Tribal issues
-
‘గిరి’ రహదారులకు మోక్షం
మెళియాపుట్టి: ‘గిరి’ గ్రామాల రహదారుల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో ఉత్తరాంధ్రలోనే అత్యంత ఎత్తయిన గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాటికి దశాబ్దాలుగా రహదారి సౌకర్యాలు లేవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించి, గిరి శిఖర గ్రామాలను సందర్శించి వారి సమస్యలు, కష్టాలను తెలుసుకున్నారు. రహదారి కష్టాలు తీరితే అన్ని సౌకర్యాలు వారికి అందుతాయనే ఆలోచన చేసి, విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిశిఖర గ్రామమైన చందనగిరి గ్రామానికి (రూ.1.25 కోట్లతో 3.10 కి.మీ), హడ్డివాడ (రూ.1.75 కోట్లతో 2.3 కి.మీ), కేరాసింగి (రూ.92 లక్షలతో 1.5 కి.మీ), కేరాసింగిగూడ (రూ.1.5కోట్లతో 2.5 కి.మీ), మొత్తంగా రూ.5.42 కోట్లతో గిరి శిఖర గ్రామాలకు వెళ్లే రహదారి పనులకు నిధులు తీసుకువచ్చి పనులు సైతం వేగవంతం చేశారు. ప్రస్తుతం హడ్డివాడ గ్రామానికి రహదారి పూర్తి కాగా.. మిగిలిన గ్రామాలకు రహదారి పనులు చివరి దశలో ఉన్నాయి. గిరిజనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే గౌరవం లభించిందని, పోడుపట్టాలు అందుకున్నామని, రైతుభరోసాతోపాటుగా అన్ని పథకాలు అందుతున్నాయని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ కొండలపైనుంచి కిందికి దిగి, రేషన్ సరుకులు మోసుకుంటూ వెళ్లిన రోజులు మర్చిపోయేలా చేసి కొండలపైకి నేడు ట్రాక్టర్‌పై సరుకులు తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే రహదారి నిర్మాణాలు పూర్తిచేసి గిరిజనుల కష్టాలకు తెరదించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. గత తెలుగుదేశం పాలకులు గిరిజనులకు చేసిందేమీ లేకపోవడంతో జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలనను చూసి ఓర్వలేక విమర్శలకే పరిమితమయ్యారు. ఆనందంగా ఉంది గడప గడపకూ వెళ్లిన సమయంలో రహదారులు చూసి బాధపడ్డాను. వారి గ్రామాలకు వెళ్లి కష్టాలను చూశాను. వారి బతుకులు బాగుచేయాలని ఆలోచించి జగనన్న దృష్టికి సమస్యను తీసుకువెళ్లాను. గిరిజనుల సమస్య అనగానే ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. రహదారుల మంజూరుతో ప్రస్తుతం గిరిజనుల కష్టాలు తీరనున్నందుకు సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేగా వారికష్టాలు తీర్చడం చాలా ఆనందంగా ఉంది. గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసిన వ్యక్తి జగనన్న కాబట్టే ఇది సాధ్యమైంది. – రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు రహదారి కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించాం. ఎంతో మంది చుట్టూ తిరిగాం. కానీ మా స్థితి మారలేదు. మహిళా ఎమ్మెల్యే అయినా.. రెడ్డి శాంతమ్మ కాలినడకన మా గ్రామానికి వచ్చి ‘గడప గడపకూ కార్యక్రమం’ నిర్వహించారు. మా సమస్యలు చెప్పుకొన్నాం. అన్నీ చేస్తానని మాటిచ్చారు. రహదారి మంజూరు చేశారు. రోడ్డు పూర్తి కావడంతో మాకష్టాలు తీరాయి. సంతోషంగా ఉంది. – చందనగిరి పోలయ్య, హడ్డివాడ గ్రామం సంతోషంగా ఉంది జగనన్నను పాదయాత్రలో కలిసి గిరిజనుల కష్టాలను వివరించాను. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాన్నారు. ఎమ్మెల్యే దృష్టికి గిరిజనుల సమస్యలు తీసుకెళ్లా.. ఆమె స్పందించారు. కృషికి ఫలితం లభించింది. ఎంతోకాలంగా కొండప్రాంతాలకు సరైన రహదారులు లేక ఇబ్బందులు పడ్డాం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మా గిరిజనుల కష్టాలు తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జెడ్పీటీసీగానే కాకుండా నేను కూడా గిరిజనుల్లో ఒకడ్ని కావడం ఆనందంగా ఉంది. సీఎం జగన్, ఎమ్మెల్యే రెడ్డి శాంతికి రుణపడి ఉంటాను. – గూడ ఎండయ్య, జెడ్పీటీసీ సభ్యుడు, మెళియాపుట్టి మండలం -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజనుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం నిర్వహించిన కుమురంభీమ్ 82వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కుమురం సూరు, భీమ్ స్మారక విగ్రహాలకు, సమాధి వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన గిరిజన దర్బార్‌లో మాట్లాడారు. అటవీ భూములు సాగు చేస్తున్నవారిలో అర్హులను గుర్తించి పట్టాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టు కొట్టివేసిన జీవో 3ను న్యాయపరంగా పరిష్కరిస్తామని తెలిపారు. