సమస్యలు పరిష్కరించండి’
పార్వతీపురం : గిరిజనుల సమస్యలను పరిష్కరించి, వారికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కురుపాం ఎమ్మెల్యే పా ముల పుష్పశ్రీవాణి కోరారు. శనివారం ఆమె ఐటీడీఏ కార్యాలయంలో పీఓ రజత్‌కుమార్ సైనీతో సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురం మండలంలో జూనియర్ కళాశాలకు కొత్త భవనంలో వసతి కల్పించాలన్నారు. అలాగే కొమరాడ మండలంలోని రావికోన గ్రామం ఏ మాత్రం వర్షం పడినా...ముంపునకు గురవుతోందని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. గోర్జిపాడులో చెక్‌డ్యామ్ నిర్మిస్తే సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గిరి జన గ్రామాల నుంచి మెయిన్ రోడ్డు జంక్షన్‌లలో బస్ షెల్టర్ల నిర్మించాలని తెలిపారు. అర్నాడ రోడ్డు గిరిజన ప్రాంతాలకు అనుసంధానం చేయాల న్నారు. అనంతరం ఆమె డీడీ శ్రీనివాసరావుతో పాటు డిప్యూటీ డీఎంహెచ్‌ఓతోనూ సమావేశమయ్యూరు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖరరాజు, చినమేరంగి సర్పంచ్ శత్రుచర్ల పరీక్షిత్‌రాజు ఉన్నారు.