TVF CEO
-
ఆ మాజీ సీఈవోపై మరో చార్జ్‌షీట్!
ముంబై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీఎఫ్ మాజీ సీఈవో అరుణాబ్ కుమార్‌పై వెర్సోవా పోలీసులు మరో చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. అరుణాబ్ కుమార్‌పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వెనుకభాగంలో తనను అసభ్యంగా తడిమాడంటూ మలద్‌కు చెందిన 31 ఏళ్ల మహిళ ఆయనపై సెక్షన్ 354 (ఏ) కింద లైంగిక వేధింపుల కేసు నమోదుచేసింది. దీంతో అరుణాబ్పై పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. మొదటి కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ వెంటనే బెయిల్‌పై విడుదల అయ్యారు. తనపై పలు లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో అరుణాబ్ కుమార్ టీవీఎఫ్ కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 2014లో టీవీఎఫ్ స్టూడియోలో తాను అరుణాబ్ కుమార్‌ను కలిశానని, తాము స్నేహితులు కాకపోయినప్పటికీ, సన్నిహితంగా వ్యవహరిస్తూ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, పండ్లు నీకు ఇష్టమా? అని అడుగుతూ.. మెడ నుంచి నడుము వరకు చేతితో అకస్మాత్తుగా తడిమాడని, దీంతో షాక్ తిన్న తాను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసులో బలమైన ఆధారాలు లేవని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన 45 పేజీల చార్జ్‌షీట్‌ను తాజాగా దాఖలు చేశారు. -
లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఈవో రిజైన్
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో ది వైరల్ ఫివర్(టీవీఎఫ్) సీఈవో అర్నాబ్ కుమార్ బాధ్యతలకు గుడ్‌బై చెప్పారు. ఇక నుంచి సంస్థకు తాను మార్గ నిర్దేశకుడిగానే వ్యవహరిస్తానని చెప్పారు. ఆయన స్థానంలో కొత్త సీఈవోగా దావల్ గుసెయిన్ బాధ్యతలు చేపడతారని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ‘నాపై వ్యక్తిగత దాడి జరుగుతున్నందున సంస్థ ప్రతిష్టకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నందున సీవీవో బాధ్యతల నుంచి నేను తప్పుకుంటున్నాను. నేను వ్యక్తికంటే సంస్థ గొప్పదని నమ్ముతాను’ అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. సంస్థకు మెంటర్‌గా మాత్రం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అర్నాబ్ కుమార్ 2011లో టీవీఎఫ్ అనే వెబ్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థను ప్రారంభించారు. అయితే, ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగిణి ఆరోపణలు చేసింది. దీంతో దానికి బాధ్యత వహిస్తూ తాజాగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
లైంగిక వేధింపుల కేసు: సీఈఓ రాజీనామా
ముంబై : తనతోపాటు పనిచేసిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'ది వైరల్ ఫీవర్'(టీవీఎఫ్) వ్యవస్థాపకుడు అరుణబ్ కుమార్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 'ఇటీవలి కాలంలో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలతో తీవ్రంగా కలత చెందా. వాటి ప్రభావం సంస్థ మీద పడకుండా టీవీఎఫ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. అయితే కంటెంట్ టీం సభ్యులకు ఓ మెంటర్‌గా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా' అని అరుణబ్ కుమార్ పేర్కొన్నారు. దావల్ గుసెన్ తదుపరి సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ టీవీఎఫ్ సంస్థలో పనిచేసిన ఓ మహిళ అరునాభ్ కుమార్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడిపై సెక్షన్ 354 ఎ (లైంగిక వేధింపులకు పాల్పడటం), 509 (అసభ్య పదాలు, చేష్టలు, చర్యల ద్వారా ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించడం) సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇలాంటి కేసు మరొకటి ముంబైలోని వర్సోవా పోలీస్ స్టేషన్లో నమోదైంది. తాను 2014 నుంచి 2016 వరకు టీవీఎఫ్‌లో పనిచేసినప్పుడు కుమార్ తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ తన బ్లాగులో రాసుకుంది. ఆ పోస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో చాలామంది తాము కూడా అలాగే అతడి వేధింపులకు గురయ్యామని అక్కడ రాశారు. దీంతో సోషల్ మీడియాలో అరుణబ్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఐఐటీ గ్రాడ్యువేట్ అయిన అరుణబ్ టీవీఎఫ్ను 2011లో స్థాపించారు. -
