twin murders
-
అహం దెబ్బతిని..
శంషాబాద్: జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. కడ్తాల్ మండలం గోవిందాయపల్లికి చెందిన గుండమోనీ శివ (28) మియాపూర్‌లో చికెన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే గ్రామాని కి చెందిన శేషగిరి శివ (28) నగరంలోని గాయత్రీనగర్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. అదే గ్రామానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి జలకం రవికి వీరితో స్నేహం ఉంది. ముగ్గురూ బీజేవైఎంలో చురుగ్గా పనిచేశారు. శివ, శేషగిరి శివకు కొంతకాలం క్రితం రవితో మన స్పర్థలు రాగా, వారు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో రవికి వీరికి దూరం పెరిగింది. దీనికితోడు ఈ నెల 4న కడ్తాల్‌లోని బట్టర్ఫ్లై వెంచర్లో రవి తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ 300 ఫొటోలు గోవిందాయిపల్లికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనికి ఇద్దరు శివలు అభ్యంతరం చెబుతూ ఫొటోలు డిలేట్ చేసి, రవిని వాట్సాప్ గ్రూప్‌లో నుంచి తొలగించారు. దీంతో తనను అవమానించి, ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని అంతం చేయాలని రవి నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన పల్లె నాగరాజుగౌడ్, తలకొండ రాజు, జీలుకుంట్ల విజయ్, తిరు పతి జగదీశ్‌గౌడ్, నిట్ల ప్రవీణ్, వల్లేపు దాసు శేఖర్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. వారిద్దరు ఈ నెల 5న ఓ వైన్స్ దుకాణంలో మద్యం తాగుతున్నారని తెలుసుకున్న రవి.. తన ఇన్నోవాలో ఆరుగురు స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాడు. బలవంతంగా వారిని కారులో ఎక్కించుకొని బట్టర్ఫ్లై వెంచర్లో తాను అద్దెకుంటున్న గది వద్దకు తీసుకొచ్చి హతమార్చారు. ఆ తర్వాత గదికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మీర్పేట్ వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
దంపతులను బలి తీసుకున్న పాతకక్షలు
అయ్యంకి(మొవ్వ): గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన జంట హత్యలు కృష్ణాజిల్లాలో కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు, పాత కక్షలు భార్య భర్తలను బలితీసుకున్నాయి. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యంకి గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు కుమారులు వీరంకి వీరకృష్ణ, వీరంకి పూర్ణచంద్రరావు, కుమార్తె అమ్ములు ఉన్నారు. ఆంజనేయులుకి గ్రామంలో 3.01 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వల్ల ఏర్పడిన వివాదాల కారణంగా 2008లో తండ్రి చినఆంజనేయులును, 2012లో తమ్ముడు పూర్ణచంద్రరావును వీరకృష్ణ హత్య చేశాడనే ఆరోపణలొచ్చాయి. అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. కాగా, పూర్ణచంద్రరావు హత్యానంతరం అతడి భార్య స్వర్ణ, ముగ్గురు కుమారులు గణేశ్, లోకేశ్, భువనేశ్ అయ్యంకి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇటీవల స్వర్ణ తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకానికి అప్లయ్ చేయగా లింక్ డాక్యుమెంట్స్ లేవంటూ వీఆర్వో, ఆర్ఐలు రిజక్ట్ చేశారు. దీనిపై వివరణ కోరేందుకు తాజాగా ఆమె తన కుమారులు ముగు్గరితో కలిసి గురువారం మధ్యాహ్నం అయ్యంకిలోని వీఆర్వో కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా పాస్‌పుస్తకాల విషయంలో స్వర్ణ కుటుంబానికి, అక్కడే ఉన్న వీరకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన స్వర్ణ కుమారులు వెంట తెచ్చుకున్న కత్తులతో పెదనాన్న వీరకృష్ణను విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమం వద్ద ఉన్న వీరకృష్ణ భార్య వరలక్ష్మిని సైతం కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు. గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకటనారాయణ, కూచిపూడి ఎస్ఐ డి.సందీప్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్‌తోనే వీరకృష్ణ, వరలక్ష్మి దంపతుల హత్య జరిగినట్లు తెలిపారు. వీరకృష్ణ తమ్ముడి భార్య స్వర్ణ, ఆమె కొడుకులే హత్యలకు కారణమని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మృతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం..
