Transport facilities
-
రవాణా ‘వసతుల’ కల్పనలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: సులభతర సరుకు రవాణా వ్యవస్థలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వరంగ డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)–2022 ర్యాంకుల్లో రాష్ట్రం మరోసారి సత్తాను చాటింది. లీడ్స్–2022 ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల విభాగాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు అచీవర్స్‌గా నిలిచాయి. ఫాస్ట్ మూవర్స్ విభాగంలో కేరళ ఉండగా, ఏస్పైర్స్ విభాగంలో గోవా, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. తీరప్రాంతం లేని రాష్ట్రాలు, తీరప్రాంతం ఉన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల కింద నాలుగు విభాగాలుగా విభజించి అచీవర్స్, ఫాస్ట్‌మూవర్స్, ఏస్పైర్స్ ర్యాంకులను ప్రకటించారు. సర్వేలో 90 శాతానికిపైగా పాయింట్లు సాధించిన రాష్ట్రాలను అచీవర్స్‌గా, 80 నుంచి 90 శాతం మధ్య ఉన్న వాటిని ఫాస్ట్మూవర్స్గా, 80 శాతం కంటే తక్కువ పాయింట్లు పొందిన రాష్ట్రాలను ఏస్పైర్స్గా ప్రకటించారు. తీరప్రాంతం లేని రాష్ట్రాల విభాగాల్లో హరియాణ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా సరుకు రవాణా సేవలను వినియోగిస్తున్న వారి అభిప్రాయాలను తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. 2030 నాటికి దేశ ఎగుమతులు రెండు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా 2018 నుంచి లీడ్స్ ర్యాంకులను ప్రకటించడం మొదలుపెట్టింది. 2021 లీడ్స్ ర్యాంకుల్లో తీరప్రాంత రాష్ట్రాల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మొదటిస్థానంలో నిలిచింది. సింగిల్ డెస్క్‌తో సత్ఫలితాలు లీడ్స్–2022లో అత్యధిక పాయింట్లతో మొదటిస్థానం రావడంలో స్పందన కీలకపాత్ర పోషించినట్లు నివేదికలో పేర్కొన్నారు. పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి ఇండస్ట్రీస్ స్పందన పేరుతో ఏర్పాటు చేసిన సింగిల్ డెస్క్ పోర్టల్ సత్ఫలితాలను ఇస్తోంది. రవాణా మౌలికవసతుల్లో గోడౌన్లు మినహాయించి మిగిలిన అన్నీ సగటుకంటే ఎక్కువ మార్కులు పొందినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సులభతర సరుకు రవాణా కోసం పోర్టులు, పారిశ్రామికపార్కుల వద్ద ట్రక్ పార్కింగ్ టెర్మినల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. నెల్లూరు, గంగవరం, అనంతపురం, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగా పేర్కొంది. -
ఎదురుమొండి...మొండిబతుకులు!
సాక్షి, అవనిగడ్డ : బాహ్య ప్రపంచానికి దూరంగా.. కష్టాలు.. కన్నీళ్లు.. వలస బతుకులకు చేరువగా ఎదురుమొండి దీవుల ప్రజలు దీనావస్థలో కాలంవెళ్లదీస్తున్నారు. పాలకుల హామీలు నీటిమూటలు కాగా.. ఓట్ల రాజకీయం శాపంగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. కనీస మౌలిక వసతులు లేక జనం ఆకలికేకలతో పల్లెదాటి వలస కూలీలుగా మారుతున్న దురవస్థ. తమ కష్టాలు కడతేర్చే పాలన కోసం ఈ ప్రాంతం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. జిల్లాలో రవాణా సౌకర్యం లేని ఏకైక ప్రాంతం నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవులు. మూడు పంచాయతీలున్న ఈ దీవులకు వెళ్లాలంటే ఫంటు, పడవ ప్రయాణమే దిక్కు. గతంలో ఎదురుమొండి, గొల్లమంద వద్ద జరిగిన పడవ ప్రమాదాల్లో 50 మంది మరణించినా పాలకుల్లో చలనం లేదు. గత ఏడాది నవంబర్‌లో దివిసీమ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ –ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.77 కోట్ల నిధులు ప్రకటించినా అతీగతీ లేదు. గుంటూరు జిల్లా రాజుకాలువ ప్రజల దయాదాక్షిణ్యాలే ఈ దీవుల సాగు, తాగునీరుకి ఆధారం. దీవుల్లో బంగారు పంటలు పండే రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉండగా, సాగునీరందక ఐదేళ్లలో రెండు సార్లు పంట విరామం ప్రకటించారు. ఎదురుమొండి – నాచుగుంట మధ్య నిర్మించాల్సిన రహదారి, అటవీ భూముల ఆంక్షల పేరుతో మూడు కిలోమీటర్ల మేర ఆగిపోయింది. గతంలో 50 మంది మృత్యువాత ఎదురుమొండి దీవుల్లో కృష్ణా నదిలో జరిగిన రెండు పడవ ప్రమాదాల్లో 50 మంది మృత్యువాతపడ్డారు. 1990లో ఎదురుమొండి వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 20 మంది మరణించగా, 2004లో గొల్లమందలో జరిగిన పడవ ప్రమాదంలో 30 మంది చనిపోయారు. వీరంతా కూలి పనులకు, మండల కేంద్రాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదాలు జరిగాయి. అప్పటి నుంచి ఎదురుమొండి దీవులకు వారధి నిర్మించాలని డిమాండ్ ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎదురుమొండి దీవులను పట్టించుకోలేదని ప్రజలు చెబుతున్న మాట. వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు ప్రకటించినా.. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం అంశం ప్రధాన అస్త్రంగా సాగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.45 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపగా, అనంతరం మహానేత మరణంతో దీని గురించి పట్టించుకున్నవారే లేరు. గత ఏడాది నవంబర్ 21న ఉల్లిపాలెం, చల్లపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం రూ.74 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించినా అతీగతీ లేదు. రెండుసార్లు సాగుకు విరామం ఎదురుమొండి దీవుల్లో 2 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది కాకుండా మాజీ సైనికులు, ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మరో మూడు వేల ఎకరాల అటవీభూమి ఉంది. గుంటూరు జిల్లాలోని రాజుకాలువ వద్ద ఉన్న పంపింగ్ స్కీం నుంచి ఎదురుమొండిలోని చెరువులకు నింపి అక్కడ నుంచి పంట పొలాల సాగుకు రైతులు నీటిని వాడుకుంటుంటారు. 2014 – 15లో రెండేళ్లు సాగునీరందక దీవుల్లో రైతులు సాగుకు విరామం ప్రకటించారు. 2016 – 17లో అరకొరగా అందిన సాగునీటితో పంటలు సాగుచేసుకున్నారు. గత ఏడాది రాజుకాలువ రైతులు పంపింగ్ పథకాన్ని అడ్డుకోవడం, కృష్ణానది పాయలో వేసిన పైపులైన్ దెబ్బతినడంతో రెండు వేల ఆయకట్టుకుగాను 450 ఎకరాల్లో మాత్రమే సాగుచేయగలిగారు. ఎదురుమొండి రక్షిత మంచినీటి పథకం చెరువు నీరు పసర్లు కమ్ముకోవడంతో దిక్కులేని స్థితిలో ఈ నీటినే వాడుకుంటున్నారు. సాగునీరందక ఎండిపోయిన పంటను చూసి దిగాలుగా ఉన్న రైతులు ఆగని వలసలు ఎదురుమొండి దీవుల్లో సక్రమంగా సాగునీరు అందకపోవడం, ఇతర పనులు లేకపోవడం వల్ల ఈ దీవులకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. ఏడాదిలో ఎనిమిది నెలలు విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పనుల కోసం ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్తుంటారు. గొల్లమంద, జింకపాలెం, ఎదురుమొండి నుంచి ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఎదురుమొండి దీవుల్లోని ప్రజల సమగ్ర అభివృద్ధి పథకం కోసం 25 ఏళ్ల క్రితం ఎదురుమొండిలో వేసిన శిలాఫలకం ముళ్లకంప పెరిగి వెక్కిరిస్తోంది. మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా.. ఎదురుమొండి దీవుల్లో ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్ల దిబ్బ పంచాయతీలు ఉన్నాయి. ఎదురుమొండి పంచాయతీలో గొల్లమంద, జింకపాలెం, ఏసుపురం, కృష్ణాపురం, బ్రహ్మయ్యగారిమూల, బొడ్డువారిమూల, ఎదురుమొండి గ్రామాలు ఉన్నాయి. దీవుల్లోని ఈ మూడు పంచాయతీల్లో 8,785 మంది జనాభా ఉండగా, 3,513 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95 శాతం మంది మత్స్యకారులే. ఓట్లు వేయలేదనే అక్కసుతో.. ఎదురుమొండి దీవుల ప్రజలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు ఓట్లు వేయలేదనే అక్కసుతో ఈ దీవుల అభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నారు. ఈ విషయాన్ని దివంగత శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య పలుసార్లు బాహాటంగానే చెప్పారు. 2009 ఎన్నికల్లో అప్పటి వరకూ మెజార్టీతో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, చివరిరౌండైన ఎదురుమొండి దీవుల్లో టీడీపీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్యకు 1504 అధిక్యంతో బ్రహ్మరథం పట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుద్ధప్రసాద్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు కంటే కేవలం 365 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. రెండుసార్లు రెండు వేర్వేరు పార్టీలు మారినా దీవుల ప్రజలు తనను ఆదరించలేదనే కోపంతో ఎదురుమొండి దీవుల గురించి బుద్ధప్రసాద్ పట్టించుకోలేదని కొంతమంది దీవుల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓట్లు వేయలేదని కక్ష గత రెండు ఎన్నికల్లో ఎదురుమొండి దీవుల్లో ప్రజలు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కు ఓట్లు వేయలేదని మా దీవులపై కక్ష పెంచుకున్నారు. అందుకే దీవుల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. రూ.74 కోట్లుతో ఎదురుమొండి వారధి నిర్మిస్తామని సీఎం ప్రకటించినా పనులు ప్రారంభించలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే మా దీవులకు మంచి రోజులు వస్తాయి. –నాయుడు అంకరాజు,ఎదురుమొండి, నాగాయలంక మండలం మా తాత కాలం నుంచి రోడ్డు ఉంది ఊరి పుట్టిన దగ్గర నుంచి నాచుగుంట – ఎదురుమొండి రోడ్డు ఉంది. గతంలో రెండు సార్లు వేశారు. ఇప్పుడు అటవీశాఖ అభ్యంతరాలు పెడితే ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. చినుకు పడితే ఈ రోడ్డుపై వెళ్లలేము. నదిలో నావపై నాగాయంక వెళ్లాలంటే 3 గంటల ప్రయాణం. ఎవరన్నా గర్భిణులు ఉన్నా, రోగస్తులున్నా నావపై తీసుకెళ్లాల్సిందే. – సైకం బస్వారావు, నాచుగుంట -
సంతకు వెళ్లాలంటే ప్రాణాలతో చెలగాటం
-
దడ!
ఇంటర్ విద్యార్థులకు అగ్ని పరీక్షలా ‘నిమిషం’ పదో తరగతి విద్యార్థులను భయపెడుతున్న 5 నిమిషాలు.. క్షేత్రస్థాయి సమస్యలు పట్టించుకోరా..? కనీస సౌకర్యాలే లేనప్పుడు కఠిన నిబంధనలేల! ఆందోళనలో విద్యార్థులు ఒక్క నిమిషం..60 సెకన్లు.. రెప్పపాటులో కాలగర్భంలో కలిసిపోయే సెకన్..గట్టిగా నిట్టూర్చినా నిమిషం హరీమంటుంది. పరీక్షా సమయంలో నిమిషం అగ్ని పరీక్ష పెడుతోంది. విద్యార్థులకు కన్నీళ్లు పెట్టిస్తోంది.. పరుగులు పెట్టిస్తోంది. చదివింది మర్చిపోయేంత దడ పుట్టిస్తోంది. రవాణా సదుపాయాలుండవు.. బస్సులున్న చోటా అవి వేళకు రావు. తండ్రో, సోదరుడో బైక్‌పై డ్రాప్ చేయబోతే ఏదో సమస్య. నడక తప్ప గత్యంతరం లేని విద్యార్థులెందరో.. ఎలా రావాలి? నిమిషమే అగ్ని పరీక్ష పెడుతోందంటే విచిత్రంగా పదో తరగతి విద్యార్థులకు ఐదు నిమిషాల నిబంధనపెట్టి వారికీ దడ పుట్టిస్తున్నారు. అసలే పల్లెటూళ్లు.. పక్క గ్రామాల నుంచి రావాలంటే ఎప్పుడో వచ్చే బస్సు.. రోడ్లే లేని ఊళ్లలోని విద్యార్థులకు పొలం గట్లే గతి..