transformers burned
-
కాలుతూ.. పేలుతూ..
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ లోపానికి తోడు.. హెచ్చు తగ్గులను నియంత్రించే వ్యవస్థ సరిగా లేకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) తరచూ కాలిపోతున్నాయి. ఫలితంగా గ్రేటర్ జిల్లాల పరిధి లోని తొమ్మిది సర్కిళ్లలో 2020– 21లో 1,597 డీటీఆర్లు కాలిపోగా, 2021– 22లో 2,035 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునికీకరిస్తున్నట్లు డిస్కం పెద్దలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో తలెత్తిన నిర్వహాణ లోపాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిర్వహణ లోపంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా రూ.100 కోట్లకుపైగా.. విద్యుత్ లైన్ల నిర్వహణ, పునరుద్ధరణ పనుల్లో భాగంగా లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, లూజు లైన్లను సరి చేయడం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ లీకేజీలను గుర్తించి, వాటిని నియంత్రించడంæ, దెబ్బతిన్న ఫ్యూజ్ బాక్స్‌ల పునరుద్ధరించడం, విద్యుత్ సరఫరాలో తలెత్తే హెచ్చు తగ్గుల నియంత్రణ కోసం ఫీడర్, డీటీఆర్‌ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్ సిస్ట్ం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) ఏటా రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. తరచూ సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. బినామీ కాంట్రాక్టర్లుగా ఇంజినీర్లు.. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఏఈలు, డీఈలు ఎప్పటికపుడు లైన్ టు లైన్ తనిఖీ చేసి, లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దాలి. వీరెవరూ ఆఫీసు దాటి బయటికి రావడం లేదు. ఇంజినీర్లే బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు. లైన్ల నిర్వహణ చేజిక్కించుకుంటున్నారు. లైన్ల పునరుద్ధరణ పనులు చేసినట్లు బిల్లులు గుట్టుగా డ్రా చేస్తున్నారు. రాజేంద్రనగర్, సైబర్‌సిటీ, సరూర్‌నగర్, మేడ్చల్ సర్కిళ్లలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలిపోయిన డీటీఆర్‌లకు డిస్కం రిపేర్లు నిర్వహించాల్సి ఉంది. రవాణా చార్జీలు సహా రిపేరు ఖర్చులను కూడా డిస్కమే భరించాల్సి ఉంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వినియోగదారులే ఈ భారాన్ని కూడా మోయాల్సి వస్తోంది. ఏసీలు, ఫ్యాన్ల వాడకం పెరిగింది.. ప్రస్తుతం నగరంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వాడకం కూడా ప్రారంభమైంది. ఫలితంగా విద్యుత్ వినిÄయోగం కూడా అనూహ్యంగా పెరుగుతోంది. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలో రోజు సగటు విద్యుత్ వినియోగం 87.1 మిలియన్ యూనిట్‌గా నమోదైంది. ఈ నెలారంభంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,500 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 2,794 మెగావాట్లకు చేరుకుంది. ఈ నెల చివరి నాటికి 3,000 మెగావాట్లు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా. (చదవండి: జాలీ జర్నీ...మళ్లీ రానున్న డబుల్ డెక్కర్ బస్సులు!) -
కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
-
కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, కరీంనగర్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాన్ని ఇంకా మరవక ముందే రాష్ట్రంలో మరో విద్యుత్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. కరీంనగర్‌లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం సమీపంలోని ఎలక్ట్రిసిటీ స్టోర్‌లో శనివారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పదుల సంఖ్యలో ఉన్న కొత్త ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి కల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. (ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం) ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. ఎలక్ట్రిసిటీ స్టోర్ రూమ్ ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. -
విద్యుత్ అధికారులపై రైతన్నల కన్నెర్ర
రామాయంపేట,న్యూస్‌లైన్: లోఓల్టేజీ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలి పంటలు ఎండిపోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోమటిపల్లి, రామాయంపేట గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు మంగళవారం రామాయంపేట విద్యుత్ సబ్ స్టేషన్ గేటు మూసి, ధర్నా చేపట్టారు. కోమటి పల్లి శివారులోని 63హెచ్‌పీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్పై 23 మోటార్లు నడుస్తున్నాయన్నారు. ఇక్కడ వంద హెచ్‌పీల ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. 100 హెచ్‌పీ ట్రాన్స్ఫార్మర్ కోసం ఆరునెలల క్రితం ఆరుగురు రైతులు ఒక్కొక్కరు రూ.6 వేల చొప్పున బ్యాంకులో చెల్లించినట్లు రైతులు తెలిపారు. అయినా ఆరునెలలు దాటినా ట్రాన్స్ ఫార్మర్ను అధికారులు ఇవ్వడం లేదన్నారు. బోర్లలో నీళ్లు ఉన్నప్పటికీ కరెంటు ఇవ్వకపోవడంతో పాటు వచ్చిన కరెంటు కూడా లోఒల్టేజీతో రావడంతో ట్రాన్స్ఫార్మర్లతో పాటు బోరు మోటార్లు కాలిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రామాయంపేట ఏఈ బాబయ్యకు రైతులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటామని రైతులు సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించారు అనంతరం ఏఈ బాబయ్య రాత్రి ఏడు గంటలకు సబ్ స్టేషన్ వద్దకు వచ్చి కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఇస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కార్యక్రమంలో రైతులు శీలం కిష్టారెడ్డి, జీవన్‌రెడ్డి, ఉప సర్పంచ్ నాగేశ్వర్‌రెడ్డి, వెల్ముల సిద్దరాంలు, వార్డు సభ్యుడు బాలు, సంపత్,వెంకట్, దేవానందం, లంబాడి బాబు, కుమ్మరి స్వామి, కిష్టయ్య, పోచయ్య, మర్కు రాజు, ఎర్రం రాములు, కిష్టారెడ్డి, మల్లేశం, దోమకొండ సిద్దరాంలు పాల్గొన్నారు. పోతరాజుపల్లిలో అధికారుల దిష్టిబొమ్మ దహనం తూప్రాన్:గత ఐదురోజులుగా అరకొరగా సరఫరా చేస్తున్న కరెంటు వల్ల పంటలు ఎండిపోతున్నాయని అగ్రహారం, దమ్మక్కపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోతరాజుపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు తూప్రాన్-గజ్వేల్ రహదారిపై విద్యుత్ అధికారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో చేట్లగౌరారం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి రోజుకు కేవలం రెండు గంటల పాటే విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. ఫలితంగా అగ్రహారం, దమ్మక్కపల్లి గ్రామాల రైతుల పంటలు ఎండుముఖం పట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామాలకు చెట్లగౌరం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా చేయడంవల్లే సమస్య వస్తోందని, ఇమాంపూర్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా చేయాలని కోరారు. రైతులకు 7 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతున్న అధికారులు రెండు గంటలు కూడా అందించడంలేదన్నారు. వెంటనే 7 గంటల కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ విద్యుత్ ఏడీఈ వినోద్‌రెడ్డిని వివరణ కోరగా ఇన్కమింగ్ సరఫరా లేకపోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు.