డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు | TPDA celebrates first day of bathukamma in dallas in grand style | Sakshi
Sakshi News home page

డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Published Sat, Oct 1 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

డల్లాస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) దసరా-బతుకమ్మ సంబరాల్లో తొలిరోజును ఘనంగా నిర్వహించింది. ఈ మేరకు టీపీఏడీ ఓ ప్రకటన విడుదల చేసింది. సంప్రదాయం ప్రకారం తొమ్మిది రోజుల పాటు సంబరాలు నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు.

ఫ్రిస్కోలోని రిడ్జ్ పార్కులో తొలిరోజు వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. చివరి రోజైన అక్టోబర్ 8న డా.పెప్పర్ ఆరియన్ లో వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తొలిరోజు వేడుకలకు 200 మంది మహిళలు హాజరైనట్లు తెలిపారు. ఉభయ తెలుగురాష్ట్రాల మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడినట్లు చెప్పారు.


చివరిరోజు వేడుకలకు దాదాపు 10వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 60 మంది టీపీఏడీ కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేస్తూ స్టేడియంను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు విరాళాలు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.tpadus.orgని చూడాలని చెప్పారు.

ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్ లు భుజాలకెత్తున్నట్లు తెలిపారు. టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు, ఫౌండేషన్ కమిటీ మెంబర్లు రావ్ కల్వల, జానకి మండాది, ఉపేందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, రాజ్ గొంధీ, ట్రస్టీలు రామ్ అన్నాది, పవన్ గంగాధర, గంగా దేవర, అశోక్ కొండాల, ప్రవీన్ బిల్లా, మనోహర్ కసగాని, మాధవి సుంకిరెడ్డి, రాజేందర్ తొడిగాల, కార్యనిర్వహణ కమిటీ చంద్రా పోలీస్, లింగా రెడ్డి అల్వా, రూప కన్నయ్యగారి, సురేందర్ చింతల, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పెర్కారీ, రవికాంత్ మామిడి, శరత్ యర్రం, సతీశ్ జానుపల్లి, టీపీఏడీ అడ్వైజర్లు వేణు భాగ్యనగర్, సంతోష్ కోర్, విక్రమ్ జనగాం, నరేశ్ సుంకిరెడ్డి, జయ తెలకపల్లి, రవిశంకర్ పటేల్, సహకార కమిటీ అఖిల్ చండీరాల, సునీల్ కుమార్ ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కళ్యాణి తాడిమేటి, మధుమతి వ్యాసరాజు, కారుణ్య దామర్ల, క్రాంతి తేజ పండా, పల్లవి తోటకూర, రత్న ఉప్పల, రోహిత్ నారిమేటి, శంకర్ పరిమళ్, వసుధా రెడ్డి, అనూష వనం, కవిత ఆరుట్ల, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగెళ్లలు కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడినట్లు పేర్కొన్నారు.








Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement