తిరుమలలో భారీ లడ్డూ స్కాం
తిరుమల: టీటీడీలో భారీ లడ్డూ స్కాం గుట్టును విజిలెన్స్ అధికారులు శనివారం రట్టు చేశారు. టీటీడీ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ లడ్డూ కూపన్లు
ముద్రించి వాటి ద్వారా శ్రీవారి ఆదాయానికి గండి కొడుతున్న ఇద్దరు టీటీడీ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల లడ్డూ కూపన్లలో నకిలీవి ఉన్నట్లు టీటీడీ ఉద్యోగులు గుర్తించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దాంతో టీటీడీ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ లడ్డూ కూపన్లు తయారవుతున్నట్లు గుర్తించి.. ఆ దిశగా విచారణ చేపట్టారు. దాంతో నిందితులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.