two thieves arrest
-
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు
సాక్షి, కురవి: బంగారు ఆభరణాలతో పాటు అపహరించిన రెండు సెల్ఫోన్లే ఆ దొంగలను పట్టించాయి. ఇద్దరు దొంగల అరెస్టుకు సంబంధించి మహబూబా బాద్ డీఎస్పీ నరేష్కుమార్ మంగళవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నా యి. మే 12న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన దండగల కనకమ్మ కురవిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి వచ్చి ఆలయ సత్రంలో బస చేసింది. ఉక్కపోత కారణంగా గది తలుపులు తీసి పడుకోగా.. కనకమ్మతో పాటు ఆమె బంధువుల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను, రెండు సెల్ఫోన్లను తీసి దాచిపెట్టారు. అర్థరాత్రి ఖమ్మం జిల్లా కేం ద్రంలోని సీతారాంపురం న్యూ కాలనీకి చెందిన నల్లగొండ రాము గది త లుపులు తీసి ఉండడాన్ని గమనించి బంగారు ఆభరణాలతో పాటు రెండు సెల్ఫోన్లను అపహరించాడు. తెల్లారాక గమనించిన బాధితులు కురవి పోలీ సులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కురవి ఎస్సై నాగభూషణం కేసు నమో దు చేసి రూరల్ సీఐ వెంకటరత్నం నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన సెల్ఫోన్ల కాల్ రికార్డును పరిశీలించగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని సీతారాంపురం న్యూ కాలనీకి చెందిన సాధం లక్ష్మినారాయణ చిరునామా లభ్యమైంది. ఆయనను విచారించగా నల్లగొండ రాము తనకు విక్రయించినట్లు తెలపడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా రాము నుంచి రూ.2.40లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కాగా, నల్ల గొండ రాము చిన్నతనంలోనే ఒక కేసులో జైలుకు వెళ్లినట్లు తెలిపారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా సహకారంతో నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ వెంకటరత్నం, కురవి ఎస్సై నాగభూషణం సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఇద్దరు దొంగల అరెస్ట్
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలో, సమీప గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన దబ్బా శంకర్(21), మానుకోట సిద్దార్థ వీధికి చెందిన జగ్గుల శివయ్య(19) కొంతకాలంగా చెడు వ్యసనాలకు అలవాటుపడి చోరీల బాటపట్టారు. వీరు 2016 డిసెంబర్లో కోర్టు సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించి పోలీసులకు చిక్కి జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చారు. అయినా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సీసీఎస్, టౌన్ పోలీసులు గురువారం విశ్వసనీయ సమాచారంతో మానుకోట వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న ఈ ఇద్దరు యువకులను చాకచక్యంగా పట్టుకున్నారు. వారిని విచారించగా ఇటీవల సంచలనం సృష్టించిన నారోజు సత్యమనోరమ బంగారు నగల షాపులో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. అలాగే మానుకోట టౌన్ పరిధిలో బస్టాండ్ రోడ్డులో ఓ రెడీమేడ్ షోరూం, సైకిల్ షాపులో, మయూరి జ్యూఝెలరీ షాపులో, కేసముద్రం మండల పరిధిలో ఓ దేవాలయంలోని హుండీలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే రోడ్లపై నడిచి వెళ్తున్న వృద్ధుల దృష్టి మరల్చి దొంగతనాలు చేసినట్లు తెలిపారు. వారిని విచారించిన అనంతరం వారి వద్ద నుంచి 2 సైకిళ్లు, 6 జీన్స్‌ప్యాంట్లు, రెండు షర్ట్లు, 8 టీషర్టులు, రూ.23,500 నగదు, 15 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్, టౌన్, రూరల్, సీసీఎస్ సీఐలు తిరుమల్, లింగయ్య, శ్రీనివాసులు, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు రమేష్‌బాబు, అశోక్ పాల్గొన్నారు. -
పగలు రెక్కీ.. రాత్రి దోపిడీ
అనంతపురం సెంట్రల్ : పగలు రెక్కి నిర్వహించడం, రాత్రిళ్లు దోపిడీ చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. చోర విద్యలో ఎంత నైపుణ్యం సాధించినా చివరకు పోలీసుల వలకు చిక్కి కటకటాలపాలయ్యారు ఇద్దరు దొంగలు. అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మల్లికార్జునవర్మ మాట్లాడారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అనంతపురం అశోక్‌నగర్‌కు చెందిన షేక్ రషీద్, కనగానపల్లి మండలం మద్దెలచెరువుకు చెందిన మల్లేపల్లి ప్రభంజన్‌రెడ్డి అనే దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 40 తులాల బంగారు, 9 తులాలు వెండి, బైక్, ఎల్ఈడీ టీవీలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.13 లక్షలు ఉంటుంది. చెడు వ్యసనాలతో దారి తప్పి.. తాగుడు, జూదం తదితర వ్యసనాలతో పాటు జల్సాలకు అలవాటు పడిన వీరు దొంగతనాలకు మరిగారు. గతంలో వైఎస్సార్ జిల్లాలోనూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇటీవల ఇద్దరూ కలిసి అనంతపురంలోని నందమూరినగర్, లక్ష్మీనగర్, భాగ్యనగర్, మండ్ల సుబ్బారెడ్డినగర్, జీసస్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఏడు దొంగతనాలు చేశారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి విలువైన బంగారు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. నిఘా నుంచి తప్పించుకోలేకపోయారు అనంతపురంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గట్టి నిఘా పెట్టారు. ఈసారి ఆ ఇద్దరు దొంగలూ తప్పించుకోలేకపోయారు. సాయినగర్‌లో దొంగలిద్దరూ ఉన్నట్లు అందిన పక్కా సమచారంతో గురువారం దాడి చేసి వారిద్దరినీ పట్టుకున్నారు. చైన్‌స్నాచింగ్ పాల్పడుతున్న ముఠానూ త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. టూటౌన్ సీఐ శుభకుమార్, ఎస్ఐలు జనార్దన్, క్రాంతికుమార్, శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.