TRAI reforms
-
ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్
రద్దు చేసుకున్న, పనిచేయని మొబైల్ నంబర్లను కనీసం మూడు నెలల తర్వాతే వేరేవారికి కేటాయిస్తామని భారత టెలికాం నియంత్రణ సంస్థ-ట్రాయ్ తెలిపింది. డియాక్టివేట్ లేదా డిస్కనెక్ట్ చేసిన మొబైల్ నంబర్లు వాడిన వారి సమాచార గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు చెప్పింది. మొబైల్ నంబర్లు డిస్కనెక్ట్, డీయాక్టివేట్ చేసిన తర్వాత వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందని గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అందుకు ప్రతిగా ట్రాయ్ స్పందించింది. ఇదీ చదవండి: పేదల నుంచే జీఎస్టీ గరిష్ఠ వసూళ్లు ఈ రిట్పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ట్రాయ్ తన స్పందనను తెలియజేసింది. గతంలో ఫోన్ నంబరు వాడిన చందాదారుడి గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే 90 రోజుల వ్యవధి విధించినట్లు చెప్పింది. సబ్స్క్రైబర్లు సైతం తమ వంతుగా వ్యక్తిగత సమాచారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సూచించింది. వాట్సప్ సైతం తన స్పందనను కోర్టుకు తెలియజేసింది. ఒకవేళ 45 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు వాడకంలోలేని ఫోన్‌నంబర్లు ఆ తర్వాత కొత్త డివైజ్‌లో యాక్టివేట్ అయితే అందులోని డేటా మొత్తం తొలగిపోతుందని తెలిపింది. దాంతో గతంలో ఫోన్నంబర్తో వాట్సాప్ వాడిన వారి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుందని వివరించింది. -
ట్రాయ్ మాజీ చైర్మన్ జె.ఎస్. శర్మ మృతి
న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) మాజీ చైర్మన్ జె.ఎస్. శర్మ(65) గత నెల 28న మరణించారు. టెలికం రంగంలో సంస్కరణలకు పెద్ద పీట వేసిన ఆయన 2009, మే 14 నుంచి 2012, మే 13 వరకూ ట్రాయ్ చైర్మన్‌గా పనిచేశారు. కొంత కాలం పాటు అస్వస్థతకు గురైన ఆయన గత నెల 28న హైదరాబాద్‌లో మరణించారని ట్రాయ్ ప్రతినిధి తెలియజేశారు. ఆయన హయాంలోనే మొబైల్ నంబర్ పోర్టబిలిటి, సెకన్ బిల్లింగ్ అమల్లోకి వచ్చాయి. 1971 ఐఏఎస్ అధికారి అయిన ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన వారు. 1948, సెప్టెంబర్ 4న విజయవాడలో జన్మించిన ఆయన ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పట్టభద్రులయ్యారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎరువులు, రక్షణ, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్‌లో సభ్యుడిగా పనిచేశారు.