ఏమిటీ అర్థం లేని నిబంధనలు.. కనీస ఆలోచన లేని అధికారుల తీరు విద్యార్థుల గుండెల్లో దడ పుట్టిస్తోన్న వైనంపై ప్రత్యేక కథనం.. పాపన్నపేట: ఒక్కో విద్యార్థిది ఒక్కో పరిస్థితి. కానీ ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు ఒక్క నిమిషం, 5 నిమిషాలు దాటితే పరీక్షకు అనుమతించ బోమనే కఠిన నిబంధనలు విధించి తమ జీవితాలతో ఆటలాడు కుంటున్నట్లుగా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని నర్సాపూర్ జూనియర్ కళాశాలలో ఒక్క నిమిషం నిబంధన ముగ్గురు విద్యార్థులను పరీక్షలు రాయకుండా చేసింది. ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.15 వరకు కొనసాగుతాయి. జిల్లాలో మొత్తం 67 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 10,924 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 21 కేంద్రాల్లో మాత్రమే డ్యూయల్ డెస్క్‌లు ఉండగా, 9 కేంద్రాల్లో ఒక్క డెస్కు కూడా లేనట్లు సమాచారం. మిగతా వాటిలో బెంచీలు, కుర్చీలు సమకూర్చి పరీక్షలు రాయిస్తున్నారు. ఇంకా కొన్ని కేంద్రాల్లో బయట నుంచి బెంచీలు, కుర్చీలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు, వెలుతురు, టాయిలెట్లు సరిగా లేకపోగా, మరికొన్ని కేంద్రాల్లో కూర్చోవడానికి అనుకూలంగా లేని లాంగ్, బెంచీలు, కుర్చీలపైనే నడుముల నొప్పి వస్తున్నా విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యాలు లేనప్పుడు సమయానికెలా రావాలి? జిల్లాలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవు. చాలా మంది విద్యార్థులు ఆటోలు.. అవి లేకుంటే నడుచుకుంటూ పాఠశాలకు వస్తుంటారు. పల్లెటూళ్ల నుంచి వచ్చే ఆటోల డ్రైవర్లు సామర్థ్యాని కనుగుణంగా ప్రయాణికులు నిండితేగాని ఆటోను నడపరు. కొంత మంది విద్యార్థులు పొలాల గట్లపై.. వాగులు వంకలు దాటుతూ బడికి రావాల్సి ఉంటుంది. ఎండాకాలం కావడంతో భానుడి భగభగలు అప్పుడే ప్రారంభమయ్యాయి. జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టాక పరీక్ష కేంద్రాలను చదివే బడిలో కాకుండా పొరుగు బడుల్లో నిర్వహిస్తున్నారు. అక్కడకు బస్సు సౌకర్యాలు కూడా లేవు. ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా 5 నిమిషాల నిబంధన విధించడం సరికాదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. కాపీయింగ్‌కు నిమిషం నిబంధనలకు సంబంధమేమిటి? మాస్ కాపీయింగ్‌కు, నిమిషం నిబంధనకు సంబంధం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. మాస్ కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు నిమిషం నిబంధన విధించినట్లు ఇంటర్ బోర్టు ప్రకటించడం హాస్యాస్పదం, అమానవీయం అంటున్నారు. కాపీయింగ్‌కి నిమిషం నిమింధనకు పొంతనలేనిదని పేర్కొంటున్నారు. రెండు నిమిషాలు ఆలస్యమైతే రెండు మార్కులు పోతాయనే నెపంతో పూర్తి పరీక్ష రాయకుండా చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంటి వద్ద మగవాళ్లే లేరు.. ఎలా రావాలి మాది పాపన్నపేటకు 5 కి.మీ. దూరంలోని రామతీర్థం. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో.. ఒక్కోసారి నడిచి వస్తుంటాను. ఇప్పుడు పరీక్ష కోసం పాపన్నపేట వరకు నడిచి వచ్చి అక్కడి నుంచి 5 కి.మీ. దూరం బస్సులో ప్రయాణించి, మరో 2 కి.మీ. నడిస్తే గాని కుర్తివాడలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని చేరుకోలేం. మా నాన్న జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇద్దరు అక్కలు.. కనీసం బైక్‌పై వెళదామంటే మగవారే లేరు. – ఎస్. వనజ, రామతీర్థం పొలం గట్లపై 5 కి.మీ. నడవాలి మాది పాపన్నపేటకు 5 కి.మీ దూరంలోని ముద్దాపూర్. మా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. రోజు 5 కి.మీ. ఓ వాగు దాటి పొలం గట్లపై నుంచి పాపన్నపేటకు వచ్చి చదువుకుంటాం. ఇప్పుడు కాలినడకన పాపన్నపేటకు వచ్చి, అక్కడి నుంచి 5 కి.మీ బస్సులో ప్రయాణించి, మరో 2 కి.మీ నడిచి 9.30కల్లా కుర్తివాడ పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యం కాకుండా వెళ్లాలంటే సాధ్యమేనా? ఎంత ప్రయత్నించినా ఒక్క రోజైనా ఆలస్యం కాదా? 5 నిమిషాల కోసం మా జీవితాన్నే నాశనం చేస్తారా. – పి.శ్వేత. ముద్దాపూర్ సుప్రియది మరో వ్యథ ‘పాపన్నపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఘనపురం సుప్రియది మరో వ్యథ. ఈ అమ్మాయిని అన్నారం గ్రామానికి చెందిన వాళ్ల చిన్నాన్న దత్తత తెచ్చుకున్నాడు. ప్రతి రోజు 5 కి.మీ దూరం ప్రయాణించి పాఠశాలకు వచ్చేది. కానీ ఇటీవల దత్తత తెచ్చుకున్న వాళ్ల చిన్నాన్న చనిపోవడంతో ఇంట్లో గొడవలు ఆరంభమై సుప్రియ కామారెడ్డి జిల్లాలోని తన స్వగ్రామమైన కన్నారెడ్డి నుంచి పాఠశాలకు వస్తోంది.అయితే ఆమె పదో తరగతి పరీక్షలు రాయాలంటే కన్నారెడ్డి నుంచి 3 కి.మీ. దూరం కాలినడకన వచచి 50 కి.మీ దూరం బస్సులో ప్రయాణిస్తే గాని పరీక్ష రాయాల్సిన యూసుఫ్‌పేటకు చేరుకోలేని పరిస్థితి’. ఈ అమ్మాయి భవిష్యత్తుకు అగ్ని పరీక్ష పెట్టింది ఎస్సెస్సీ బోర్డు. -
నిధులున్నా.. కదలరా!
