గల్ఫ్ సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్
- సమస్యలపై టీఆర్ఎస్ ఎన్నారై సెల్ నివేదిక
- ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి
గల్ఫ్ సమస్యల పరిష్కారానికై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ కోరింది. సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తో సోమవారం భేటి అయిన ఏన్నారై టీఆర్ఎస్ సెల్ గల్ఫ్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించింది. గల్ఫ్ లో జరుగుతున్న వాస్తవాలపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, గల్ఫ్ బిడ్డల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఎన్నారై పాలసీని అమలు చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, ఎన్నారై శాఖ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం , ఎన్నారై విభాగాల కోఆర్డినేటర్ మహేష్ బిగాల మంత్రిని కోరారు.
స్వరాష్ట్ర పాలనలో కోటి ఆశలతో దీర్ఘకాలంగా వేచి చూస్తున్న లక్షలాది వలస దారులకు భరోస కావాలని గల్ఫ్ బిడ్డల కష్టాలను, సమస్యలను, పరిష్కారాలతో కూడిన నివేదికను వారు కేటీఆర్‌కు అందజేసి.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ సమస్యలపై కేటీఆర్ సానుకూలంగా స్పంచిందచారని, తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కష్టాలను, సమస్యలను అన్ని విధాలా పరిష్కరించేలా హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.