సదుం(చిత్తూరు జిల్లా): మండలంలో జంట హత్యలు శనివారం కలకలం రేపాయి. అమ్మగారిపల్లె పంచాయతీ ఎగువ జాండ్రపేటలోని వాటర్‌ప్లాంటు వద్ద ఇద్దరిని ఎవరో హత్య చేసినట్లు ఉదయం పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఇన్చార్జి సీఐ గంగిరెడ్డి, చౌడేపల్లె ఎస్ఐ రవికుమార్ పరిశీలించారు. హత్యకు గురైన వారు రాధ, వెంకటరమణగా గుర్తించారు. చదవండి: ఎంగిలిపేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా పోలీసుల, స్థానికుల కథనం మేరకు, అంగళ్లుకు చెందిన రాధ(28)కు పుట్టపర్తి ఎనమలవారిపల్లెకు చెందిన నరసింహులుతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. నాలుగు నెలల క్రితం భర్తతో మనస్పర్థలు రావడంతో ఆమె తన కూతురు సాయితేజుతో కలిసి విడిగా ఉంటోంది. ఈ క్రమంలో తన అన్న వెంకటరమణ(37), స్నేహితుడు రాముతో కలిసి గత నెల జాండ్రపేటలోని ఓప్రైవేటు వాటర్ ప్లాంటులో కూలి పనులకు చేరి, అక్కడే నివాసం ఉంటోంది. కొద్ది రోజుల క్రితం భర్త నరసింహులు అక్కడికి వచ్చి తనతో వచ్చేయమనడంతో వివాదం రేగింది. ఇటీవల తను తిరిగి భర్త వద్దకు వెళ్లిపోతానని రాధ, రాముకు చెప్పడంతో గత కొద్ది రోజులుగా వారి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే అతను వారిద్దరినీ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాధను బండరాయితో కొట్టి చంపగా, వెంకటరమణ చెవి కింది భాగంలో గాయం ఉంది. సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సాయితేజ(4)ను విచారిస్తున్నారు. వీఆర్వో మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పీలేరుకు తరలించారు. -
నిజామాబాద్‌లో జంట హత్యల కలకలం
-
సిరిసిల్ల జిల్లాలో జంటహత్యలు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం తండ్రి కొడుకులు దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తండ్రి కొడుకులను కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ జంట హత్యల ఘటన స్థానికంగా కలకం రేపింది. గ్రామానికి చెందిన ఎల్లయ్య, అతని కొడుకును అదే గ్రామానికి చెందిన వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హతమార్చారు. పొలం విషయంలో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున పొలంలో ఉన్న తండ్రికొడుకులను హత్యచేసిన నిందితులు ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. -
పులివెందులలో జంట హత్యలు
వైఎస్సార్ జిల్లా : పులివెందులలో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. స్థానికంగా నివసిస్తోన్న అశోక్ బాబు, ఖాదర్ బాషాలను గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. ఖాదర్, అశోక్‌లు ఇద్దరూ స్నేహితులు. మద్యంమత్తులో ఈ హత్యలు జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కలకలం రేపిన జంట హత్యలు
-
కలకలం రేపిన జంట హత్యలు
కురబలకోట: చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం మట్లివారిపల్లెలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న మామిడితోటలో శుక్రవారం ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. మృతులు తంబళ్లపల్లె మండలం ఎర్రమద్దివారిపల్లె గ్రామానికి చెందిన ఎర్రోళ్ల జగదీశ్వర్ రెడ్డి(29), మదనపల్లి మండలం జంగాలపల్లికి చెందిన ప్రదీప్(28) గా గుర్తించారు. వీరు సుమారు 8 మంది హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. మదనపల్లికి చెందిన పూల చలపతి, దండు రవి, సాంబ శివ, రవి అనే నలుగురి హత్య కేసులో వీరు ప్రధాన నిందితులు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నల్గొండ జిల్లాలో జంట హత్యలు
