Traffic Accidents
-
సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్!
నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని పైవంతెనలు వచ్చినా, కూడళ్లను మూసేసినా, యూటర్న్లు ఏర్పాటు చేసినా వాహనదారుల కష్టాలు మాత్రం తీరట్లేదు. ఉదయాన్నే ఆఫీసులకు బయల్దేరే ఉద్యోగులు సహా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సమయానికి చేరుకోలేకపోతున్నారు. బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లకు వెళ్లేవారు ప్రయాణ సమయానికి గంట ముందు, విమానాశ్రయానికి వెళ్లేవారు దాదాపు మూడు గంటల ముందే బయల్దేరాల్సి వస్తోంది. సాయంత్రం ఐదు దాటిందంటే నగరంలో ట్రాఫిక్ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. రాత్రి పది తర్వాతే రోడ్లపై కొంచెం ఒత్తిడి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రధాన నగరాల్లో ఈ తిప్పలు తప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగిపొర్లి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గమ్యం చేరే వరకు గంటల కొద్దీ అలా ప్రయాణం సాగించాల్సిందే. ఇదీ చదవండి: ప్రపంచంలో అక్కడే నిరుద్యోగులు ఎక్కువ..! కేంద్రం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం.. దాదాపు 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలి. అయినా రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు ప్రతి త్రైమాసికంలో వాటి సేల్స్డేటా పెరుగుతోందని ప్రకటిస్తున్నాయి. దాంతో రోజూ రోడ్లపై చేరే వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోడ్ల వెడల్పు నిర్ణీత ప్రదేశం వరకే విస్తరించే అవకాశం ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఫ్లైఓర్లు వేసి కొంత కట్టడి చేస్తున్నారు. అయినా చాలా నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు తప్పడంలేదు. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరల కోసం క్లిక్ చేయండి ప్రపంచంలో అత్యధికంగా నైజీరియా దేశంలోని లాగోస్ నగరంలో ప్రజలు ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. లాగోస్ విస్తీరణం 999 చదరపు కిలోమీటర్లు. అక్కడ ఒక కిలోమీటర్‌కు దాదాపు 227 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. నగరంలోని 9100 రోడ్లపై రోజు దాదాపు 50లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. దేశంలో అధికంగా ట్రాఫిక్ ఉండే నగరాల్లో దిల్లీ మొదటిస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. దిల్లీ సుమారు 1484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. 2020 లెక్కల ప్రకారం దాదాపు 1.2 కోట్లు వాహనాలు దిల్లీలో ఉన్నాయి. దిల్లీ తర్వాత కోల్‌కతా, ముంబయి నగరాల్లో అధికంగా ట్రాఫిక్ ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది. Top 10 cities with the worst traffic in the world pic.twitter.com/bn4XPT21w0 — Global Ranking (@Top1Rating) November 23, 2023 -
ఒడిశా రైలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది?
