షమీకి పితృవియోగం
కాన్పుర్: టీమిండియా పేస్‌బౌలర్ మహమ్మద్ షమీకి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి తౌసిఫ్ అలీ గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న షమీ హుటాహుటిన అమ్రోహాకు బయలుదేరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీమిండియా టీ 20 జట్టులో షమీ ఉన్న విషయం తెలిసిందే.
అయితే, మోకాలికి చిన్నగాయం కారణంగా జట్టుతోపాటే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నెల(జనవరి) 5న గుండెపోటు కారణంగానే ఆస్పత్రిలో చేరిన షమీ తండ్రి గురువారం మరోసారి గుండెపోటు రావడంతో చనిపోయారు. ఇదిలా ఉండగా, రెండో టీ20కి వేదికైన లక్నోకు భారత జట్టు యధావిదిగా వెళుతుందని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ యధువీర్ సింగ్ తెలిపారు.