్మస్థలం నేలకొండపల్లిని పర్యాటక కేంద్రాలుగా మారుస్తాం.