ఒడిశా:ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. 900 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే.. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో తెలిపే 'రైల్ ట్రాఫిక్ ఛార్ట్' ను రైల్వే ట్రాఫిక్ అధికారులు విడుదల చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ చిత్రంలో పేర్కొన్న విధంగా మూడు రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి. అందులో 'అప్ మెయిన్'గా చూపే రైల్ మార్గంలో షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. దానికి కుడి వైపున ఉన్న 'డౌన్ మెయిన్'లో బెంగళూరు-హవ్డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. 'అప్ మెయిన్'లో వెళ్లే కోరమండల్ క్రాసింగ్ పాయింట్ ఉండటంతో పొరపాటున కామన్ లూప్‌లోకి వెళ్లింది. అక్కడే ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీ కొట్టింది. దీంతో కోరమండల్‌లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న డౌన్ మెయిన్ లైన్లోకి ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వేగంగా క్రాస్ అవుతున్న బెంగళూరు-హవ్డా ఎక్స్‌ప్రెస్ రైలు వాటిని ఢీ కొట్టింది. దీంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది. అయితే.. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి:Odisha Train Accident: ఓ వైపు రైలు ప్రమాదం.. మరోవైపు.. బస్సు ఛార్జీల పెంపు..! -
మంచుతుపాను: నేడు 2800 విమానాలు రద్దు
► అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను ► 19కి చేరిన మృతుల సంఖ్య ► ఎమర్జెన్సీని ప్రకటించిన పది రాష్ట్రాలు ► నేడు 2,800 విమనాలు రద్దు చేసిన అమెరికా ► నిన్న 5,100 విమాన సర్వీసులు రద్దు వాషింగ్టన్: అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దేశ రాజధాని వాషింగ్టన్లో ఒక్క రోజే 30 అంగుళాల మంచు కురిసింది. దీని కారణంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య19కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. నార్త్ కరోలినాలో మంచు కారణంగా కారు ప్రమాదాల్లో 13 మంది మృతిచెందగా, వర్జీనియాలో ఇద్దరు, మేరీలాండ్‌లో ఒకరు, న్యూయార్క్‌లో ముగ్గురు మృతిచెందారు. పది లక్షల మంది మంచులో ఇరుక్కున్నట్లు అధికారులు ప్రకటించారు. జార్జియా, ఉత్తర కరోలినా, టెన్నెస్సీ, మేరీలాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, కెంటకీ రాష్ట్రాలు మంచు తుపానుకు విలవిల్లాడిపోతున్నాయి. 10 రాష్ట్రాలు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. న్యూయార్క్ గవర్నర్ ఆడ్రివ్ క్యూమో సహా ఇతర రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్ నగరాల్లోని రోడ్లపైకి వాహనాలను నిషేదించారు. వాహనాలు రాకుండా న్యూజెర్సీలోని బ్రిడ్జీలు, సొరంగ మార్గాలను ఆదివారం ఉదయమే మూసివేసినట్టు మేయర్ బిల్ ది బ్లాసియో తెలిపారు. అమెరికాలో మంచు కారణంగా నిన్న(శనివారం) 5,100 విమానాలు రద్దు చేయగా, ఈ రోజు 2,800 కి పైగా విమానాలను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వర్జీనియాలోని గురుద్వారాలు, ఆలయాల్లో మంచులో చిక్కుకుపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ తుపాను వల్ల దాదాపు లక్షా ఇరవై వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు వంద బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పరిస్థితిలో మార్పు రాదని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. -
అమెరికాను వణికిస్తున్న మంచుతుపాను
అమెరికాలోని నాష్విల్లే నగరంలో భారీగా కురుస్తున్న మంచు 9 మంది మృతి వాషింగ్టన్: అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. దేశ రాజధాని వాషింగ్టన్లో ఒక్క రోజే 30 అంగుళాల మంచు కురిసింది. 10 రాష్ట్రాలు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఇప్పటివరకు 9 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. పది లక్షల మంది మంచులో ఇరుక్కున్నట్లు అధికారులు శనివారం ప్రకటించారు. జార్జియా, ఉత్తర కరోలినా, టెన్నెస్సీ, మేరేలాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, కెంటుకీ రాష్ట్రాలు మంచు తుపానుకు విలవిల్లాడిపోతున్నాయి. వర్జీనియాలో తెలుగు జనాభా ఎక్కువగా ఉండటంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. ఎవరూ కూడా ఇళ్లు వదిలి బయటకు రాకూడదని తన సభ్యులకు విజ్ఞప్తి చేసింది. ఒక్క వర్జీనియాలోనే దాదాపు 800 ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వర్జీనియాలోని గురుద్వారాలు, ఆలయాల్లో మంచులో చిక్కుకుపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ తుపాను వల్ల దాదాపు లక్షా ఇరవై వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు వంద బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పరిస్థితిలో మార్పు రాదని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.