13న నగరంలో ఎన్‌ఆర్‌ఐ సదస్సు
ఎన్‌ఆర్‌ఐ పాలసీ కార్యాచరణ దిశగా కీలక అడుగు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్‌తో పాటు మలేసియా తదితర దేశాలకు వెళ్లిన ఎన్‌ఆర్‌ఐల సంక్షేమం, సమస్యలను పరిష్కరించే దిశగా తెలంగాణ రూపొందించే ఎన్‌ఆర్‌ఐ పాలసీకి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వంతుగా సహకరించేందుకు ముందుకొ చ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి సంయుక్తం గా ఈ నెల 13న హైదరాబాద్‌లో సదస్సును నిర్వహించనుంది. ప్రధానంగా ఎన్‌ఆర్‌ఐల భద్రత, సంక్షేమంలో పాటు రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్‌ఆర్‌ఐల భాగ స్వామ్యం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, మున్సి పల్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖల మంత్రి కె.తారకరామారావు శుక్రవారం సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
ప్రధా నంగా సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాల పై చర్చించారు. విదేశాలకు వెళ్లే వారికి పాస్‌పోర్టు మొదలు మైగ్రేషన్ తదితర సదుపాయాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా నగరంలో విదేశీ భవన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన స్థలాన్ని గుర్తించాలని అధికారు లను ఆదేశించారు. రాష్ట్రంలో, సొంత ప్రాం తాల్లో అభివృద్ధి పను లు చేపట్టేందుకు, తమ వంతు భాగ స్వామ్యంగా విరాళాలు ఇచ్చేందుకు ముందు కు వచ్చే ఎన్‌ఆర్‌ఐలకు అనుసంధానకర్త పాత్ర పోషించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది.
2019లో నిర్వహించే ప్రవాసీ భారత్ దివస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖను కోరనుం ది. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఎన్‌ఆర్‌ఐల అధ్వర్యంలో ఆయా దేశాల్లో నో ఇండియా (కేఐపీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. విదేశాలకు ఉద్యోగాలు చేసేందుకు వెళ్లే వారు అనుసరించాల్సిన సురక్షిత విధి విధానాలు, న్యాయపరమైన అంశాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిం చాలని నిర్ణయించారు. కార్మిక ఉపాధి కల్పన శాఖ అధ్వర్యంలో రాజధానిలో ప్రవాసీ కౌసల్‌వికాస్ యోజన నైపుణ్య కేంద్రం, టామ్‌కాం అధ్వర్యంలో ప్రతీ జిల్లా కేంద్రం లో పాస్‌పోర్డ్ కేంద్రాల ఏర్పాటు అంశాలను సదస్సులో ప్రకటించాలని నిర్ణయించారు.