-
కృష్ణ జిల్లాలో జంట హత్యలు
-
ఆధిపత్యం కోసమే జంట హత్యలు
– గోవిందపల్లె కేసులో నిందితుల అరెస్టు - వివరాలు వెల్లడించిన ఆళ్లగడ్డ డీఎస్పీ ఆళ్లగడ్డ : ఆధిపత్యం కోసమే గోవిందపల్లె గ్రామంలో ఇందూరు ప్రభాకర్‌రెడ్డి, అతని బావమర్ది మేరువ శ్రీనివాసరెడ్డిలను హత్య చేశారని ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల అరెస్ట్ చూపించారు. అరెస్టయిన నిందితుల్లో గోవిందపల్లి గ్రామానికి చెందిన బొబ్బ గోపాల్‌రెడ్డి, ఇందూరి శ్రీధర్‌రెడ్డి, గంగదాసరి రవిచంద్రారెడ్డి, బొబ్బ జ్యోతి కృష్ణకాంత రెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డి, సంతజూటూరు గ్రామానికి చెందిన పాలకేటి శ్రీనివాసులు ఉరఫ్ చాకలి శ్రీనులు ఉన్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు హత్య ఎందుకు చేశారంటే.. ఎదుగుదల చూసి ఓర్వలేక.. ఇందూరు ప్రభాకర్‌రెడ్డి గతంలో శిరివెళ్ల మండలాధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏచిన్న పనిపడినా ఇతని దగ్గరకు వచ్చేవారు. స్వతహాగా అందరినీ కలుపుకుని పోయే మనస్థత్వం గల ప్రభాకర్‌రెడ్డి.. తనదగ్గరకు వచ్చేవారందరికీ పార్టీ, వర్గం తేడాలేకుండా పనులు చేసిపెట్టేవారు. దీంతో గ్రామంలోని ప్రత్యర్థివర్గాలకు కళ్లుకుట్టేవి. గ్రామం నుంచి మండలం, మండలం నుంచి నియోజవర్గస్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటుండటంతో ప్రత్యర్థుల జీర్ణించుకోలేక పోయారు. ఇతన్ని మట్టుబెట్టిబెడితే గ్రామంలో తమదే ఆధిపత్యం అవుతుందని భావించారు. ఇందుకు రెండు వర్గాలకు చెందిన ప్రత్యర్థులు ఏకమై అదును కోసం ఎదరుచూస్తూ రెక్కీ నిర్వహిస్తూ ఉండేవారు. కుటుంబ కలహాలు తోడు.. ఇటీవల టీడీపీ నుంచి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డితో పాటు ఇందూరు ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్పీలో చేశారు. ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఆయన సమీప బంధువు శ్రీధర్‌రెడ్డికి, ప్రభాకర్‌రెడ్డికి కుటుంబ కలహాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీధర్‌రెడ్డిని మంచి చేసుకుని ప్రత్యర్థులు రెచ్చగొట్టారు. గోవిందపల్లె గ్రామానికి చెందిన బొబ్బ గోపాల్‌రెడ్డి, ఇందూరి శ్రీధర్‌రెడ్డి, గంగ దాసరి రవిచంద్రారెడ్డి, బొబ్బ జ్యోతి కృష్ణకాంతరెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డిలతోపాటు మరి కొందరు గ్రామస్తులు..సంతజూటూరు గ్రామానికి చెందిన పాలకేటి శ్రీనివాసులు ఉరఫ్ చాకలి శ్రీను దగ్గరకు వెళ్లి ప్రభాకర్‌రెడ్డిని చంపాలని రూ. 40 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. హత్యచేశారు ఇలా... ఈ నెల ఆరో తేదీ సాయంత్రం ప్రభాకర్‌రెడ్డి, బావమరిది శ్రీనివాసరెడ్డి, తమ్ముడు ప్రతాపరెడ్డితో కలిసి సాయంత్రం వాకింగ్‌కు వెళ్తున్నట్లు గమనించిన ప్రత్యర్థులు గ్రామ శివారులోని పంట పొలాల్లో దాక్కుని ఉన్నారన్నారు. ప్రభాకర్‌రెడ్డి సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా వేటకొడవళ్లు, పిడిబాకులతో దాడి చేశారు. ప్రతాపరెడ్డి భయంతో పరుగులు తీయగా ప్రభాకర్‌రెడ్డిపై దాడిని శ్రీనివాసరెడ్డి అడ్డుకోబోయారు. ప్రత్యర్థులు.. ప్రభాకర్‌రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డిని దారుణంగా హత్య చేశారు. ప్రత్యక్ష సాక్షి ప్రతాపరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐలు ప్రభాకర్‌రెడ్డి, దస్తగిరిబాబు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో అనుమానితుడు?
