ttd vigilance
-
టీటీడీ విజిలెన్స్ వలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జీ
తిరుమల/సాక్షి ప్రతినిధి ఏలూరు: ఫోర్జరీ ఆధార్ కార్డులతో తన సిఫార్సు లేఖలపై వేరే రాష్ట్రాలకు చెందినవారికి తిరుమలలో శ్రీవారి దర్శనం చేయిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శుక్రవారం టీటీడీ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆయనే స్వయంగా ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారి గిరిధర్‌రావు వెల్లడించిన వివరాలు... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఇతర మతస్తుడైనా తరచూ శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు జారీ చేస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన టీటీడీ ఉన్నతాధికారులు లోతుగా ఈ వ్యవహారాన్ని పరిశీలించారు. గత నెల రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీ సాబ్జీ 19సార్లు సిఫార్సు లేఖలు జారీ చేశారని వెల్లడైంది. ఇందులో మూడుసార్లు ఎమ్మెల్సీయే స్వయంగా తిరుమలకు వచ్చారు. తన సిఫార్సు లేఖలపై దర్శనానికి పంపిన భక్తులంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. ఈ క్రమంలో శుక్రవారం కూడా ఎమ్మెల్సీ సాబ్జీ స్వయంగా తిరుమలకు వచ్చారు. 14 మందికి బ్రేక్ దర్శనాలు కావాలని దరఖాస్తు చేశారు. ఆయన ఎమ్మెల్సీ కావడంతో టీటీడీ నిబంధనల మేరకు 10 మందికి అధికారులు బ్రేక్ దర్శన టికెట్లు ఇచ్చారు. అయితే అనుమానంతో ఆయనతోపాటు దర్శనానికి వెళ్తున్నవారిని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. భక్తులు ఫోర్జరీ ఆధార్ కార్డులపై దర్శనానికి వెళుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బెంగళూరుకి చెందిన భక్తుల ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి హైదరాబాద్‌కు చెందినవారిగా సృష్టించారని వెల్లడైంది. అంతేకాకుండా ఆరుగురు భక్తులకు దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాలో రూ.లక్షా 5 వేలు జమయ్యాయి. దీంతో వీరిపై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో డ్రైవర్‌తో పాటు ఎమ్మెల్సీని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అధికార హోదాను అడ్డుపెట్టుకొని దర్శనాల్లో అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. మండలి చైర్మన్ ఈ సంఘటనపై వెంటనే స్పందించాలని ఆ పార్టీ నేతలు భానుప్రకాష్, విష్ణువర్ధన్ రెడ్డి వేర్వేరుగా డిమాండ్ చేశారు. -
భక్తుడిపై టీటీడీ భద్రతా సిబ్బంది దాష్టీకం
తిరుమల: సర్వదర్శనం క్యూలైన్లో శ్రీవారి దర్శనార్థం నిలుచున్న భక్తుడిపై టీటీడీ సిబ్బంది దాడిచేశారు. తమిళనాడు వేలూరుకు చెందిన పద్మనాభం అనే భక్తుడిపై టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అకారణంగా పిడిగుద్దులు కురిపించారు. భక్తుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. స్కానింగ్ కేంద్రం వద్ద దర్శనానికి వెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది, మహిళా సెక్యూరిటీ గార్డులు పద్మనాభంపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. దాంతో అతను అక్కడికక్కడే సొమ్మసిల్లిపడిపోయాడు. గమనించిన పోలీసులు అతనిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు విజిలెన్స్ సిబ్బందిని, ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను, ఒక ఎస్పీఎఫ్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పద్మనాభం పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. -
తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం
-
తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం బయటపడింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి నిలిచింది. దీనిని భద్రతా సిబ్బంది, అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
తిరుమల జపాలి తీర్థంలో పాకిస్థాన్ జెండా?
తిరుమల: పాపనాశనం వెళ్లే మార్గంలో ఉన్న జపాలి తీర్థంలో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్ జెండాను వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. నెలవంక, నక్షత్రం గుర్తుతో తెలుపు రంగులో ఉన్న జెండాను సోమవారం ఉదయం జపాలి తీర్థం వద్ద భక్తులు గమనించారు. ఆ విషయాన్ని భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు జపాలి తీర్థం వద్దకు వెళ్లి ఆ జెండాను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉరుసు ఉత్సవాల్లో దర్గాలవద్ద కట్టే జెండానా?.. లేక పాకిస్థాన్ జెండానా?.. అని విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. -
తిరుమలలో భారీ లడ్డూ స్కాం
-
తిరుమలలో భారీ లడ్డూ స్కాం
తిరుమల: టీటీడీలో భారీ లడ్డూ స్కాం గుట్టును విజిలెన్స్ అధికారులు శనివారం రట్టు చేశారు. టీటీడీ ప్రింటింగ్ ప్రెస్‌లో నకిలీ లడ్డూ కూపన్లు ముద్రించి వాటి ద్వారా శ్రీవారి ఆదాయానికి గండి కొడుతున్న ఇద్దరు టీటీడీ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల లడ్డూ కూపన్లలో నకిలీవి ఉన్నట్లు టీటీడీ ఉద్యోగులు గుర్తించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దాంతో టీటీడీ ప్రింటింగ్ ప్రెస్‌లో నకిలీ లడ్డూ కూపన్లు తయారవుతున్నట్లు గుర్తించి.. ఆ దిశగా విచారణ చేపట్టారు. దాంతో నిందితులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఒక భక్తుడు.. 144 లడ్డూలు!
'ఏం నాయనా.. లడ్డూ కావాలా..?' అంటూ అడిగి మరీ వడ్డించడానికి అదేం సాదా సీదా లడ్డూ కాదు! వరల్డ్ మోస్ట్ ఫేమన్. అందుకే మరి.. కోట్ల సంఖ్యలో వచ్చే భక్తులకు సరిపడా అందించాలనే ఉద్దేశంతో పరిమిత సంఖ్యలో అందజేస్తూంటారు ఆలయ నిర్వాహకులు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. మనం మాట్లాడుకుంటోంది తిరుమల- తిరుపతి ఏడుకొండలవాడి ప్రసాదం.. నేతి లడ్డూ గురించేనని! వెంకన్న దర్శనం అనంతరం టోకెన్ల ద్వారా పొందాల్సిన అంతటి ప్రశస్తమైన ప్రసాదం లడ్డూలు ప్రస్తుతం పక్కదారి పడుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 144 లడ్డూల్ని కలిగి ఉన్న ఓ భక్తుణ్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆలయ ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన రాథోడ్‌గా అతణ్ని గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది.. పరిమితికి మించి లడ్డులు ఎలా దొరికాయనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. లడ్డూ ప్రసాదం విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని గతంలోనూ వార్తలు వినవచ్చిన నేపథ్యంలో కోనేటిరాయుడి అమూల్యమైన ప్రసాదం కొందరు అక్రమంగా పొందుతుండటంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
టీటీడీలో నకిలీ లడ్డూ టిక్కెట్ల కుంభకోణం
శ్రీవారి ఆలయంలో నకిలీ లడ్డూ టిక్కెట్ల కుంభకోణాన్ని టీటీడీ ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం గుట్టురట్టు చేశారు. నకిలీ టికెట్ల ద్వారా లడ్డూలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందులోభాగంగా దాదాపు 210 నకిలీ కలర్ జిరాక్స్ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ లడ్డూ టిక్కెట్ల వ్యవహరంపై విచారణ జరిపాలని విజిలెన్స్ అధికారులను టీటీడీ ఆదేశించింది. శ్రీవార దర్శనం కోసం వచ్చిన భక్తులతో తిరుమలలో రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కనులారా వీక్షించేందుకు భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. అలాగే శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.