Tripadvisor
-
ప్రపంచంలోనే నంబర్‌వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా?
ముంబై: హోటల్స్ ర్యాంకింగ్‌కు సంబంధించిన ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ (2023)లో జైపూర్‌కి చెందిన రాంబాగ్ ప్యాలెస్ ప్రపంచంలోనే నంబర్ వన్ హోటల్‌గా నిల్చింది. 1835 నాటి ఈ ప్యాలెస్‌ను ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) హోటల్‌గా తీర్చిదిద్ది, నిర్వహిస్తోంది. దీన్ని ’జ్యుయల్ ఆఫ్ జైపూర్’గా కూడా వ్యవహరిస్తుంటారు. ట్రావెల్ సైట్ ట్రిప్అడ్వైజర్ వార్షికంగా ప్రకటించే.. పర్యాటకులు మెచ్చిన హోటల్స్ జాబితాలో మాల్దీవులకు చెందిన ఓజెన్ రిజర్వ్ బాలిఫుషి, బ్రెజిల్‌లోని హోటల్ కోలీన్ డి ఫ్రాన్స్ రెండు, మూడో స్థానాల్లో నిల్చాయి. తమ పోర్టల్‌లో నమోదైన 12 నెలల డేటా (2022 జనవరి 1 నుంచి – డిసెంబర్ 31 వరకు) విశ్లేషణ ఆధారంగా ట్రిప్అడ్వైజర్ ఈ ర్యాంకులు ఇచ్చింది. భారత్‌లోని టాప్ 10 హోటల్స్ ఇవే.. రాంబాగ్ ప్యాలెస్ - జైపూర్ తాజ్ కృష్ణ - హైదరాబాద్ వెస్టిన్ గోవా - గోవా బ్లాంకెట్ హోటల్ అండ్ స్పా - పల్లివాసల్ చండీస్ విండీ వుడ్స్ - చితిరపురం జేడబ్ల్యూ మారియట్ హోటల్ పూణే - పూణే షెరటన్ గ్రాండ్ చెన్నై రిసార్ట్ అండ్ స్పా - చెన్నై కోర్ట్ యార్డ్ అమృత్సర్ - అమృత్సర్ జేడబ్ల్యూ మారియట్ హోటల్ బెంగళూరు - బెంగళూరు లీలా ప్యాలెస్ ఉదయపూర్ - ఉదయపూర్ ఇదీ చదవండి: ఎల్ఐసీకి మంచి రోజులు.. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులకు పెరిగిన విలువ -
రివ్యూలు తారుమారు : దిగ్గజ హోటల్‌కు భారీ ఫైన్
ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, ప్రాంతం గురించి కానీ, సినిమాల గురించి కానీ తెలుసుకోవాలంటే... ముందస్తుగా రివ్యూల బాట పడతాం. వాటి గురించి రివ్యూల్లో ఏం చెప్పారా? అని వెతుకులాట మీద వెతుకులాట చేపడతాం. అసలకే ఖర్చు పెట్టి వెళ్తాం. అది బాగోపోతే ఆ ఖర్చంతా వృథా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటికే వాటి అనుభవాలను పొందిన వారు, సందర్శకులు వాటి గురించి ప్రముఖ వెబ్సైట్లలో తమ తమ రివ్యూలు ఇస్తూ ఉంటారు. వీటిని చదివే చాలా మంది నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఈ రివ్యూల్లో తమ గురించి ఎలాంటి తప్పుడు రివ్యూలు రాకుండా.. మంచిగా మాత్రమే స్పందించేలా కొన్ని యజమాన సంస్థలు జాగ్రత్త పడుతూ ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజం హోటల్ ఇదే పని చేసి, భారీ జరిమానాను ఎదుర్కొంది. ఎక్కువ మంది సందర్శించే పాపులర్ ట్రిప్అడ్వయిజర్ వెబ్సైట్లో తమ గురించి తప్పుడు రివ్యూలు రాకుండా.. ఆస్ట్రేలియా అతిపెద్ద హోటల్ మెరిటన్ ప్రాపర్టీ సర్వీసులు అక్రమాలకు పాల్పడింది. దీంతో వినియోగదారులు ఇచ్చే ఫిర్యాదులేమీ రివ్యూల్లో నమోదు కాలేదు. ఇలా మోసపూరితంగా.. ట్రిప్అడ్వయిజరీలో మెరిటన్ రివ్యూలను తారుమారు చేస్తుందని తేల్చిన ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు.. 2.2 మిలియన్ డాలర్లు అంటే 15 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2014 నవంబర్ నుంచి 2015 అక్టోబర్ మధ్యకాలంలో మెరిటన్ ఈ తప్పుడు కార్యకలాపాలకు పాల్పడిందని కోర్టు తెలిపింది. ఈ కంపెనీ ఆస్ట్రేలియా వినియోగదారుల చట్టంలో మొత్తం 13 ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. సౌత్ వేల్స్, క్వీన్‌ల్యాండ్‌లో మొత్తం 13 ప్రాపర్టీలను ఈ హోటల్ కలిగి ఉంది. ఇలా ఉల్లంఘనలకు పాల్పడి, కేవలం మంచి రివ్యూలే సంపాదించి.. ట్రిప్అడ్వయిజర్ వెబ్సైట్లో ప్రాపర్టీ ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఈ విషయం గురించి తమకు 2015 అక్టోబర్‌లో తెలిసిందని, ఈ విషయం తెలియడంతోనే వెంటనే దీనిపై విచారణకు, స్వతంత్ర నియంత్రణకు ఆదేశించినట్టు ట్రిప్అడ్వయిజర్ తెలిపింది. ఈ జరిమానాతో పాటు ట్రిప్అడ్వయిజర్కు ఇచ్చే గెస్ట్ ఈ-మెయిల్ అడ్రస్‌లను మెరిటన్ ఫిల్టర్ చేయడం, ఎంపిక చేయడంపై కోర్టు నిషేధం విధించింది. -
ప్రపంచంలో బెస్ట్ హోటల్ మనదే తెలుసా!