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. జిల్లాలోని కుమురంభీమ్, వట్టివాగు, చలిమెల తదితర ప్రాజెక్టుల నీటిని పంటచేలకు మళ్లిస్తామని హామీనిచ్చారు. వంద గిరిజన దేవాలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. జోడేఘాట్ వరకు రోడ్డు సౌకర్యం, స్థానికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ఆదివాసీలు వలస వచ్చిన వారితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని, జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు రాహుల్‌రాజ్, సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు, కుమురంభీమ్ మనవడు సోనేరావు, పాల్గొన్నారు. రద్దైన కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ప్రకారం జోడేఘాట్‌కు మంత్రి కేటీఆర్ వస్తారని భారీ ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దవడంతో అక్కడున్నవారంతా నిరుత్సాహపడ్డారు. రూ.15 కోట్లతో ఆసిఫాబాద్ పట్టణ అభివృద్ధి శిలాఫలకం, కలెక్టర్ రాహుల్‌రాజ్ కుమురం భీమ్‌పై రాసిన పాట ఆల్బం సీడీని మంత్రి ఆవిష్కరించారు. -
గిరిజన సమస్యలపై సీఎంకు చిత్తశుద్ధి లేదు
కవాడిగూడ (హైదరాబాద్): రాష్ట్రంలోని గిరిజనుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న కొమురం భీం విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల పట్ల వివక్ష చూపుతోందన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే గిరిజన రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే కేంద్రాన్ని ఒప్పించి అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. ఆదివాసీలను ఓట్ల కోసం వాడుకుని మోసం చేశారన్నారు. జీవో నంబర్ 3 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100 శాతం ఉద్యోగాలు ఆదివాసీలకే దక్కాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, మాజీ ఎంపీ అమర్‌సింగ్, మాజీ మంత్రి బాబూమోహన్, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రదీప్‌కుమార్, దేవేందర్, బంగారు శ్రుతి, పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కుతాడి కుమార్, లోకిని రాజులు హాజరై కొమురం భీం విగ్రహానికి నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్‌పై ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
'రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించండి'
న్యూఢిల్లీ: ఆదివాసీల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివాసీల అస్తిత్వ పోరాట సభను నిర్వహించారు. ముఖ్యంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడం, పోడు భూములకు పట్టాలు కల్పించడం, ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ ధ్రువ పత్రాలను అరికట్టాలనే డిమాండ్లతో ఈ సభ జరిగింది. ఈ సభలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఆదివాసీల హక్కులను కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. 1976 ఎమర్జెన్సీ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఆదివాసీలు నష్ట పోతున్నారని ఆయన పేర్కొన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితాలో కలపడం వలన ఆదివాసీ యువత విద్య, ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్లలో 97శాతం లంబాడాలే అనుభవిస్తున్నారని బీజేపీ ఎంసీ సోయంబాపూరావు అన్నారు రాజ్యాంగలోని ఆర్టికల్ 342 ప్రకారం చట్టబద్దత లేని సుగాలీలు, లంబాడి కులాలను తెలంగాణ రాష్ట్రంలో ST జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల కోసం వివిధ రాష్ట్రాల నుంచి లంబాడాలు తెలంగాణకి వలస వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అప్పట్లో లక్షా ఇరవై వేలు ఉన్న జనాభా ఎప్పుడు 20 లక్షలకు చేరుకుందన్న విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలన్నారు. లంబాడాల వల్ల ఆదివాసీలు భూములు, ఉద్యోగాలు, విద్యా అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఆదివాసుల హక్కుల కోసం పార్లమెంటులో రాజీలేని పోరాటం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ బహిరంగ సభకు ఆదివాసీ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆదివాసీ సంఘాల నాయకులు, తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ఆయా ప్రాంతాల ఆదివాసీ గిరిజనులు తరలి వచ్చారు. . -
సమస్యలపై పార్టీలకతీతంగా పోరాడాలి
హాలియా (నాగార్జునసాగర్) : రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల సమస్యలపై పార్టీలకతీతంగా పోరాడాలని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ కోరారు. మంగళవారం స్థానిక లచ్చిరాంనాయక్ కాంప్లెక్స్‌లో పంఘం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంఘం గిరిజనుల హక్కుల కోసం పోరాడుతుందని విద్యా, ఉద్యోగాల్లో రావల్సిన వాటాపై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అనంతరం హాలియా మార్కెట్ చైర్మన్ ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ రవినాయక్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ధనావత్ ధన్‌సింగ్‌నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాణావత్ బాబూరావ్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆంగోతు భగవాన్‌నాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు కేతావత్ భిక్షానాయక్, ధీరావత్ స్కైలాబ్‌నాయక్, హేమ్లానాయక్, స్వచ్ఛభారత్ పురస్కార అవార్డు గ్రహీత వడిత్యా వెంకట్రాంనాయక్, పాండునాయక్, బాలునాయక్, సైదానాయక్, నాగేందర్‌నాయక్, జవహర్‌నాయక్, దీప్లానాయక్ పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను నియమించాలి
