tpda
-
ఘనంగా ముగిసిన బతుకమ్మ ఉత్సవాలు
డల్లాస్: మునుపెన్నడూ లేనంత ఘనంగా ఈసారి అమెరికాలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా తెలుగు సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన ఈ సంబురాల్లోని చివరి రోజు వేడుకను డా.పెప్పర్ ఆరియన్ లో నిర్వహించారు. దాదాపు పది వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. వీరిలో దాదాపు 1500 మంది మహిళలు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. అమెరికా మొత్తంలో ఇక్కడే అతిపెద్ద బతుకమ్మ ఉత్సవం జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సినీనటులు, రాజకీయ ప్రముఖులు పలువురు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుల్లితెర యాంకర్, నటీ శ్రీముఖి, అందాల తార రాశి కన్నన్, రెజీనా, ఈషా రెబ్బా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, సినీనటి ఆర్కే రోజా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, గాయనీగాయకులు గీతా మాధురీ, సతీష్, నరేంద్ర తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్లు టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు తదితరులు చేపట్టారు. -
అట్టహాసంగా ప్రారంభమైన దసరా-బతుకమ్మ సంబరాలు
డల్లాస్: అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలుగు సంప్రదాయం ప్రకారం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా చివరి రోజైన అక్టోబర్ 8న డా.పెప్పర్ ఆరియన్ లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. చివరిరోజు వేడుకలకు దాదాపు 10వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు కార్యక్రమ నిర్వహకులు వెల్లడించారు. అదే సమయంలో 1500 మంది మహిళలు బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆటలు ఆడుతారు. అమెరికాలో ఇదే అతిపెద్ద బతుకమ్మ ఉత్సవం కావడంతో ఉత్సవాలకు సినీనటులు, రాజకీయ ప్రముఖులు పలువురు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. బుల్లితెర యాంకర్, నటీ శ్రీముఖి, అందాల తార రాశి కన్నన్, రెజీనా, ఈషా రెబ్బా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, సినీనటి ఆర్కే రోజా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, గాయనీగాయకులు గీతా మాధురీ, సతీష్, నరేంద్ర తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్లు టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు తదితరులు చేపట్టారు. -
డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) దసరా-బతుకమ్మ సంబరాల్లో తొలిరోజును ఘనంగా నిర్వహించింది. ఈ మేరకు టీపీఏడీ ఓ ప్రకటన విడుదల చేసింది. సంప్రదాయం ప్రకారం తొమ్మిది రోజుల పాటు సంబరాలు నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు. ఫ్రిస్కోలోని రిడ్జ్ పార్కులో తొలిరోజు వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. చివరి రోజైన అక్టోబర్ 8న డా.పెప్పర్ ఆరియన్ లో వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తొలిరోజు వేడుకలకు 200 మంది మహిళలు హాజరైనట్లు తెలిపారు. ఉభయ తెలుగురాష్ట్రాల మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడినట్లు చెప్పారు. చివరిరోజు వేడుకలకు దాదాపు 10వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 60 మంది టీపీఏడీ కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేస్తూ స్టేడియంను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు విరాళాలు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.tpadus.orgని చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్ లు భుజాలకెత్తున్నట్లు తెలిపారు. టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు, ఫౌండేషన్ కమిటీ మెంబర్లు రావ్ కల్వల, జానకి మండాది, ఉపేందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, రాజ్ గొంధీ, ట్రస్టీలు రామ్ అన్నాది, పవన్ గంగాధర, గంగా దేవర, అశోక్ కొండాల, ప్రవీన్ బిల్లా, మనోహర్ కసగాని, మాధవి సుంకిరెడ్డి, రాజేందర్ తొడిగాల, కార్యనిర్వహణ కమిటీ చంద్రా పోలీస్, లింగా రెడ్డి అల్వా, రూప కన్నయ్యగారి, సురేందర్ చింతల, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పెర్కారీ, రవికాంత్ మామిడి, శరత్ యర్రం, సతీశ్ జానుపల్లి, టీపీఏడీ అడ్వైజర్లు వేణు భాగ్యనగర్, సంతోష్ కోర్, విక్రమ్ జనగాం, నరేశ్ సుంకిరెడ్డి, జయ తెలకపల్లి, రవిశంకర్ పటేల్, సహకార కమిటీ అఖిల్ చండీరాల, సునీల్ కుమార్ ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కళ్యాణి తాడిమేటి, మధుమతి వ్యాసరాజు, కారుణ్య దామర్ల, క్రాంతి తేజ పండా, పల్లవి తోటకూర, రత్న ఉప్పల, రోహిత్ నారిమేటి, శంకర్ పరిమళ్, వసుధా రెడ్డి, అనూష వనం, కవిత ఆరుట్ల, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగెళ్లలు కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడినట్లు పేర్కొన్నారు. -
రేపు అర్ధరాత్రి నుంచి.. పెట్రో ట్యాంకర్ల సమ్మె
పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్ విధించినందుకే.. వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ మద్దతు ప్రకటించిన డీలర్స్ అసోసియేషన్ జూన్ 5 నుంచి సొంత ట్యాంకర్లనూ నిలిపేస్తాం: టీపీడీఏ హైదరాబాద్: పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్ విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ అసోసియేషన్ ఈ నెల 29 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (టీపీడీఏ) మద్దతు పలికింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ (హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీడీఏ అధ్యక్షుడు ఎన్. దినేశ్‌రెడ్డి, ఆల్ ఇండియా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి రాజీవ్ అమరం, తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు కె. రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆరీఫ్- ఉల్-హుస్సేన్‌లు మాట్లాడారు. సమాజాభివృద్ధికి ఇంధనం ఎంతో కీలకమని... పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై ప్రభుత్వం 14.5 వ్యాట్ విధించడం సరికాదని...వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రవాణా బంద్ వల్ల జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన, విధించబోయే పన్నులను చమురు కంపెనీలే భరించాలని, రవాణా, కాంట్రాక్ట్‌దారులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాము ఇప్పటికే తక్కువ ధరకు పెట్రోలియం రవాణా టెండర్లను దక్కించుకున్నామని...అటువంటి తమపై వ్యాట్ విధింపు సరికాదన్నారు. రాష్ట్ర సమస్యలపై మానవత్వంతో స్పందించే సీఎం కేసీఆర్ పెట్రోలియం రవాణాపై విధించిన వ్యాట్‌ను తగ్గించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ పెట్రోలియం రవాణా చార్జీలపై వ్యాట్ లేదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతినిధులు ఆరోపించారు. జూన్ 5 నుంచి తమ సొంత ట్యాంకర్ల రవాణానూ నిలిపేసి పెట్రోలియం రవాణాను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. వ్యాట్‌పై ఆర్థిక మంత్రి, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్, ఆయిల్ కంపెనీ అధికారులను కలసి వినతిపత్రాలను సమర్పించామని... అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఉధృతంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ట్యాంకర్స్ ఓనర్స్, డీలర్స్ కూడా పాల్గొన్నారు.