Tulasiram
-
పేపర్లతో ‘పన్ను’ కొల్లగొట్టారు
సాక్షి, హైదరాబాద్ : సరుకులు లేవు.. రవాణా లేదు... అమ్మకాలు లేవు.. కొనుగోళ్లు అంతకన్నా లేవు.. కానీ పేపర్లు మాత్రం ఉన్నాయి... సరుకులు రవాణా జరి గినట్టు, అమ్మినట్టు, కొన్నట్టు ఇన్వాయిస్లు తయారు చేశారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) పేరుతో రూ.8.23 కోట్ల పన్ను కొల్లగొట్టేశారు. రాష్ట్ర రాజధాని కేంద్రంగా జరిగిన ఈ కుంభకోణాన్ని హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు గుర్తించారు. ఈ కేసు తో సంబంధమున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కర్నెకోట తులసీరాం అనే వ్యక్తి తులసి ఎంటర్ప్రైజెస్ పేరుతో హైదరాబాద్ రాజేంద్రనగర్లో వ్యాపారం చేస్తున్నారు. ఎలాంటి సరుకుల రవాణా, అమ్మకాలు లేకుండానే ఈ కంపెనీ పేరుతో అనేక కం పెనీలతో లావాదేవీలు జరిపినట్టు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి పన్ను చెల్లిస్తున్నారు. తాము పన్ను చెల్లిస్తున్నా మని, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాలంటూ పత్రాలు దాఖలు చేసి రూ.8.23 కోట్ల మేర ప్రభుత్వం నుంచి తిరిగి తీసుకున్నారు. ఫలానా కంపెనీతో లావాదేవీలు జరిపినట్టు చెప్పిన కంపెనీలు కూడా డమ్మీవే. వీటి ద్వారా తెలంగాణ, ఏపీల్లో లావాదేవీలు జరిపినట్టు చూపించి కుంభకోణానికి పాల్పడ్డారు. ఉప్పందుకున్న హైదరాబాద్ జీఎస్టీ అధికారులు తీగ లాగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మజ్జి గ నర్సింహరాజు, షేక్ షాకీర్లు ఈ తతంగమంతా నడిపించారని, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి పలు కంపెనీలతో లావాదేవీలు జరిపినట్టు కాగితాలు తయారు చేయడంలో వీరి ప్రమేయం ఉందని గుర్తించారు. వీరిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కుంభకోణంలో ఇప్పటివరకు తేలింది నామమాత్రమేనని, దీనివెనుక పెద్ద రాకెట్ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, స్టీల్, పేపర్ తయారీ కంపెనీలున్నాయని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
తిరుపతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కల్యాణి డ్యాం వద్దనున్న పోలీసు శిక్షణ కాలేజ్ లో ఎస్ఐగా పనిచేస్తున్నతులసీరామ్ బుధవారం మధ్యాహ్నాం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే అతనిని రుయా ఆసుపత్రికి తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక తులసీ రామ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిస్తోంది. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలోని పుత్తూరులో ఉగ్రవాదుల ఆపరేషన్ లో తులసీరామ్ కీలక పాత్ర పోషించారు. -
ఆశలు మునిగి.. శోకం మిగిలె!
నాయనా.. నా చిట్టితండ్రీ. నీవే కదరా మాకు దిక్కు. నీపై ఎన్నో ఆశలు పెంచుకున్నాం. మా ప్రాణం పోయాక నీవే తలకొరివి పెడతావనుకున్నాం. ఇప్పుడు మమ్మల్నే వదిలివెళ్లిపోయావా.. ఆ దేవుడు నా ఒక్క బిడ్డనీ తీసుకెళ్లాడే.. ... ఇదీ ఓ తల్లి రోదన కాయకష్టం చేశాం.. కడుపు కట్టుకుని పెంచాం. పెద్దచదువులు చదివించి ప్రయోజకుడిని చేయాలనుకున్నాం. కానీ ఆ దేవుడు మాపై పగబట్టాడేమో.. నా బిడ్డని మధ్యలోనే తీసుకెళ్లిపోయాడు. మమ్మల్ని ఎవరు చూస్తారు నాయనా.. ... ఇదీ మరో తల్లి వేదన తమ బిడ్డలు కళ్లెదుటే విగజీవులై పడి ఉండడం చూసి ఆ తల్లులు తట్టుకోలేకపోయారు. గుండెలు పగిలేలా రోదించారు. వీరి రోదనలు పలువురికి కన్నీటిని తెప్పించాయి. ఈ విషాద ఘటన శుక్రవారం శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లెలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్ : శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లెకు చెందిన కాళప్ప, నాగమణి ఎకైక కుమారుడు తులసీరాం(10), వెంకటరత్నం, సుబ్బలక్ష్మి కుమారుడు గంగాప్రసాద్(9)తోపాటు పది మంది పిల్లలు స్థానికంగా ఉన్న చెరువులో శుక్రవారం బడి వదిలిన తర్వాత ఈతకొట్టేందుకు వెళ్లారు. గంగాప్రసాద్, తులసీరాం ముందు చెరువులో దిగారు. ఆపై పైకిరాలేదు. తోటి స్నేహితులు సమీపంలోని గొర్రెల కాపరికి సమాచారం ఇచ్చారు. ఆయన చెరువులో చిక్కుకున్న పిల్లలిద్దరినీ బయటకు తీశాడు. కానీ అప్పటికే వారు మృతిచెందారు. విషయం తెలుసుకున్న బంధువులు చిన్నారుల మృతదేహాలను గ్రామానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పాడు గుంతే ప్రాణం తీసింది ఇటీవల నీరు-చెట్టు పథకం పేరుతో ఎల్లంపల్లి చెరువులో పచ్చబాబులు పూడికతీత పనులు చేపట్టారు. చెరువులో అక్కడక్కడా చాలా గుంతలు తవ్వారు. వాటిలో కొన్ని ఏడు నుంచి పది అడుగుల లోతువరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఆ గుంతల్లో నీరు చేరింది. గుంతలు.. లోతు తెలియక పోవడంతోనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పాడుగుంతలతోనే పిల్లల ప్రాణాలు పోయాయని పలువురు వాపోయారు. -
పింఛను అడిగితే తల పగులగొట్టారు
ఏలూరులో టీడీపీ కార్పొరేటర్ అరాచకం ఏలూరు: ‘పింఛను ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదయ్యూ. ఆ డబ్బులు ఇప్పించి కాస్త పుణ్యం కట్టుకోండయ్యూ..’ అని అడిగినందుకు ఓ వృద్ధుడి తలను కార్పొరేటర్, అతడి తల్లి, అనుచరుడు కలిసి సీసాతో పగులగొట్టిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గురువారం సంచలనం కలిగించింది. ఏలూరు తూర్పువీధిలో నివసించే వృద్ధుడు తిరుమలశెట్టి రాజు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తనకు పింఛను రావటం లేదని గురువారం సాయంత్రం 10వ డివిజన్ కార్పొరేటర్ పోలిశెట్టి తులసీరామ్ ఇంటికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. అతడిపై కార్పొరేటర్ ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల దండకం అందుకున్నాడు. ‘పింఛను అడగటానికి వస్తే తిడతారేంటి బాబూ..’ అని ఆ వృద్ధుడు అనడంతో మరింత ఆగ్రహించిన కార్పొరేటర్ అతడి గుండెలపై తన్నగా, అనుచరులు బరబరా ఈడ్చేశారు. సమీపంలో ఉన్న మద్యం సీసాను వృద్ధుడి తలపై మోదడంతో అతడికి తీవ్రగాయూలయ్యూరుు. చుట్టుపక్కల వారు వెంటనే అతడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పింఛనడిగితే నేరమా పింఛను పెంచారని తెలిసి సంబరపడ్డాను.అందితే తిండి దొరుకుతుందని ఆశపడ్డాను. ఆ మొత్తం పెంచలేదు సరికదా.. గతంలో ఇచ్చే రూ.200 కూడా ఇవ్వటం లేదు. ఏమైందో తెలుసుకుందామని కార్పొరేటర్ ఇంటికి వెళ్లాను. పింఛను ఇప్పించి ఆదుకోమని అడిగాను. అంతే కార్పొరేటర్ నన్ను గుండెలపై తన్నారు. పక్కనే ఉన్న ఆయన తల్లి, అనుచరులు నాపై దాడికి దిగారు. ముసలాడినని కూడా చూడకుండా కొడతారేంటని అడిగాను. కార్పొరేటర్ ప్రోద్బలంతో ఆయన అనుచరుడు నారాయణ నాతలపై మందు సీసాతో కొట్టాడు. దాడి చేయమని వాళ్ల నాయకుడు చెప్పాడా? నాకు పింఛను ఇప్పించి న్యాయం చేయండి.. - తిరుమలశెట్టి రాజు, బాధితుడు నేను కొట్టలేదు పింఛను రాలేదని ఆ వృద్ధుడు నా దగ్గరకు వచ్చాడు. సిబ్బంది లేరు తరువాత రమ్మని చెప్పాను. పక్కనే ఉన్న నారాయణ అనే వ్యక్తి ఆ వృద్ధుడిని వారించే ప్రయత్నం చేయగా అతణ్ణి తోసేశాడు. నేను మాత్రం వాడిని కొట్టలేదు. వారించిన నన్ను కాలర్ పట్టకోవడంతో స్థానికులు కలుగజేసుకుని బయటకు ఈడ్చుకెళ్లారు. మద్యం తాగి.. వెంట సీసా తెచ్చుకున్న ఆ వృద్ధుడు తన తలపై తానే సీసాతో కొట్టుకున్నాడు. - తులసీరామ్, కార్పొరేటర్