వరంగల్ : ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రవాణా రంగానిదే కీలక పాత్ర. రవాణా వసతులు మెరుగ్గా ఉంటే పరిశ్రమల స్థాపనకు వెసలుబాటు, ఆపై స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తారుు. ఈ ఉద్దేశంతోనే రవాణా వసతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని దాదాపు అన్ని రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ అలసత్వం అన్ని శాఖల్లో ఉన్నా.. పంచాయతీరాజ్(పీఆర్) శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారుల తీరు మరీ అధ్వానంగా ఉంది. పెద్దమొత్తంలో నిధులు.. రోడ్ల నిర్మాణానికి కావాల్సిన అన్ని వనరులు అందుబాటులో ఉన్నా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పీఆర్ విభాగం ోడ్లు ఉండే తొమ్మిది జిల్లాల్లో మన జిల్లా ఏడో స్థానంలో ఉండడం చూస్తేనే అధికారుల పనితీరు అర్థం చేసుకోవచ్చు. పునరుద్ధరణకు రూ.416 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీరాజ్ శాఖ తరఫున గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా రోడ్లు నిర్మాణం, పునరుద్ధరణ(రెన్యూవల్)కు నిర్ణరుుంచింది. ఇందులో భాగంగా రూ.416 కోట్ల నిధులు మంజూరు చేసింది. రూ.230.35 కోట్లతో 1676.37 కిలోమీటర్ల పొడవైన బీటీ రోడ్లను పునరుద్ధరించాలని సూచించింది. అరుుతే, ఈ పనులు ఎప్పు డో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఘనత వహించిన మన ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి కావడం లేదు. 1676.37 కిలోమీటర్లలో కేవలం 484 కిలోమీటర్ల మేర రోడ్లనే పునరుద్ధరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నూతన రోడ్లు ఇక.. పాత రోడ్లను పునరుద్ధరించడమే కాకుండా జిల్లాలో కొత్తగా 396.83 కిలోమీటర్ల మట్టి రోడ్లను బీటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల కోసం రూ.185.71 కోట్లు విడుదల చేసింది. పనుల అంచనా నివేదికలు రూపొందించడమే కాకుండా పూర్తయిన పనులకు బిల్లులు తయారు చేయడంలోనూ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నూతన రోడ్ల పనుల పరిస్థితి దయనీయంగా ఉంది. జిల్లాలో ఇప్పటికి 57 కిలోమీటర్ల మేరకే కొత్త రోడ్లు నిర్మించడం గమనార్హం. మంచి సీజన్లోనూ.. రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నవంబర్ నుంచి మే వరకు అనువైన సీజన్‌గా చెబుతారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో సెప్టెంబర్ నుంచే రోడ్ల పనులు చేసేందుకు అనువుగా ఉంది. అరుునా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు మాత్రం పనులపై దృష్టి పెట్టడం లేదు. వరంగల్ జిల్లాలో అనుభవం ఉన్న పెద్ద కాంట్రాక్టర్లే కాకుండా.. బీటీ రోడ్ల నిర్మాణంలో కీలకమైన 22 హాట్ మిక్స్ ప్లాంట్లు ఉన్నాయి. నిధులు కేటాయించి ఏడాది గడుస్తోంది. ఇలా వనరులు ఉన్నా రోడ్ల పనులు జరిగే తీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఈ విషయూన్ని గుర్తించిన పంచాయతీరాజ్ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన ఈఎన్సీ వరంగల్ జిల్లా అధికారుల తీరు వల్ల తమ శాఖకు చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉందని పంచాయతీరాజ్ రాష్ట్ర అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేపదే చెప్పినా జిల్లా అధికారుల తీరు మారకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ అత్యున్నత అధికారి ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఎం.సత్యనారాయణరెడ్డి ఈనెల 23న జిల్లాకు వచ్చారు. ఇంజనీరింగ్ శాఖలోని అందరు అధికారులతో పనుల తీరుపై సమీక్షించారు. నెల రోజులుగా జిల్లాలో ఒక్క కిలోమీటరు రోడ్డు పనులైనా చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని వనరులు ఉన్నా పనులపై శ్రద్ధ చూపని అధికారులు.. ఈఎన్సీ ఆగ్రహంతోనైనా తీరు మార్చుకుంటారా, లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
గ్రేటర్ లో బెస్ట్ సేవలు
గ్రేటర్ ఆర్టీసీ ఇక కొత్త పుంతలు తొక్కనుంది. తాజాగాప్రజా రవాణా బాధ్యతను ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అప్పగించడంతో సిటీబస్సు ముఖచిత్రం మారనుంది. ముంబయి తరహా రవాణా సదుపాయాలు హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు రూ.360 కోట్ల భారీ నష్టాల్లో ఉన్న గ్రేటర్ ఆర్టీసీకి జీహెచ్ఎంసీ నుంచి లభించే రూ.218 కోట్ల సాయం ఊరట నివ్వనుంది. ‘బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు’ (బెస్ట్) సంస్థ తరహాలో సిటీలో ప్రజా రవాణాను జీహెచ్ఎంసీ పరిధిలోకి తేనున్నారు. దీంతో నగరంలో రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి- గ్రేటర్లో ప్రజా రవాణా తీరుతెన్నులపై ‘సాక్షి’ కథనం.. అడుగులు ఇలా.. ముంబయి తరహాలో ప్రజా రవాణాను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం గతేడాది చర్యలు చేపట్టింది. అక్కడ అమలవుతున్న ‘క్యూ’ పద్ధతిని అమలు చేసేందుకు గత ఏడాది ఆగస్టులో రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, ఆర్టీసీ జేఎండీ రమణారావు, హైదరాబాద్ జేటీసీ టి. రఘునాథ్‌తో ఓ బృందం ముంబయిలో పర్యటించింది. బస్సుల నిర్వహణ, ఆన్లైన్ సేవలు, క్యూ పద్ధతి వంటి అనేక అంశాలను ఈ బృందం పరిశీలించి ‘క్యూ’ పద్ధతిని గ్రేటర్లో అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని అబిడ్స్‌లో మొదట ప్రారంభించాలని భావించినా తగినన్ని బస్‌బేలు లేకపోవడంతో నిలిపివేశారు. ఇటీవల 219 చోట్ల బస్‌బేల నిర్మాణానికి జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో క్యూ పద్ధతి అమలు కావాలంటే కనీసం 1300 చోట్ల బస్‌బేలు అవసరమని ఆర్టీసీ పేర్కొంటోంది. రహదారుల విస్తరణ జరగాలి ముంబయితో పోల్చినపుడు హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ చాలా తక్కువ. దీంతో ప్రజా రవాణా విస్తరణ అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. రోడ్డు నిర్మాణంలో లోపాల కారణంగా బస్సుల నిర్వహణ భారమవుతోంది. సకాలంలో ప్రయాణికులకు సేవలను అందించలేకపోతున్నాం. 34 లక్షల మంది ప్రయాణికులు ఉన్న హైదరాబాద్‌లో ఆర్టీసీ సేవలు మెరుగుపడాలంటే కనీసం 1000 కొత్త బస్సులు అవసరం. - పురుషోత్తం నాయక్, ఆర్టీసీ గ్రేటర్ ఈడీ స్కై వేల ఏర్పాటు అవసరం ముంబయిలో స్కైవేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద ఎస్కలేటర్లు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. బస్‌స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్‌కు చేరుకునేందుకు స్కైవేలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. క్యూ పద్ధతికి కూడా బస్‌బేల ఏర్పాటు చాలా బాగుంది. ఇక్కడా అదే తరహాలో అభివృద్ధి చేయవలసి ఉంది. - టి.రఘునాథ్, జేటీసీ హైదరాబాద్ -
