ఉదయ్ కిరణ్ అంతిమ యాత్ర ప్రారంభం
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఫిల్మ్ ఛాంబర్ నుంచి భౌతికకాయాన్ని ఎర్రగడ్డ స్మశాన వాటికకు తరలిస్తున్నారు. అంతకు ముందు ఉదయ్ కిరణ్ పార్థివ దేహాన్ని పలువురు సినీ ప్రముఖలు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. మరోవైపు తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. పలువురు మహిళలు ....ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని చూసి దుఃఖం ఆపుకోలేకపోయారు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున అభిమానులు, సినీ పరిశ్రమకు చెందినవారు పాల్గొన్నారు.