Trading Window
-
ఇక్బాల్ అబ్దుల్లాను దక్కించుకున్న ఆర్ సీబీ
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఇక్బాల్ అబ్దుల్లాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ) దక్కించుకుంది. ఐపీఎల్ ట్రేడింగ్ విండో ద్వారా అతడిని కొనుగోలు చేసిందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2015 ఎడిషన్ కోసం మొదటి 'ట్రేడింగ్ విండో' అక్టోబర్ 6న తెరిచారు. దీని గడువు డిసెంబర్ 12తో ముగుస్తుంది. దీని ద్వారా క్రీడాకారులను దక్కించుకునే వీలుంది. 'ట్రేడింగ్ విండో' ద్వారా ఇద్దరు ఆటగాళ్లను ఇంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఉన్ముక్త్ చంద్, కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఆర్. వినయ్ కుమార్ ను కొనుగోలు చేసింది. తమ టీమ్ నుంచి ప్రవీణ్ కుమార్, మైఖేల్ హస్సీని రిలీజ్ చేసింది. -
ఉన్ముక్త్, వినయ్ లను కొన్న ముంబై ఇండియన్స్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తొలిసారిగా ప్రవేశపెట్టిన 'ట్రేడింగ్ విండో' ద్వారా ఇద్దరు ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఉన్ముక్త్ చంద్, కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఆర్. వినయ్ కుమార్ ను కొనుగోలు చేసింది. తమ టీమ్ నుంచి ప్రవీణ్ కుమార్, మైఖేల్ హస్సీని రిలీజ్ చేసింది. వీరిద్దరిని 2015 క్రీడాకారుల వేలంలో వేరే జట్లు కొనుక్కోవచ్చు. 2015 ఎడిషన్ కోసం మొదటి 'ట్రేడింగ్ విండో' అక్టోబర్ లో తెరిచారు. దీని గడువు డిసెంబర్ 12తో ముగుస్తుందని బీసీసీఐ తెలిపింది. తదుపరి ఎపీఎల్ ఎడిషన్ ఏప్రిల్ 8 నుంచి మే 24 వరకు జరుగుతుందని వెల్లడించింది.