అడుగు ముందుకు
కృష్ణమ్మ ఒడిలో ‘పుట్టె’డు కష్టాలు ఇక తొలగిపోనున్నాయి.. దశాబ్దాల కాలంగా ఉన్న ఈ ప్రాంతప్రజల రవాణా ఇబ్బందులు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ సోమశిల, సిద్ధేశ్వరం గ్రామాల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. పొరుగు జిల్లా కర్నూలుతో పాలమూరువాసుల సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ మేరకు వంతెన నిర్మాణంలో భాగస్వాములుకావాలని సీఎస్ ఏపీ సీఎస్‌కు లేఖ కూడా రాశారు. చకచకా సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణ సర్వే - టెండర్లు దక్కించుకున్న కలకత్తా సీడ్‌టెక్ కంపెనీ - పనులు పరిశీలించిన ఆర్అండ్బీ ఈఎన్సీ చీఫ్ - వారంరోజుల్లో ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక - రూ.193కోట్లు మంజూరుచేసిన ప్రభుత్వం - భాగస్వామ్యం కోసం ఏపీ ప్రభుత్వానికి సీఎస్ లేఖ కొల్లాపూర్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేసే సోమశిల, సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ గతంతో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కిపడింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జి ల్లాల మధ్య ఇరుప్రాంత ప్రజలు నిత్యం కృష్ణానదిలో పుట్టీలు, మరబోట్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమం లో 2007లో మంచాలకట్ట వద్ద పుట్టీ మునిగి 61మంది జలసమాధి కావడం తో వంతెన నిర్మాణం కోసం డిమాండ్ పెరిగింది. ఈ వంతెన నిర్మాణం కోసం అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.110కోట్లు, కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు డబుల్‌లైన్ రోడ్డు నిర్మించేందుకు రూ.85కోట్లు మంజూరుచేశారు. టెండర్లు పూర్తయినా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. వైఎస్ఆర్ అకాలమరణంతో వం తెన నిర్మాణం ఆగిపోయింది. మళ్లీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వంతెన నిర్మాణం ఆవశ్యకత తెరపైకి వచ్చింది. వంతెన పనులను మూడు విభాగాలుగా విభజించారు. కొల్లాపూర్ నుంచి నాగర్‌కర్నూల్ వరకు రూ.50.50 కోట్లతో డబుల్‌లైన్ రోడ్డు, కొల్లాపూర్ నుంచి సోమశిల వరకు బైపాస్ రహదారితోపాటు డబుల్‌లైన్ కోసం రూ.ఏడున్నర కోట్లు, వంతెన నిర్మాణం కోసం రూ.180కోట్లు మంజూరు చేశారు. మొదటివిడతగా కొల్లాపూర్ నుంచి నాగర్‌కర్నూల్ వరకు డబుల్‌లైన్ రోడ్డు పనులు పూర్తిచేశారు. బైపాస్ పనుల కోసం సర్వే నిర్వహించి టెండర్ల కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పనులు ప్రారంభంకాలేదు. ఆ తరువాత వంతెన ప్రాధాన్యతను మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.193కోట్లు కేటాయించింది. నిధులు కేటాయించి దాదాపుగా ఆరునెలలు దాటినా పనులు ప్రారంభంకాలేదు. ఇటీవల ప్రభుత్వాదేశానుసారం ఆర్అండ్బీ అధికారులు నూతనంగా సర్వేకోసం రూ.1.10కోట్లు కేటాయించారు. టెండర్లను కలకత్తాకు చెందిన సీడ్‌టెక్ కంపెనీ దక్కించుకుంది. వారంరోజులుగా సీడ్‌టెక్ కంపెనీ ప్రతినిధులు సోమశిల, సిద్ధేశ్వరం ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారు. పనులను పరిశీలించేందుకు ఆదివారం ఆర్అండ్బీ ఈఎన్సీ చీఫ్ రవీందర్రావు రావడంతో ఈసారి తప్పకుండా వంతెన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. తీరనున్న రవాణా కష్టాలు ఉమ్మడిరాష్ట్రంలో వంతెన నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. హైదారాబాద్ నుంచి తిరుపతి, ఆత్మకూర్తోపాటు ఇతర ప్రాంతాలకు కర్నూలు మీదుగా కాకుండా జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మీదుగా వెళ్తే దాదాపు 120 కిలోమీటర్లకు పైగా దూరభారం తగ్గుతుంది. కర్నూలు జిల్లాలోని సిమెంట్, వ్యవసాయ సరుకుల రవాణాకు బ్రిడ్జికి ప్రధానంగా దోహదపడతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉత్పత్తి చేసే ముడి సరుకులతోపాటు ఇతర రవాణా సామగ్రి, ప్రజల ప్రయాణాలకు కూడా మార్గం సుగమం అవుతుంది. ఈ అంశాలను వివరిస్తూ సోమశిల, సిద్ధేశ్వరం వంతెన నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎస్‌కు లేఖ పంపింది. వంతెన నిర్మాణం జరిగితే జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలు మరింతగా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని నందికొట్కూర్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. -
శాపాలవుతున్న ‘వరాలు’
విశాలమైన సముద్రతీరం వలన రవాణా సౌకర్యాలు, ఇతరత్రా ప్రయోజనాలు ఉంటాయి. అక్కడే ఉప్పెన, సునామీ, తుపానుల ఆపదా ఉంది. అంటే ప్రతి వరంలోనూ శాపం నిక్షిప్తమై ఉంది. శాపాలు ఇచ్చే దేవుళ్లు విమోచనా మార్గాలూ చెబుతారు. ముందు జాగ్రత్తలే ఈ విపత్తులకు శాపవిమోచనాలు! శనివారం విరుచుకుపడిన హుదూద్ పెనుతు పాను ఉత్తరాంధ్ర తీరప్రాంతాలను కుదిపేసింది. కానీ దశాబ్దం కింది పరి స్థితులతో పోల్చి చూస్తే ఈ స్థాయి తుపాను కలగజేసిన నష్టం తక్కువనే చెప్పాలి. శాస్త్ర పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ సంస్థ అనే రెండు అంశాలు ఈ మా ర్పు తెచ్చాయి. వరదలను, తుపాన్లను, భారీ వర్షాలను, భూకంపాలను, సునామీలను మనం అరికట్ట లేం. వాటి వలన జరిగే నష్టాన్ని భరించడం తప్ప మనం ఏం చేయగలం అనుకునేవారు. మనం ప్రకృ తి శక్తులను ఎదిరించలేకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకుని ఆపదను ఎదుర్కోవడానికి సిద్ధపడితే ప్రాణనష్టం, ధననష్టం నివారించవచ్చు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం పురోగమించడంతో ఈ తుపాను విషయంలో ఎక్కడ, ఎప్పుడు తాకుతుం దో కచ్చితంగా వారం రోజుల ముందే చెప్పగలిగా రు. దాంతో యంత్రాంగం సమాయత్తం కాగలిగిం ది. ముఖ్యంగా ప్రాణనష్టాన్ని చాలా వరకు నిరోధించగలిగింది. ఈ అంశం హుదూద్ విషయంలో ప్రస్తుతం రుజువైంది. అయితే ఇలాంటి ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ మాత్రం పరిమితం కావు. ప్రమాదాల నివారణే ప్రయోజనం నేను ఎన్‌డీఎంఏలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉండగా మా బృందం విధివిధానాలను రూపొందించినప్పు డు పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ప్రమాదం జరగగానే ఫ్యాక్టరీ మూసేయాలని ఆం దోళన జరిగితే ఆ మేరకు పారిశ్రామిక ప్రగతి కుం టుపడుతుంది. గ్యాస్ పైప్ బద్దలు కాగానే కోనసీమలో ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. అంటే అక్కడు న్న గ్యాస్ నిక్షేపాల ఉనికి వలస ఒనగూడే లాభాలు వదులుకోవడానికి సిద్ధపడినట్టే కదా! ఇదే విధంగా రేపు వరదల వలన కలిగే నష్టాన్ని నివారించలేకపోతే నదులున్న ప్రయోజనాన్ని పొందలేరు. వరద వేలాది, లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఇళ్లు, ఆస్తులు, పశుసంపద పోగొట్టుకునే వారిని చూస్తాం కాబట్టి వ్యక్తిగతంగా జరిగే నష్టమే మన మనసులో నాటుకుంటుంది. కానీ వరదలు ప్రభుత్వ ఆర్థిక స్థితిని కూడా కుదిపేస్తాయని చాలా మంది గ్రహించారు. 2009-10 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీ విషయంలో 5.04 శాతం పెరుగుదల సాధిస్తుందని అప్పట్లో అంచనా. కానీ 2009లో వచ్చిన వరదల కారణంగా 2010లో వచ్చిన తుపాను కారణంగా కలిగిన నష్టం రూ.13,630 కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీలో 5.14 శాతం. సమాజ అభివృద్ధిని ఒక్క తుపాను తుడిచిపెట్టేస్తోంది. ఒక్కోచోట ఒక్కోలా ప్రభావం ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు దేశ అభివృద్ధి సూచిక (జీడీపీ)లను తగ్గించి వేస్తాయి. అది దేశాన్ని బట్టి 2 నుంచి 12 శాతం వరకు ఉంటుంది. విపత్తు ప్రభావం తగ్గించడానికై ఒక రూపాయి ఖర్చు పెడితే దాని వలన 7 రూపాయలు ఆదా అవుతాయి. వ్యాధి విషయంలో టీకాలు వేయించుకుని రాకుండా చూసుకోవడం, వచ్చాక ఔషధాలు తీసుకోవడం, రోగం నెమ్మదించాక మళ్లీ త్వరగా కోలుకునేందుకు టానిక్కులు తీసుకోవడం ఎలా అయితే చే స్తామో విపత్తుల విషయంలో కూడా మనం అలాం టి విధానాలు పాటించాలి. దీన్నే సూక్ష్మంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ లేక విపత్తు నిర్వహణ అనవచ్చు. కర్మను వదిలి క్రియలోకి దిగాం గతంలో ప్రకృతి సిద్ధమైన విపత్తులు సంభవించినప్పుడు మన కర్మను నిందించుకుంటూ మామూలు పరిస్థితులు నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉండేవారం. దేశ ఆర్థిక వ్యవస్థపై, జన జీవితాలపై ఇది కలిగిస్తున్న దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం, 1999 ఆగస్టులో శ్రీ జె.సి.పంత్ అధ్యక్షతన హైపవర్ కమిటీని నియమిం చింది. ఆ తర్వాత 2001 ఫిబ్రవరిలో గుజరాత్ భూకంపం తర్వాత ప్రధాన మంత్రి చైర్మన్‌గా అఖిల భారత జాతీయ కమిటీ ఏర్పాటైంది. 2004లో సునా మీ కలిగించిన బీభత్సం తర్వాత జాతి అంతా జాగృ తమైంది. ఆస్తి, ప్రాణనష్టాలను సాధ్యమైనంత వర కు నివారించడానికి ప్రభుత్వం నడుం కట్టింది. 2005 డిసెంబర్లో విపత్తు నివారణ (డీఎం) చట్టం పాస్ చేయడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఏర్పరచి విధివిధానాలను ఏర్పరచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన నన్ను ఆ అథారిటీలో సభ్యుడిగా తీసుకున్నారు. మా సంస్థకు స్వయాన చైర్మన్‌గా ప్రధానమంత్రి, వైస్ చైర్మన్‌గా జనరల్ విజ్ ఉండేవారు. అప్పటిదాకా విపత్తు జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనేదే ముఖ్యంగా ఉండేది. ఎన్డీఎంఏ ఆవిర్భావంతో వివిధ శాఖల మధ్య సమన్వయంతో కూడిన విధానానికి మరల్చడం జరిగింది. సహాయక దళాలు ఎన్డీఎంఏ కృషి ఫలితంగా సాటిలేని మేటి సామర్థ్యంతో ‘జాతీయ విపత్తు సహాయకదళం’ (ఎన్డీఆర్ఎఫ్ - నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్) ఆవిర్భవించింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు 2008 కోసీ వరదల్లో, 2009 ఆంధ్ర, కర్ణాటక వరదల్ల్లో గణనీయమైన పాత్ర పోషించి అందరి మన్ననలు పొందా యి. దేశం నలుమూలలా ఎన్డీఆర్ఎఫ్ స్థావరాలు ఏర్పరచారు. ఎన్డీఆర్ఎఫ్కు అనుబంధంగా రాష్ట్ర స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్)లు కొన్ని రాష్ట్రాలలో ప్రారంభించబడ్డాయి. ఏయే బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలో వర్క్‌షాపు లు నిర్వహించి స్పష్టంగా నిర్ధారించడం జరిగింది. భారతదేశంలో తుపానులు మన ఉమ్మడి రాష్ర్టం వరకూ చూసుకున్నా 2009 వరదలు, 2010 లైలా తుపాను భారీ నష్టాన్ని కలి గించాయి. ఈ రెండింటి కారణంగా మొత్తం రూ.13,630 కోట్ల నష్టం వాటిల్లింది. లైలా వచ్చిన సంవత్సరంలో కలిగించిన నష్టం కారణంగా మన రాష్ట్రం అభివృద్ధి రేటు (గ్రోత్ రేటు)లో 2 శాతం తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆ మధ్య వచ్చిన పైలీన్ తుపాను భారతదేశపు తూర్పు కోస్తా అతలాకుతలం చేసింది. ఆస్తినష్టం భారీగా జరిగినా మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నా యి. ఒడిశాలో 36 మంది చనిపోగా ఆ్రంధప్రదేశ్లో ఒక్కరే మరణించారు. దీనికి కారణం జాతీయ విపత్తు నిర్వాహక బృందాలు, సహాయకదళాలు, తుపాను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండటమే! ఎన్డీఆర్ఎఫ్ దళాలు ప్రకృతి లేదా మానవుడు కలిగించే ఉత్పాతాలను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా తర్ఫీదు పొంది ఉన్నాయి. ఐఎండీ (భారత వాతావరణ శాఖ) నుంచి ప్రమాద సూచనలు రాగానే అవి రంగంలోకి దిగుతాయి. ఈ సూచనలు ఎంత ముందుగా అందితే ఈ దళాల సామర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంది. పైలీన్ విషయంలో తగిన సమయం ఉండడం వలన ఎన్డీఆర్ఎఫ్ వారు అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. రాష్ట్ర దళాల ఏర్పాటు అత్యవసరం రాష్ట్రంలోని తూర్పు కోస్తా ప్రాంతంలో ఫైలిన్‌ను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ చేసిన ప్రయత్నం, దాని విజయం చూసిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వారిని అభినందించడంతో బాటు, రాష్ట్ర స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తొలి దశలో వెయ్యి మందితో దళం ఏర్పడుతుందని, వారికి మంగళగిరిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ చేత తర్ఫీదు ఇప్పించబోతున్నామని చెప్పారు. హుదూద్ ఉదంతంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఎలా పనిచేస్తున్నాయో కళ్లకు కట్టినట్లు కనబడుతోంది కాబట్టి రాష్ట్రస్థాయిలో ఇలాంటి దళాల ఆవశ్యకత గురించి నొక్కి చెప్పనక్కరలేదు. 1993-2002 మ ద్య జరిగిన విపత్తుల వలన సంభవించిన మరణాలకంటే 2003-12 మధ్య కాలంలో సంభవించిన మరణాలు దాదాపు సగం. కానీ ఈ విజయం అతి స్వల్పమనే చెప్పాలి. కొన్ని ఆఫ్రికన్ దేశాలు కూడా మనకంటే ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయి. రాబోయే తుపానులు ఎలా ఉంటాయో తెలియవు. ఏ స్థాయి తుపాను వచ్చినా దాని నుంచి కాపాడుకోవడానికి మనం రెడీగా ఉండాలి. రాష్ట్ర స్థాయిలో సహాయక దళాలు ఏర్పాటు చేయడంతో మన బాధ్యత తీరిపోదు. సరైన తర్ఫీదు, ఆర్థిక సహా యం, స్థానికులకు అవగాహన కల్పించడం, పునరావాస కల్పన వంటి అనేక కార్యక్రమాలను పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి చర్యలను చిత్తశుద్ధితో అమలుచేసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలను తలచుకుని మనం బెదరనక్కరలేదు. ఈ దిశగా ముందుకు సాగేందుకు హుదూద్ తుపాను ప్రభుత్వంలో కదలిక తెస్తుందని ఆశిద్దాం. (వ్యాసకర్త ఏపీ పూర్వ ప్రభుత్వ కార్యదర్శి, ఎన్డీఎంఏ సభ్యుడు) డా॥ మోహన్ కందా -
కొత్త బడి గంటలు
- ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభం - అమలు కావల్సింది రాష్ట్ర పరిధి పాఠశాలల్లోనే.. మంచిర్యాల సిటీ : కేంద్ర ప్రభుత్వం 2009లో అమలు చేసిన విద్యాహక్కు చట్ట ప్రకారం బడిగంటలు మారనున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనివేళలు ఒక్కో రకంగా ఉన్నాయి. కొత్తగా అన్నిపాఠశాలలు ఒకే సమయానికి ప్రారంభమై ఒకే సమయానికి విద్యార్థులను విడుదల చేయాలనే నిబంధనలు రాబోతున్నాయి. ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు విద్యార్థులను విద్యాహక్కు చట్టం ప్రకారం విడుదల చేయాలి. ఈ సవృయాన్ని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని కేంద్రీయ విద్యాలయం, నవోదయ, ఆదర్శ, సాంఘీక సంక్షేమ, గురుకుల పాఠశాలలతోపాటృ ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్నాయి. కేవలం రాష్ట్రప్రభుత్వం పరిధిలోని మండల, జిల్లా పరిషత్ పాఠశాలలు అమలు చేయడం లేదు. తరగతుల నిర్వహణ సమయాల్లో మార్పులు జరగాల్సి ఉన్నప్పటికీ నేటికి విద్యాహక్కు నిబంధనలు అమలు కావడం లేదు. బడి వేళలను మార్చాల్సిందే అంటూ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తుండగా, మరికొన్ని సమర్థిస్తున్నాయి. బోధన ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తరగతులు బోధించడానికి రోజుకు ఏడున్నర గంటల చొప్పున వారానికి 45 గంటల సమయాన్ని కేటాయించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి ఏడాదికి 800 గంటలు, ఉన్నత పాఠశాలల్లో ఒక 1000 గంటలు కేటాయించాలని చట్టం చెబుతోంది. ఇబ్బందులు కొత్త సమయసారిణి అమలు అయితే విద్యార్థులకు మేలు జరుగుతుంది. కొత్త బడిగంటల ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఏడున్నర గంటలు పనిచేయనున్నాయి. ఉపాధ్యాయులు సమయాన్ని పాటించినచో విద్యార్థులకు మేలు చేసినవారవుతారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉండాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసినపుడే కొత్త బడి గంటలకు న్యాయం జరుగుతుంది. ప్రధానంగా రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలి. అన్ని రూట్లకు బస్ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వం అనుకున్నట్లు లక్ష్యం నెరవేరుతుంది. కొన్ని రూట్లలో కార్పొరేట్ పాఠశాలు బస్ సౌకర్యం కల్పిస్తున్నాయి. రహదారులు మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు కనీసం ఆర్టీసీ బస్ వేయిస్తే సులువవుతుంది. -
కొత్త డిపోలు ఏర్పాటయ్యేనా!
హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలోని సగం పల్లెలకు, తండాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎక్కువ. విద్యార్థులు అధికంగా బస్సులను ఆశ్రయిస్తారు. కానీ అరకొర బస్సుల కారణంగా వారంతా ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లాలో కొన్ని చోట్ల డిపోలను నిర్మిస్తామని గతంలో నాయకులు హామీలిచ్చారు. కానీ వాటిల్లో ఏవీ నెరవేర్చలేదు. శరవేగంగా పెరుగుతున్న జిల్లా జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడటం లేదు. తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో రవాణా వ్యవస్థ మెరుగవుతుందని ప్రజలు ఆశపడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతారని, డొక్కు బస్సుల స్థానంలో కొత్తవి ఇస్తారని, బస్టాండ్లను ఆధునికీకరిస్తారని, కొత్త డిపోలను ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో జిల్లా ప్రజలు రవాణా సౌకర్యాలు మెరుగు పడతాయని ఆశపడుతున్నారు. జిల్లాలో సుమారు 150కిపైగా ఉన్నతవిద్యా కళాశాలలున్నాయి. వీటితోపాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులు నిత్యం పలు ప్రాంతాలనుంచి రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు 30వేలకు పైగా విద్యార్థులు నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తారని అంచనా. కానీ ప్రస్తుతం జిల్లాలో అరకొర బస్సులే తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో బస్సు డిపోలను సైతం నిర్మించాల్సి ఉంది. ఉన్న బస్టాండ్లలో అనేక సమస్యలున్నాయి. కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉండదు. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. చిన్నగా ఉన్న బస్టాండ్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. దామరగిద్ద బస్‌డిపో నిర్మాణమెప్పుడో.. చేవెళ్ల, పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు అధికంగా ఉన్నాయి. దీంతో బస్సుల అవసరం కూడా అధికమే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2012 డిసెంబరులో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేవెళ్లకు ఆరు కిలోమీటర్ల దూరంలోని దామరగిద్ద వద్ద బస్‌డిపో నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. కానీ అక్కడ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ డిపో నిర్మాణానికి రెవెన్యూ అధికారులు రైతుల నంచి 8 ఎకరాలు తీసుకుని ఆర్టీసీకి ఇచ్చేశారు. కానీ రైతులకు మాత్రం ఇప్పటికీ పైసా పరిహారం ఇవ్వలేదు. ఇదే రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొయినాబాద్, శంకర్‌పల్లిలలో కూడా బస్‌డిపోలు ఏర్పాటుచేస్తామని నాయకులు హామీలిచ్చారు. మొయినాబాద్ సమీపంలో డిపో నిర్మాణానికి ముర్తుజగూడ వద్ద 18 ఎకరాల స్థలాన్ని చూశారు. ఆ పనులు ముందుకు సాగడం లేదు. బస్స్టేషన్లలో సమస్యలు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్స్టేషన్ల విస్తరణ చేపట్టాల్సి ఉన్నా.. ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే చేవెళ్ల బస్‌స్టేషన్‌లో అనేక సమస్యలున్నాయి. 1969లో అప్పటి సీఎం డాక్టర్. మర్రి చెన్నారెడ్డి కృషితో ఆరు ఫ్లాట్‌ఫాంల బస్‌స్టేషన్ నిర్మాణమైంది. అప్పటి నుంచి ఒక్క ప్లాట్‌ఫాంను విస్తరించలేదు. తాగడానికి నీళ్లుండవు. కంపుకొడుతున్న మూత్రశాలలే దిక్కు. అదే విధంగా షాబాద్, నాగరగూడ ప్రయాణ ప్రాంగణాలు చిన్నవిగా, సౌకర్యాలలేమితో ఉన్నాయి. నిత్యం వందలాది మంది విద్యార్థులు కళాశాలలకు వచ్చిపోతున్నా మొయినాబాద్‌లో కనీసం బస్‌స్టేషన్ కూడా లేదు. ఖానాపూర్, చిట్టెంపల్లి, కేతిరెడ్డిపల్లి, తదితర బస్‌స్టేజీల వద్ద బస్షెల్టర్లు నిర్మించాల్సి ఉంది. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్పల్లి, మొయినాబాద్‌లలో డిపోలు నిర్మిస్తామని గత పాలకులు హామీలిచ్చారు. కానీ నెరవేర్చలేదు. ఘట్కేసర్ మండలం కొండాపూర్‌లో డిపో నిర్మాణానికి ఆరు ఎకరాల భూమిని కేటాయించారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మహేశ్వరంలో బస్‌డిపో ప్రారంభమైనా సరిపోను బస్సులను కేటాయించలేదు. ఇచ్చిన కొన్ని కూడా డొక్కువే. మేడ్చల్ నియోజకవర్గం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు 2012లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నేటికీ పనులు చేపట్టలేదు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గగన్‌పహాడ్‌లో ఆర్టీసీ డిపో నిర్మాణానికి అధికారులు భూసేకరణ కోసం అన్వేషించారు. ఇందిరా ప్రియదర్శిని సొసైటీలో భూమిని అధికారులు పరిశీలించినా ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. -
మన ఆధ్యాత్మిక రాజధాని
కాశీకి ఇప్పుడు మన రాష్ట్రం నుంచి రైలులో వెళితే (హైదరాబాద్-కాశీకి రైలు మార్గం 1,230 కి.మీ.)ఒకటిన్నరరోజులో చేరుకోవచ్చు. అదే విమానంలో అయితే 3-4 గంటల్లో వెళ్లిపోవచ్చు. రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో కాశీకి వెళ్లి రావడం అంటే పొరుగూరు వెళ్లి వచ్చినంత సులువు. కాని ఒకప్పుడు.. అంటే రెండుమూడు వందల ఏళ్ల క్రితం... కాలినడకన ప్రయాణం కాశీకి పోవటం అంటే కాటికిపోవటంతో సమానమే అనేవారు. అంటే ఆ రోజుల్లో భద్రతలేని కారణంగా కాశీ వెళ్లినవారు క్షేమంగా ఇంటికి చేరేవారు కారు. కానీ, కాశీ పుణ్యరాశి. వరుణ-అసి నదుల సంగమస్థలి. భారతీయులకు అత్యంత పవిత్ర తీర్థస్థానం. కాబట్టి కాశీ వెళ్లి తీరాల్సిందే! కాని వాహనసదుపాయం లేని రోజులవి. కాలినడకనే ప్రయాణం. కొండకోనలు, నదీప్రవాహాలు, దుర్భేద్యమైన అడవులు, క్రూరమృగాలు, దారిదోపిడీలు... అన్నింటినీ దాటుకొని కాశీ చేరేసరికి ఎన్నో గండాలు. అన్నదాన సత్రాలలో భోజనాలు.. లేదంటే ఉపవాసాలు... అడవుల గుండా ప్రయాణించేటప్పుడు కాయగసరే మహాప్రసాదాలు. అందుకే జీవితంలో అన్ని బాధ్యత లూ తీరిన 60 ఏళ్లకు పైబడినవారే కాశీ ప్రయాణమయ్యేవారు. 1800 ప్రాంతంలో! ఏనుగుల వీరాస్వామయ్య, ఆయన బంధుగణం, పరిజను లు సుమారు వందమందితో కలిసి మద్రాసు నుండి బయలుదేరి తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాద్, నాగపూర్, ప్రయాగల మీదుగా కాశీ వెళ్లారు. అప్పటికి రోడ్లు కూడా సరిగా లేవు. ప్రయాణం ఎక్కువగా పల్లకీలు మోసే బోయీల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. యాత్రాఫలాన్ని తనకొకడికే పరిమితం చేసుకోకుండా 40 బిందెల గంగాజలాన్ని 10 గుర్రాల మీద చెన్నైకి పంపించే ఏర్పాటు చేయించాడట. 15 నెలలు సాగిన ఆ ప్రయాణపు రోజులను ‘కాశీయాత్రా చరిత్ర’గా గ్రంథస్థం చేశారు. ఆ తరువాతి సంగతులకొస్తే- ఇప్పటికి సరిగ్గా వందేళ క్రితం రచయిత చెళ్లపిళ్లవెంకటశాస్త్రీ కాశీ వెళ్లిన తన అనుభవాలను పుస్తకంగా తీసుకొచ్చారు. ఐతే ఈయన కాలానికి పరిస్థితులలో మార్పులు వచ్చాయి. బ్రిటీషువారి హయంలో రైలు-పడవలు వంటి ప్రయాణ సాధనాలు ఉన్నాయి. గంగానదికి వరదలు వస్తే బల్లకట్టువేసి బండ్లు దాటించేవారనీ, ఎద్దు లు నడవకపోతే బండివాడే కాడి భుజానికి ఎత్తుకునేవాడ నీ, మిగతావారు కాలినడకన సాగేవారని.. తెలియజేశారు. తిరిగొస్తే పండగే! కాశీ వెళ్లిన వారు తిరిగి ఊరు చేరుకున్నారంటే.. వారిని సాక్షాత్తు భగవత్స్వరూపులుగా భావించేవారు. మేళతాళాలతో ఎదురెళ్లి, ఇంటికి తీసుకెళ్లి, పెద్ద పండగ చేసుకునేవారు. వెళ్లిన వారు తమ ప్రయాణపు అనుభవాలను చెబుతుంటే ఆ అనుభూతిలో తామూ ప్రయాణించేవారు. ఆ రోజుల్లో కాశీ చేరాలనే సంకల్పం రైలు, విమాన ప్రయాణాలను మించిన ధైర్యాన్ని కలిగించేది. ఇప్పటికీ కొంతమంది కాలినడకన కాశీ చేరేవారున్నారు. అయితే నేడు వారి ప్రయాణానికి భరోసానిచ్చే అనేక మార్గాలున్నాయి. - నిర్మలారెడ్డి