TRS NRI Cell
-
కేసీఆర్ ప్రధాని కావాలి
బహరైన్ : బహరైన్ లో జరిగిన టీఅర్ఎస్ ఎన్నారై కార్యవర్గ సమావేశంలో 2019 ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ ప్రధాని కావాలని కోరుతూ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎన్నారై టీఅర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు బొలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చాలామార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాలు సాగాలని ఆకాక్షించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి తెలంగాణ ప్రయోగశాలగా మారటం హర్షించదగ్గ విషయమన్నారు. మూస విధానాలకు స్వస్తి చెప్పడం ద్వారా తెలంగాణా దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. ఈ కారణంగానే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని మరిపించే రీతిలో గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ విముక్తి పోరాటంలో విజయం సాధించి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. 70 ఏళ్లుగా రెండు జాతీయ పార్టీలు రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నించాయే తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు. పేదవాడు మరింత పేదవానిగా, ధనవంతుడు మరింత ధనవంతుడిగా మారుతున్నారే తప్ప పరిస్థితిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే విధానాలనే కాంగ్రెస్, బీజేపీపలు అవలంభించాయని విమర్శించారు. కేవలం 4 సంవత్సరాల వయసున్న రాష్ట్రం అన్ని వర్గాల అభివృద్ధి చేసుకంటూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందన్నారు. దేశ రాజకీయాల్లో బలమైన మార్పు కోసం కేసీఆర్ ముందుకు రావాలని కోరారు. అసాధ్యమన్న తెలంగాణ రాష్ట్రాన్ని తనదైన వ్యూహంతో, ఉద్యమంతో సుసాధ్యం చేసిన కేసీఆర్ తప్పకుండా జాతీయ రాజకీయాల్లో కూడా గుణాత్మక మార్పు తీసుకొస్తారనే విశ్వాసం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, జనరల్ సెక్రటరీలు లింబాద్రి, డా. రవి, సెక్రటరీలు రవిపటేల్, గంగాధర్, సుధాకర్, జాయింట్ సెక్రటరీలు దేవన్న, విజయ్, సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాజేష్, నర్సయ్య, రాజు, రాజేందర్, వెంకటేష్, సాయన్న, వసంత్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
గల్ఫ్ సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్
- సమస్యలపై టీఆర్ఎస్ ఎన్నారై సెల్ నివేదిక - ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి గల్ఫ్ సమస్యల పరిష్కారానికై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ కోరింది. సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తో సోమవారం భేటి అయిన ఏన్నారై టీఆర్ఎస్ సెల్ గల్ఫ్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. గల్ఫ్ లో జరుగుతున్న వాస్తవాలపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, గల్ఫ్ బిడ్డల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఎన్నారై పాలసీని అమలు చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, ఎన్నారై శాఖ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం , ఎన్నారై విభాగాల కోఆర్డినేటర్ మహేష్ బిగాల మంత్రిని కోరారు. స్వరాష్ట్ర పాలనలో కోటి ఆశలతో దీర్ఘకాలంగా వేచి చూస్తున్న లక్షలాది వలస దారులకు భరోస కావాలని గల్ఫ్ బిడ్డల కష్టాలను, సమస్యలను, పరిష్కారాలతో కూడిన నివేదికను వారు కేటీఆర్‌కు అందజేసి.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ సమస్యలపై కేటీఆర్ సానుకూలంగా స్పంచిందచారని, తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కష్టాలను, సమస్యలను అన్ని విధాలా పరిష్కరించేలా హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
లండన్‌లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ వార్షికోత్సవం
జగిత్యాల : టీఆర్ఎస్ ఎన్నారై సెల్ వార్షికోత్సవం లండన్ నగరంలో గురువారం ఘనంగా జరిగింది. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర ఎంతో గొప్పదన్నారు. రాష్ట్రం కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని ఘనంగా సన్మానిస్తామని చెప్పారు. ఆరేళ్లుగా పార్టీ ఎన్నారై శాఖను ముందుండి నడిపిస్తున్న అనిల్ కూర్మాచలంను అభినందించారు. యూకే నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎన్నారై సెల్ నేత చాడ సృజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముందుగా ప్రొఫెసర్ జయశంకర్‌కు, అమరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఎన్నారై సెల్ గత ఆరేళ్లలో చేపట్టిన కార్యక్రమాలపై ఓ వీడియోను ప్రదర్శించారు. ఓయూ జేఏసీ అధ్యక్షుడు కరాటే రాజు హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శులు నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సెల్ యూకే ఇన్చార్జి విక్రమ్‌రెడ్డి, లండన్ ఇన్చార్జి రత్నాకర్, సభ్యులు సతీష్‌రెడ్డి, సంజయ్, హరి, మల్లారెడ్డి, సత్యపాల్, సత్యంరెడ్డి, రాజేష్ వర్మ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్.కె, వినయ్, ప్రవీణ్, గణేశ్, నవీన్, వేణురెడ్డి, సత్య, రాకేష్, సీహెచ్. సత్య, రవి ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి
అమెరికాలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆవిర్భావ సభలో ఎంపీ కవిత రాయికల్ : బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఎన్ఆర్ఐలంతా భాగస్వాములు కావాలని తెలంగాణ జాగృతి గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న కవిత ఆదివారం మినియా పోలిస్ నగరంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విమానాశ్రయం నుంచి 200 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించగా హెలీకాప్టర్ ద్వారా కవితపై పూలవర్షం కురిపించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కవిత మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టేం దుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోందన్నారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణవాదులంతా ఒక్కటై రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం అమెరికాలోని పలువురు ఎన్ఆర్ఐలు కవిత సమక్షంలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్లో చేరారు. కార్యక్రమంలో సెల్ నాయకులు నాగేందర్ మహిపతి, భవాని రాం, నర్సారెడ్డి, జ్ఞానేశ్వర్, శ్రీధర్‌రెడ్డి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.