శిరివెళ్ల: గోవిందపల్లె జంట హత్యల కేసుకు సంబంధించి ఆరుగురు అనుమానితుల్లో కీలక వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని ఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. రెండు రోజుల్లో మిగిలిన వారిని అదుపులోకి తీసుకొని మిస్టరీని ఛేధించాలన్న ధ్యేయంతో పోలీసులున్నట్లు తెలుస్తొంది. -
వీడని జంట హత్యల మిస్టరీ
- అనుమానితుల పేర్లు వెల్లడికి పోలీసుల నిరాకరణ శిరివెళ్ల: గోవిందపల్లెలో జంట హత్యల కేసు మిస్టరీ ఛేదన పోలీసులకు కత్తిమీద సాము మాదిరిగా మారింది. మాజీ ఎంపీపీ ఇందూరి ప్రభాకరరెడ్డి, అతని బావమరిది మేర్వ శ్రీనివాసులరెడ్డి హత్యలో పది మంది అనుమానితులపై కేసు నమోదు చేశారు. అయితే అందులో గ్రామానికి చెందిన ఆరుగురు టీడీపీకి అనుకూలురుగా ఉండడం కాక హతులకు బంధువులు. అయితే అధికారికంగా పోలీసులు వివరాలు వెల్లడించడం లేదు. గ్రామస్తుల సహకారం లేకుండా హత్యలు జరగవని, అంతేగాక కిరాయి హంతకుల పాత్ర కూడ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలు జరిగిన మరుక్షణమే అన్ని నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. అయినా ఇంత వరకు కేసులో పురోగతి కనిపించలేదు. హత్యలు జరిగిన రెండో రోజు నుంచి అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిగినట్లు సమాచారం. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు వెంట తీసుకెళ్లారా.. లేక ఎక్కడైన పారి వేశారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం హత్య ఘటనా స్థలాన్ని దగ్గరగా ఉన్న ఓ బావిలో నీటిని బయటకు తీశారు. కాని ఆయుధాలు సమాచారం లభించ లేదు. పోలీసుజాగిలం బావి వద్ద కొద్ది సేపు ఆగి తిరిగి జాతీయ రహదారి వద్దకు పోయింది. అంతే దుండగులు హత్య అనంతరం నడుచుకుంటూ రోడ్డుపైకి వెళ్లినటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండంగా మాజీ ఎంపీపీ ఫోన్‌కు వచ్చిన కాల్స్‌పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలో మందుబాటిళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. హత్యలో ఓ యువకుని పాత్రపై స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు అనేకంగా వినిపిస్తుండంతో సమగ్ర విచారణ చేస్తున్నారు. -
ఘోరం.. అమానుషం
– జంట హత్యలపై ప్రముఖుల ఆగ్రహం – బా«ధితులను విచారించిన ఎస్పీ – మృతదేహాలను సందర్శించిన గౌరు, గంగుల – మృతదేహాలకు పోస్టుమార్టం నంద్యాల : వైఎస్సార్సీపీ నేత శిరివెళ్ల మాజీ ఎంపీపీ ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, ఆయన బావమరిది శ్రీనివాసరెడ్డిలను ప్రత్యర్థులు దారి కాచి బండరాళ్లు, వేట కత్తులతో దాడి చేసి హత్య చేయడం ఘోరం, అమానుషమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, పార్టీ నంద్యాల ఇన్చార్జి మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. గోవిందపల్లెలో