Trail running
-
బెజవాడ ప్లైఓవర్: హైదరాబాద్ వెళ్లే వారికి సూచన!
సాక్షి, విజయవాడ: బెజవాడకు మణిహారంగా పరిగణించబడుతున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ సిద్ధమయ్యింది. భవానిపురం నుంచి దుర్గగుడి మీదుగా రాజీవ్ గాంధీ పార్కు వరకు నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి అధికారుల అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్ సోమా కంపెనీ లోడ్ లారీలను ఒకవైపుగా వెళ్లనిచ్చి లోడ్ టెస్ట్ నిర్వహించారు. బుధవారం నుంచి ఫ్లై ఓవర్ పై రెండవ లోడ్ టెస్ట్‌కి సిద్ధం అవుతుందని అధికారులు తెలిపారు. (తీరనున్న బెజవాడ వాసుల చిరకాల స్వప్నం) ఫ్లై ఓవర్‌పై లోడ్ టెస్ట్ కారణంగా విజయవాడ నగరంలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం నుంచి 21వ తేదీ వరకూ ఫ్లై ఓవర్ లోడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి హైద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ నియంత్రణ లేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు మాత్రం భవానిపురం నుంచి ఆర్టీసీ వర్క్ షాప్- సితార జంక్షన్- సీవీఆర్ ఫ్లై ఓవర్- వైవీఆర్ ఎస్టేట్- పైపుల రోడ్- ఇన్నర్ రింగ్ రోడ్డు- రామవరపాడు రింగ్ వైపుగా వెళ్ళాలని అధికారులు సూచించారు. చదవండి: బాబు అక్రమాల కేసు గిన్నిస్ రికార్డు లెవల్లో.. -
16 నుంచి స్కూళ్లలో డిజిటల్ తరగతులు
2 వేలకు పైగా స్కూళ్లలో అమలు ► ఈ నెల 11 నుంచి 14 వరకు ట్రయల్ రన్ ► డిజిటలైజేషన్‌కు సదుపాయాలు కల్పించండి ► కలెక్టర్లకు, డీఈవోలకు డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ తరగతులను ఈ నెల 16 నుంచి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. పాఠశాలల డిజిటలైజేషన్‌పై బుధవారం కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే గుర్తించిన 2 వేలకు పైగా పాఠశాలల్లో డిజిటల్ తరగతుల బోధనకు అవసరమైన అన్ని సదుపాయాలు, సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో ట్రయల్న్ర్ నిర్వహించాలన్నారు. ప్రతి స్కూల్లో కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా, ఆర్వోటీలు, కేబుల్ కనెక్షన్లు సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని, టీచర్ల శిక్షణ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఒకసారి ప్రారంభించిన తరువాత సాంకేతిక, ఇతర కారణాలతో మధ్యలో ఆగిపోయే పరిస్థితి రావద్దన్నారు. మొదటి దశలో 2 వేలకు పైగా స్కూళ్లలో ప్రారంభిస్తామని, ఆ తరువాత దశల వారీగా మిగతా పాఠశాలలకు విస్తరిస్తామన్నారు. 16వ తేదీన కార్యక్రమం ప్రారంభానికి జిల్లాల్లో ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, లేనిచోట అధికారులు ప్రారంభించాలన్నారు. డిజిటలైజేషన్‌కు చర్యలు చేపట్టాలి డిజిటలైజేషన్లో సంక్షేమ పాఠశాలలు ముందంజలో ఉన్నాయని, మిగతా స్కూళ్లు కూడా అందుకు అనుణంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పేర్కొన్నారు. ఈనెల 11కల్లా కార్యక్రమం ప్రారంభించేం దుకు సిద్ధంగా ఉన్న స్కూళ్ల తుది జాబితాను అందజేయాలన్నారు. హార్డ్‌వేర్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేం దుకు జిల్లాల్లో జిల్లా మేనేజర్లు అందుబాటులో