సాక్షి, విజయవాడ: బెజవాడకు మణిహారంగా పరిగణించబడుతున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ సిద్ధమయ్యింది. భవానిపురం నుంచి దుర్గగుడి మీదుగా రాజీవ్ గాంధీ పార్కు వరకు నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి అధికారుల అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్ సోమా కంపెనీ లోడ్ లారీలను ఒకవైపుగా వెళ్లనిచ్చి లోడ్ టెస్ట్ నిర్వహించారు. బుధవారం నుంచి ఫ్లై ఓవర్ పై రెండవ లోడ్ టెస్ట్‌కి సిద్ధం అవుతుందని అధికారులు తెలిపారు. (తీరనున్న బెజవాడ వాసుల చిరకాల స్వప్నం)
ఫ్లై ఓవర్‌పై లోడ్ టెస్ట్ కారణంగా విజయవాడ నగరంలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం నుంచి 21వ తేదీ వరకూ ఫ్లై ఓవర్ లోడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి హైద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ నియంత్రణ లేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు మాత్రం భవానిపురం నుంచి ఆర్టీసీ వర్క్ షాప్- సితార జంక్షన్- సీవీఆర్ ఫ్లై ఓవర్- వైవీఆర్ ఎస్టేట్- పైపుల రోడ్- ఇన్నర్ రింగ్ రోడ్డు- రామవరపాడు రింగ్ వైపుగా వెళ్ళాలని అధికారులు సూచించారు.
బెజవాడ ప్లైఓవర్: హైదరాబాద్ వెళ్లే వారికి సూచన!
Published Tue, Aug 18 2020 8:05 PM | Last Updated on Fri, Sep 18 2020 8:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment