నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు సీజ్
శంషాబాద్: నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. రంగారెడ్డిజిల్లా శంషాబాద్‌లోని గగన్‌పహాడ్ దగ్గర ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో.. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 స్కూల్ బస్సులపై కేసులు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.