ఉన్నారని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. వారితోపాటు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కూడా అందుబాటులో ఉన్నారని, వారికి శిక్షణ ఇచ్చామన్నారు. అన్ని జిల్లాల్లో డిసెంబర్ 31కల్లా కేబుల్ ఆపరేటర్లతో ఒప్పందాలు పూర్తవుతాయన్నా రు. హైదరాబాద్‌లో ప్రతి స్కూల్‌కు ఈ కార్యక్రమం కోసం కేబుల్ ఆపరే టర్లు ముందుకువచ్చి వారి ఖర్చుతో కేబుల్ కనెక్షన్లు, సెట్ టాప్ బాక్సులు అందిస్తున్నా రన్నారు. మిగిలిగిన జిల్లాల్లో కూడా కలెక్టర్లు ఇలాంటి ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రాథమికంగా డిజిటల్ తరగతులు ప్రారంభించే స్కూళ్ల సంఖ్య ► 1,769 ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ► 391 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ► 192 మోడల్ స్కూళ్లు ► 48 విద్యాశాఖ గురుకులాలు ► 234 సంక్షేమ శాఖల గురుకులాలు. -
వయాడక్ట్‌ట్రాక్‌పై మెట్రో పరుగులు
అర్ధరాత్రి ట్రయిల్ రన్ సాక్షి,సిటీబ్యూరో: విద్యుత్ దీపకాంతుల మధ్య నాగోల్-మెట్టుగూడా రూట్లో (వయాడక్ట్‌ట్రాక్‌పై 8 కి.మీ) రెండో మెట్రోరైలుకు బుధవారం రాత్రి 9.30 గంటల నుంచి గురువారం తెల్లవారు ఝాము 2 గంటల వరకు టెస్ట్న్రవిజయవంతంగా నిర్వహించారు. ఉప్పల్ మెట్రో డిపోలో ఏడు మెట్రో రైళ్లుండగా నెలరోజులుగా ఒకే మెట్రో రైలుకు 14రకాల పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. బుధవారం రాత్రి మాత్రం రెండో రైలును ట్రాక్‌పై విజయవంతంగా నడిపినట్లు ఎల్అండ్టీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. తొలిరైలుకు రైల్వేసేఫ్టీ ధ్రువీకరణ కూడా లభించిందన్నారు. మొత్తం ఏడు రైళ్లకు వేర్వేరుగా ప్రయోగ పరీక్షలు నిర్వహించిన అనంతరమే ఈ రూట్లో నిరంతరాయంగా ట్రయల్న్ రనిర్వహిస్తామన్నారు. కాగా బుధవారం రాత్రి ప్రయోగ పరీక్ష నిర్వహించిన మెట్రో రైలుకు లోడు సామర్థ్యం, సిగ్నలింగ్, ట్రాక్,వేగం, తదితర అంశాలను పరీక్షించారు. డిపోలో నిర్వహించాల్సిన సామర్థ్య పరీక్షలను ఇప్పటికే పూర్తిచేశామని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. -
పరిశ్రమల్లో ప్రమాదాల నియంత్రణకు కొత్త చట్టం
సాక్షి, విశాఖపట్నం : పరిశ్రమల్లో ట్రయిల్ రన్ దశలో ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ప్రమాదాల నియంత్రణకు కొత్త చట్టం రాబోతోంది. చమురు, పెట్రోలియం, ఫార్మా వంటి భారీ ఉత్పాదక పరిశ్రమల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం జరిగి ఎంత ప్రాణ నష్టం చోటుచేసుకుంటుందో ఊహించడమే కష్టం. ఇలాంటి సందర్భాల్లో ఆయా యాజమాన్యాల తప్పిదాలపై చర్యలు తీసుకునేందుకు స్పష్టమైన నిబంధనలున్నాయి. కానీ కంపెనీలు కొత్తగా ఉత్పత్తి ప్రారంభించేముందు సన్నాహక ప్రక్రియలో భాగంగా నిర్వహించే ట్రయిల్ రన్లో ప్రమాదం జరిగితే..పెద్ద ఎత్తున ప్రాణ నష్టం చోటుచేసుకుంటే ఏం చేయాలి?, అటువంటి కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి?... అంటే అధికారులు చెప్పలేకపోతున్నారు. ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా ప్రమాదాలు సంభవిస్తే పరిశ్రమలు, రెవెన్యూ, పోలీస్, కాలుష్య నియంత్రణ బోర్డు వంటి శాఖల పరిధిలోకి వస్తాయి కాబట్టి చర్యలు తీసుకుంటాయి. కంపెనీ స్థాపన తర్వాత, ఉత్పత్తికి ముందు ఈ రెండు ప్రక్రియలకు మధ్య జరిగే కీలక ట్రయిల్ రన్ దశలో ప్రమాదాలు జరిగితే ఏం చేయాలనేది ఇప్పుడు అధికారులకు అంతుపట్టడంలేదు. ఎందుకంటే కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాలనుకునే ముందు అసలు ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది?, యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా?, ఉత్పత్తి ఎలా వస్తుంది?, లోపాలేవైనా ఉన్నాయా? వంటి విషయాలు పరిశీలించి సరిదిద్దేందుకు ట్రయిల్ రన్ నిర్వహిస్తాయి. దీన్నే కమిషనింగ్ స్టేజ్ అంటారు. అలా నిర్వహించే అత్యంత కీలకమైన ఈ దశలోనే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫార్మా, కెమికల్, ఆయిల్, పెట్రోలియం పరిశ్రమల్లో ఇవి మరీ ఎక్కువ. అలా కమిషనింగ్ సమయంలో జరిగే ప్రమాదాలకు సంబంధించి వాటి నివారణకు ఏం చేయాలి? ఎవరిని బాధ్యులు చేయాలి? అటువంటి ప్రమాదాల నివారణ ఏ శాఖ కిందకు వస్తుంది? అనే దానిపై స్పష్టత లేక ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియకఅధికారులు తల పట్టుకుంటున్నారు. ఇటీవల విశాఖలోని హెచ్పీసీఎల్లో కూలింగ్ టవర్ పేలిన నేపథ్యంలో మరోసారి ఈ సమస్య తెరపైకి వచ్చింది. ఇక్కడ కూలింగ్ టవర్ నిర్మాణం దాదాపు పూర్తయిన దశలో ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నప్పుడు 25 మంది వరకు మృతి చెందారు. ఇప్పుడు ఆ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై నిబంధనలు లేక ప్రభుత్వపరంగా అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. అందుకోసం కమిషనింగ్ స్టేజ్ పేరుతో కొత్త కంపెనీల చట్టాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. అలా అయితేనే ప్రమాదాలకు అడ్డుకట్ట పేలుడు, ఇతర ప్రమాదకరమైన పరిశ్రమలకు వర్తించేలా కేవలం ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుంది అనే దానికోసం నిర్వహించే ట్రయిల్న్ ్రవిధానానికి మాత్రమే వర్తించేలా ఈ చట్టాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. ఇందుకోసం పెట్రోలియం, రసాయనాలు, ఫార్మా, బల్క్‌డ్రగ్స్, చమురు వంటి కంపెనీలు అధికంగా ఉన్న విశాఖ జిల్లాలో ఫ్యాక్టరీస్ శాఖ అధికారులు ఈ చట్టం ఏ విధంగా ఉంటే బావుంటుంది?, ఏయే నిబంధనలుండాలి?, ట్రయిల్ రన్ స్థాయిలో జరిగే పేలుళ్లు, ప్రమాదాలకు ఎవరిని ఏ విధంగా బాధ్యత వహించేలా చేయాలి?, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?అనే నిబంధనలు రూపొందించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. విశాఖలో వందలాది కంపెనీలు విస్తరణ పనులతోపాటు, ట్రయిల్న్ ్రనిర్వహించే ముందు కనీసం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంలేదు. ఇందుకోసం త్వరలోనే ఆయా పరిశ్రమలతో మాట్లాడ్డం, నిపుణులతో సంప్రదింపులు చేయాలని ఫ్యాక్టరీస్ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం సమైక్య సమ్మె ముగిసినందున చట్టం రూపకల్పనకు తాజాగా నడుంబిగించింది. సుమారు ఏడు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖలోని హెచ్‌పీసీఎల్, హెరిటేజ్, ఫార్మా కంపెనీల్లో వరుసగా చోటుచేసుకున్న ప్రమాద ఘటనల నేపథ్యంలో కలెక్టర్ ద్వారా ఇటువంటి చట్టం అవసరాన్ని వివరిస్తూ ప్రీస్టార్టప్ సేఫ్టీ రివ్యూ పేరుతో నిబంధనలు తయారుచేసి కొత్త చట్టం విదివిధానాలు తయారుచేసి పంపించనున్నారు.