హత్యకు గురైన ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి మృతదేహాలను శనివారం అర్ధరాత్రి శిరివెళ్ల సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఆధ్వర్యంలో పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను చూడటానికి గోవిందపల్లె గ్రామస్తులు వందల సంఖ్యలో తరలి వచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆసుపత్రిని చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి, యువనేత గంగుల నాని మృతదేహాలను చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి గ్రామంలో వివాద రహితులని, వీరిని అంతమొందించడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ నంద్యాల ఇన్చార్జి మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి మృతదేహాలను పరిశీలించారు. మాజీ ఎంపీ గుంగుల ప్రతాపరెడ్డి మేనల్లుడు గోపవరం గోకుల్‌రెడ్డి తన సన్నిహితులైన ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి మృతదేహాలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి భౌతిక కాయాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం–రవికృష్ణ, జిల్లా ఎస్పీ ప్రశాంతమైన గోవిందపల్లెలో జంట హత్యలు జరగడం బాధాకరం. హత్యలో 10 మందికి పైగా పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. వీరిని అరెస్ట్ చేయడానికి ఆదేశాలు జారీ చేశాం. ప్రత్యేక పోలీస్ బృందాలు అరెస్ట్ చేయడానికి గాలింపు చర్యలను చేపట్టాయి. త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తాం. దుర్మార్గపు చర్య గోవిందపల్లెలో మాపార్టీ నేతలు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థులు హతమార్చడం దుర్మర్గపు చర్య. ప్రభాకర్‌రెడ్డి రాజకీయాలకు తావు లేకుండా అందరినీ కలుపుకొని పోతూ గ్రామాభివృద్ధికి కృషి చేశాడు. ఇలాంటి వాటికి పార్టీ కేడర్ భయపడదు. పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి.–గౌరువెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు హత్యలు అమానుషం ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి హత్యలు బాధాకరం. వీరు సాయంత్రం వాకింగ్ పోయినప్పుడు ప్రత్యర్థులు దారి కాచి చంపడం అమానుషం. రాజకీయాలకు అతీతంగా ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి పనులు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరాం. –గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ 24 గంటలు గడవకముందే.. వివాహానికి హాజరు కావడానికి నేను నిన్న వచ్చినప్పుడు ప్రభాకర్‌రెడ్డి కలిసి మాట్లాడారు. కాని 24 గంటలు గడవకముందే ఆయనను విగత జీవిగా చూస్తున్నందుకు బాధగా ఉంది. చిన్నవయస్సులోనే తండ్రి హత్యకు గురైనా ప్రతీకారానికి పాల్పడకుండా ఓర్పు, సహనంతో గ్రామాభివృద్ధికి చేశారు. పోలీసులు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. –గంగుల ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీ ప్రశాంతత కాపాడాలి గోవిందపల్లె ప్రశాంతమైన గ్రామం. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే. తర్వాత అందరు నేతలు కలిసి మెలిసి ఉంటారనే మంచి పేరు ఉంది. కాని ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలి. –రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల ఇన్చార్జి