జైపూర్: భారత గత చరిత్ర వైభవానికి, రాజరిక విలాసానికి చిహ్నంగా నిలిచే.. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ 2016 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌గా నిలిచింది. ట్రిప్ అడ్వయిజర్ వెబ్సైట్ ఈ మేరకు 'ట్రావెలర్స్ చాయిస్ అవార్డు'ను ప్యాలెస్‌కు ప్రకటించింది. అలనాటి రాజరిక వైభవాన్ని కళ్లకు కట్టే అనుభవాన్ని, అనుభూతిని ఈ ప్యాలెస్ తమకు అందించిందని పర్యాటకులు పేర్కొన్నారు. అంతేకాకుండా 840 మంది అతిథులు దీనికి ఐదుకు ఐదు రేటింగ్ ఇచ్చి అగ్రస్థానంలో నిలబెట్టారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ వెబ్సైట్ అయిన ట్రిప్ అడ్వయిజర్ తన 14వ ఎడిషన్ ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్ ను ఈ ప్యాలెస్‌కు ప్రకటించింది. 1928-43 మధ్యకాలంలో 15 ఏళ్లపాటు శ్రమించి ఈ అద్భుతమైన రాజరిక భవనాన్ని నిర్మించారు. జోధ్‌పూర్ వంశానికి చెందిన మహారాజ ఉమైద్ సింగ్ పేరిట దీనికి ఉమైద్ భవన్ ప్యాలెస్ అని నామకరణం చేశారు. ఇది మొదట్లో జోధ్‌పూర్ రాజవంశానికి ప్రధాన నివాసంగా కొనసాగింది. ప్రాక్పశ్చిమ సంస్కృతులు, శిల్పకళారీతుల సమ్మేళనంగా ఐరోపా సాంస్కృతిక పునర్జీవనం, ఆర్ట్ డెకో ప్రభావంతో రూపొందిన ఈ ప్యాలెస్ రాజ్‌పుత్ చారిత్రక వారసత్వానికి నిలువటద్దంగా నిలిచిపోయింది. 347 గదులున్న ఈ ప్యాలెస్‌లో విహరించడం అద్భుతమైన అనుభూతి అంటూ ఎంతోమంది పర్యాటకులు తమ సమీక్షల్లో వివరించారు. ' ప్రత్యక్ష స్వప్నంలో విహరిస్తున్నట్టు తోచింది. అత్యద్భుతమైన అనుభవాన్ని ఈ రాజరిక కట్టడం మాకు అందించింది' అంటూ ఓ పర్యాటకుడు తన రివ్యూలో పేర్కొన్నారు. ట్రిప్అడ్వైజర్ సభ్యుల ప్రకారం 2016లో టాప్ 10 హోటల్స్ ఇలా ఉన్నాయి 1. ఉమైద్ భవన్ ప్యాలస్ - జోథ్‌పూర్, భారతదేశం 2. షింతామణి రిసార్ట్ - సీమ్ రీప్, కంబోడియా 3. బెల్వ్యూ సిరెన్ - సారెంటో, ఇటలీ 4. హనొయ్ లా సీస్టా హోటల్ అండ్ స్పా- హనొయ్, వియత్నాం 5. యాక్టిస్ హోటల్ - అఫిటోస్, గ్రీస్ 6. బెల్మాండ్ లే మానాయిర్ ఆక్స్ క్వెట్సైసన్ - గ్రేట్ మిల్టన్, యునైటెడ్ కింగ్డమ్ 7. మిరిహి ఐలాండ్ రిసార్ట్- మిరిహి, మాల్దీవులు 8. బుకుటి అండ్ తారా బీచ్ రిసార్ట్స్ అరుబా - పామ్ ఈగిల్ బీచ్ , అరుబా 9. కాలాబాష్ లగ్జరీ బోటిక్యూ హోటల్ అండ్ స్పా- లాన్స్ ఆక్స్ ఎప్పిన్స్, గ్రెనడా 10. హోటల్ రిట్టా హఫ్నర్ - గ్రమడో, బ్రెజిల్