భీమవరం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో దళితులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను, ఇతర సభ్యులను నియమించాలని దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు గంటా సుందరకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక 11వ వార్డులో బుధవారం నిర్వహించిన దళిత ఐక్య వేదిక భీమవరం శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా దళతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 68 ఏళ్ళు గడుస్తున్నా రాజ్యాంగ పరంగా దళితులకు హక్కులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయన్నారు. దళిత హక్కుల సాధనకోసం నేటీకీ పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా జిల్లాకు ఒక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దళితుల సమస్యలపై మార్చి 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, వివిధ ఆందోళనా కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో గొల్లపల్లి మాణిక్యాలరావు, పాలపర్తి జోనా, యాళ్ళ ప్రసాద్‌కుమార్, పిల్లి మాణిక్యాలరావు, గోసాల కుమార్, కాటూరి విజయశేఖర్, దిడ్ల ఏసు, గూడపాటి యోహాన్, కె.రమేష్, బి.క్రాంతికుమార్, మోకా శాంతరాజు, కాటుక రమేష్, మద్దిరాల పండు, పత్తి సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన సమస్యలపై స్పందించాలి
శాసనసభలో వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట: గిరిజన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తాను మాట్లాడిన అంశాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన ఏమన్నారంటే... ‘‘ప్రజాసమస్యలను శుక్రవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశాను. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించాను. రైతాంగానికి పగటి వేళ ఏడు గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశాను. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూములు అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తారంగా ఉన్నాయని చెప్పాను. గిరిజన యూనివర్సిటీని సత్వరమే మంజూరు చేయూలని కోరాను. నియోజకవర్గంలోని పెదవాగు, అబ్బుగూడెం, మూకమామిడి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి మరమ్మతులు చేయించి ఆయకట్టును పటిష్టపరచాలని కోరాను. నియోజకవర్గంలోని రహదారులను మెరుగుపరచాలని, రైతులకు డ్రిప్ పరికరాలు సరఫరా చేయాలని, గతంలో జరిగిన కుంభకోణాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాను. ఎన్నికలకు ముందు నిర్మించుకున్న కాలనీ ఇళ్లకు బిల్లులు నిలిచిపోయాయని చెప్పాను. వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశాను. పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, సహాయక సిబ్బందికి గౌరవ వేతనాలు పెంచాలని కోరాను’’ అని చెప్పారు. -
‘ముంపు’పై ఉద్యమిస్తాం
ఖమ్మం జడ్పీసెంటర్ : పోలవరం ముంపునకు గురవుతున్న గిరిజనుల సమస్యలపై ఉద్యమిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివాసీల ఆందోళనలకు మద్దతు తెలపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పోలవరం విషయంలో ప్రభుత్వపరంగా ఒక రకంగా, టీఆర్ఎస్గా మరో విధంగా వ్యవహరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే జిల్లా ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఎంత సత్యమో... ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది కూడా అంతే నిజమని, అయితే ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేస్తామని చెప్పారు. పార్లమెంట్లో గిరిజన ప్రజా ప్రతినిధులందరినీ కలుపుకుని పోరాడుతామని, ఈ విషయంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. అన్యాయాన్ని ఎదిరించే సత్తా జర్నలిస్టులకే... అన్యాయాన్ని ఎదిరించేందుకు ఎవరినైనా ప్రశ్నించే సత్తా జర్నలిస్టులకే ఉందని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం టీజేఎఫ్ ఏర్పడిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజేగా అవతరించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని, రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా వారి భాగస్వామ్యం అవసరమని అన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉద్యమాన్ని నడిపించింది జర్నలిస్టులేనని, రాజకీయ పక్షాలు రాకపోవడం, ఇక్కడ టీఆర్ఎస్ బలంగా లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను మెరుగుపరచడంతోపాటు జిల్లా కేంద్రంలో కార్పొరేట్ వైద్యశాలలను ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో పాత్రికేయులకు ఇచ్చిన ఇళ్లస్థలాలను ఇతర శాఖలకు కేటాయించడంపై కలెక్టర్‌తో మాట్లాడతానని, ఇక్కడ పరిష్కారం కాకపోతే సీఎంతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. విద్యుత్ సమస్యపై నేడు కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారని, ఈ సంక్షోభానికి కారణం ఆ పార్టీలేనని ఆరోపించారు. ప్రెస్ అకాడమి చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ కీలక భూమిక పోషించిందన్నారు. తెలంగాణ సాధనకు జర్నలిస్టులు అనేక ఉద్యమాలు చేశారని, ఇప్పుడు రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వృత్తి పరంగా చొచ్చుకుని వెళ్తూ.. దేశ ప్రధానమంత్రితో కూడా మాట్లాడే పాత్రికేయుల జీవన ప్రమాణాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు రూ.10 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసిందని, వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇప్పించాలని మంత్రిని కోరారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ వాదం, ఉద్యమం నుంచి టీయూడబ్ల్యూజే పుట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ వెన్నుతట్టి నడిపించింది జర్నలిస్టులేనన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అనేక మంది పోరాటాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. ఖమ్మంలో జర్నలిస్టులకు కేటాయించిన 10 ఎకరాలకు సంబంధించిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. జర్నలిస్టులు చేసే ఉద్యమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను తెలంగాణలో ఉంచేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు తాను వ్యతిరేకించామని గుర్తుచేశారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, గిరిజనులను ముంచే పోలవరం విషయంలో న్యాయపరమైన పోరాటం సాగిస్తామని చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణానికి జర్నలిస్టులు పాటుపడాలన్నారు. జర్నలిస్టుల శ్రేయస్సుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనేక ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనైనా వారి సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ జర్నలిస్టుల జీవితాల వెనుక చీకట్లు ఉన్నాయని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల కంటే తక్కువగా జర్నలిస్టుల జీవన ప్రమాణాలు ఉన్నాయన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల కల్యాణ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. క్రాంతికిరణ్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం.వి.రమణ, రాష్ట్ర నాయకులు పల్లె రవి, పీవీ శ్రీనివాస్, రమేశ్హజారీ, వర్థెల్లి వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, అవ్వారి భాస్కర్, కిరణ్, యోగానంద్, యుగంధర్, రాజు, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్, నాగేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రవీందర్, పి.శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, నాగేందర్, ఖదీర్, అన్సార్పాషా, రామారావు, కోటేశ్వరరావు, అప్పారావు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి’
పార్వతీపురం : గిరిజనుల సమస్యలను పరిష్కరించి, వారికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కురుపాం ఎమ్మెల్యే పా ముల పుష్పశ్రీవాణి కోరారు. శనివారం ఆమె ఐటీడీఏ కార్యాలయంలో పీఓ రజత్‌కుమార్ సైనీతో సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురం మండలంలో జూనియర్ కళాశాలకు కొత్త భవనంలో వసతి కల్పించాలన్నారు. అలాగే కొమరాడ మండలంలోని రావికోన గ్రామం ఏ మాత్రం వర్షం పడినా...ముంపునకు గురవుతోందని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. గోర్జిపాడులో చెక్‌డ్యామ్ నిర్మిస్తే సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గిరి జన గ్రామాల నుంచి మెయిన్ రోడ్డు జంక్షన్లలో బస్ షెల్టర్ల నిర్మించాలని తెలిపారు. అర్నాడ రోడ్డు గిరిజన ప్రాంతాలకు అనుసంధానం చేయాల న్నారు. అనంతరం ఆమె డీడీ శ్రీనివాసరావుతో పాటు డిప్యూటీ డీఎంహెచ్ఓతోనూ సమావేశమయ్యూరు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, చినమేరంగి సర్పంచ్ శత్రుచర్ల పరీక్షిత్‌రాజు ఉన్నారు.