trolly
-
ఏం తెలివిరా నాయనా! ఏకంగా రూ. 64 లక్షలు..
విమానాశ్రయంలో తరుచుగా అక్రమంగా బంగారం, జంతువులు, డబ్బులు తరలిస్తున్న ఘటనలు గురించి విని ఉన్నాం. అదీకూడా వాళ్లకు ఊహకందని విధంగా భలే విచిత్రమైన రీతిలో తరలించిన ఉదంతాలను చూశాం. వాటన్నింటికి మించి అన్నట్లుగా ఇక్కడొక వ్యక్తి ట్రాలీ బ్యాంగ్ హ్యండిల్లో నగదును తరలించాలని చూసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుందర్ సింగ్ రిహాల్ అనే వ్యక్తి చెకింగ్ సమయంలో అతని వద్ద సరైన విధంగా డాక్యుమెంట్స్ లేకపోవడంతో అతన్ని ఆపారు. ఆ తర్వాత అతన్ని తనిఖీ చేస్తుండగా అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. అధికారుల కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ స్కాన్ చేయగా ట్రాలీ బ్యాగులో ఏదో ఉన్నట్లు చూపించడంతో ఇంకా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ట్రాలీ హ్యండిల్లో దాచిన విదేశీ కరెన్సీని నెమ్మదిగా బయటకు తీశారు. ఏకంగా మొత్తం రూ. 65 లక్షలు తరలించేందకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో సుమారు రూ. 60 లక్షలకు సంబంధించి సుమారు 68 వేల యూరోల కరెన్సీ, రూ. 4లక్షలకు సంబంధించిం న్యూజిలాండ్‌కి చెందిన 5 వేల డాలర్లు ఉన్నాయని చెప్పారు. ఐతే నిందితుడు భారీ మొత్తంలో అంత నగదు తరలించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడంలో విఫలమయ్యాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీంతో అతని వద్ద నుంచి భారీ మొత్తంలో ఉన్న ఆ నగదును స్వాధీనం చేసుకోవడమే గాక అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ ప్రయాణికుడు థాయ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టీహెచ్-332లో బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉంది. #CISF personnel detected foreign currency (Euro & New Zealand Dollars) worth approx INR 64 lakh concealed inside handle of Trolley Bag at IGI Airport.@CISFHQrs @HMOIndia @PMOIndia @UpendrraRai @BhaaratExpress @AAI_Official @DelhiAirport pic.twitter.com/ERRNZjRCVl — Mitalli Chandola 🇮🇳 (@journomitalli1) January 29, 2023 (చదవండి: చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్) -
ఆటో బోల్తాపడి ఇద్దరి దుర్మరణం
ఐదుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం కన్నీరు మున్నీరైన మృతుల బంధువులు జనగామ – మద్దూరు రహదారిపై గానుగుపహాడ్ స్టేజీ వద్ద ఘటన జనగామ రూరల్ : ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని జనగామ–మద్దూరు రహదారిపై గానుగుపహాడ్ గ్రామం వద్ద మంగళవారం జరిగింది. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన ట్రాలీఆటో నర్మెట మండలం కన్నెబోయినగూడెం వద్ద సామగ్రిని దింపేందుకు వెళ్లింది. తిరుగుప్రయాణంలో డ్రైవర్ జనగామ వైపు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వారిలో నర్మెట మండలం కన్నెబోయినగూడెంకు చెందిన ధారవత్ టీక్యా(50), ఆల కుంట్ల ఎల్లమ్మ, ఇదే గ్రామశివారు ఇప్పలగడ్డ తండాకు చెందిన బానోతు తారమ్మ, నర్మెటకు చెందిన శివరాత్రి కనకలక్ష్మి(32), ఆమె కూతురు శివరాత్రి శిరీష, బంధువు సంధ్య(అంక్షాపూర్), జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి ఎల్లయ్య ఉన్నారు. ఆటో గానుగుపహాడ్ స్టేజీ(జెండాబోడు గడ్డ) దాటాక మూలమలుపు వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారందరికి తీవ్ర గాయాలు కావడంతో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శివరాత్రి కనకలక్ష్మి, ధారవత్ టీక్యా మృతిచెందారు. ఎల్లమ్మ, శిరీష, సంధ్య, తారమ్మ, ఎల్లయ్యల తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో తారమ్మ, ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్‌కు తరలించారు. ఇద్దరి మృతితో వారి బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. మృతులు టీక్యాకు భార్య విజయ, కుమార్తె మంజుల, కుమారుడు గోపాలకృష్ణ ఉండగా, కనకలక్ష్మికి భర్త కనకయ్య, కుమార్తె శిరీష(క్షతగాత్రురాలు), కుమారుడు రవి ఉన్నారు.