త్యాగమూర్తుల ఆశయాలను కొనసాగిద్దాం
వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో
ఘనంగా గణతంత్ర దిన వేడుకలు
ఒంగోలు అర్బన్: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలిచ్చి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారని, వీరి ఆశయాలతో ముందుకుపోదామని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు రాజధాని విషయంలో కూడా స్వార్థంతో వ్యవహరిస్తున్నారు.
నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ త్యాగమూర్తుల ప్రాణత్యాగానికి అర్థం లేకుండా నేటి రాజకీయ నాయకులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, మహిళా నాయకులు బడుగు ఇందిరా, గంగాడ సుజాత, స్టీరింగ్ కమిటీ సభ్యులు తోటపల్లి సోమశేఖర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్లో...
నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ విజయకుమార్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీరు శ్రీనివాస్, రెవెన్యూ అధికారి పందిళ్ళకుమారి, మేనేజర్ శ్రీహరి, కార్యక్రమ సూపర్వైజర్ మోహనరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.