‘సెల్ఫీ దిగానంతే.. ఆమెను ఇంకేం చేయలేదు’
ముంబయి: తనతోపాటు పనిచేసిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసుకు సంబంధించి తొలిసారి ది వైరల్ ఫీవర్(టీవీఎఫ్) సీఈవో అరునాభ్ కుమార్ స్పందించాడు. తనను అనవసరం ఈ కేసులో ఇరికించారని అన్నారు. అసలు తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. గత కొద్ది రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ఆయనకు దిండోషి సెషన్స్ కోర్టు యాంటిసిపేటరీ బెయిలిచ్చింది. అంతకుముందు పోలీసులకు అరునాభ్ ఎలాంటి వాంగ్మూలం ఇచ్చాడంటే.. ‘నేను 2016 మే 26న ఆమె(కేసు పెట్టిన బాధితురాలు)ను కలిశాను. ఓ ప్రోమో షూట్ చేసేందుకు ఆమె అక్కడికి వచ్చింది. ఎందుకంటే ఆమె డైరెక్టర్. నా ఆఫీసులోని మూడు చోట్ల షూటింగ్ చేశాం. తొలి షాట్‌ను గ్రౌండ్ ఫ్లోర్లో, రెండో షాట్ సెకండ్ ఫ్లోర్, మూడోషాట్ టెర్రస్‌పై తీశాం. ప్రతి షాట్‌కు దుస్తులు మార్చాలని ఆమె నాతో చెప్పింది. అయితే, నేను చాలా బిజీ పర్సన్‌ని అయినందున ఏం చేసైనా షూటింగ్ త్వరగా ముగించాలని కోరాను. ఆ రోజు నాకు ఆమె రెండు టీ షర్ట్లు, ఒక కుర్తా ఇచ్చింది. మూడు షాట్లకు మూడు వేర్వేరు వేసుకోవాలని కోరింది. ఆ తర్వాత నాకు సంబంధించిన షూటింగ్ అయిపోయింది. అక్కడే నా దుస్తులు మార్చుకున్నాను. ఆ సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. ఆమె ఒక్కతే ఏం లేదు. నేనెప్పుడు ఆమె ముందు నా దుస్తులు తీయలేదు.. ఆమెకు చెడుగా సైగలు చేయలేదు. నాకు ఆ రోజు ఆలస్యం అవుతుండటంతో అక్కడే మార్చుకున్నాను. అప్పుడు నాకు ఎలాంటి దురుద్దేశం కూడా లేదు. షూటింగ్ పూర్తయ్యాక జూన్ 8న, 2016న మేం పార్టీ ఏర్పాటుచేసుకున్నాం. ఆమె నిర్ణయించిన ప్రాంతంలోనే పార్టీ చేశాం. పార్టీ ప్రారంభమైంది. అప్పుడే నేను ఆమెతో ఒక సెల్ఫీ దిగాను. ఆమె ఆ సమయంలో ఏమనలేదు కూడా. ఇంతకుమించి నేను ఏనాడు ఆమెకు ఒక మెస్సేజ్గానీ, ఫోన్‌గానీ చేయలేదు. లైంగిక వేధింపులు అనేవి కేవలం ఉద్దేశ పూర్వకంగా చేసిన ఆరోపణలే.. నేనసలు ఏం తప్పు చేయలేదు’ అని ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రికార్డయింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ టీవీఎఫ్ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేసిన మహిళ అరునాభ్ కుమార్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
సీఈఓపై లైంగిక వేధింపుల కేసు
సోషల్ మీడియాలో విపరీతంగా ఫిర్యాదులు.. మహిళల నుంచి లెక్కలేనన్ని కంప్లయింట్లు.. దాంతో ఒకప్పటి ఐఐటీ గ్రాడ్యుయేట్, 'ద వైరల్ ఫీవర్' (టీవీఎఫ్) సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అరుణబ్ కుమార్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గుర్తుతెలియని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరుణబ్ కుమార్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అతడిపై ఫిర్యాదులు ఎవరు చేశారో వెల్లడించని పోలీసులు.. ఇంకా అరుణబ్ను అరెస్టు కూడా చేయలేదు. అతడిపై సెక్షన్ 354 ఎ (లైంగిక వేధింపులకు పాల్పడటం), 509 (అసభ్య పదాలు, చేష్టలు, చర్యల ద్వారా ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ అశ్విని సనప్ తెలిపారు. వాస్తవానికి అతడిపై అత్యాచారయత్నం కేసు పెట్టాలని రిజ్వాన్ సిద్దిఖీ అనే న్యాయవాది పోలీసులను కోరారు. అయితే మహిళలు ఎవరూ వ్యక్తిగతంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో ఆ కేసు పెట్టలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. తాను 2014 నుంచి 2016 వరకు టీవీఎఫ్‌లో పనిచేసినప్పుడు కుమార్ తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ ఓ బ్లాగులో రాసింది. ఆ పోస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఇంకా చాలామంది తాము కూడా అలాగే అతడి వేధింపులకు గురయ్యామని అక్కడ రాశారు. అయితే టీవీఎఫ్ సంస్థ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ముందుగా బ్లాగ్ రాసింది ఎవరో తెలుసుకుని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు వాళ్లపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.