tri
-
కేంద్ర కార్యాలయాల్లో మరాఠీ తప్పనిసరి!
సాక్షి, ముంబై : దేశంలో ప్రస్తుతం ప్రాంతీయోద్యమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రభుత్వం కార్యాలయాల్లో ప్రాంతీయ భాషను తప్పనిరి చేస్తూ ఆదేశాలు జరీ చేశాయి. తాజాగా ఈ కోవలోకి మహారాష్ట్ర వచ్చి చేరింది. రాష్ట్రంలోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కార్యయాల్లో ఇంగ్లీష్, హిందీతో పాటు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ సేవలు, పోస్టాఫీసులు, పెట్రోలియం, గ్యాస్, రైలు, టెలికమ్యూనికేషన్ కార్యాలయాల్లో మరాఠీని తప్పకుండా ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి త్రిభాషా సూత్రానికి అనుకుగణంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా వుండగా.. ఇప్పటికే మహారాష్ట్రలో మరాఠీ అధికార భాషగా ఉన్న విషయం తెలిసిందే. -
గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్న అధికారులు
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు ఘోరంగా ఉల్లంఘించబడుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ అన్నారు. గురువారం స్థానిక ఉద్దరాజు భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాలు ఉల్లంఘిస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గిరిజనుల భూములకు రక్షణ కల్పించే 1/70 చట్టం, గ్రామసభ తీర్మానాలకు అధికారాలున్న పెసా చట్టం, పోడు భూములకు హక్కులు కల్పించే అటవీహక్కుల గుర్తింపు చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘించబడుతున్నాయన్నారు. ఫలితంగా గిరిజనుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూములు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు పేరుతో లాక్కొని తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రవి పాల్గొన్నారు.